అన్వేషించండి

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి లేట్ నైట్ ఎక్స్ వేదికగా రిషభ్ పంత్ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ చేశాడు.

IPL Rishabh Pant Requests Land From Uttarakand CM Pushkar Singh Dhami:  ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియాలో చేసిన ఒక అర్థరాత్రి పోస్ట్ వైరల్ గా మారింది. శనివారం అర్ధరాత్రి 12:46 గంటలకు పంత్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని టాగ్ చేస్తూ ల్యాండ్ అక్విజిషన్ లో హెల్ప్ చేయాలని కోరాడు. తాను ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కి బేస్ షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ పోస్ట్ చేసిన టైమింగ్, అందులోని గ్రామర్ మిస్టేక్స్ చూసి అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా పంత్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

అర్థరాత్రి వేళ పంత్ ట్వీట్.. గ్రామర్ మిస్టేక్స్ పై ఫ్యాన్స్ ఆందోళన
"హలో సర్ ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్ లోకల్ గా ఉంటూ చాలా కాలమైంది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కి నా బేస్ షిఫ్ట్ చేయడానికి ల్యాండ్ కొనడానికి ట్రై చేస్తున్నా. కానీ ప్రశాంతంగా ఉండటానికి పెద్ద స్థలం దొరకడం లేదు. నా హోమ్ స్టేట్ అంటే నాకు చాలా ఇష్టం. ల్యాండ్ అక్విజిషన్ లో నాకు హెల్ప్ చేయాలని కోరుతున్నా. గతంలో స్టేట్ ప్రమోషన్స్ చేసినప్పుడు రావాల్సిన ల్యాండ్ కూడా పెండింగ్ లో ఉంది. నా పహాడీ పీపుల్ దగ్గరకు వచ్చి స్టేట్ డెవలప్‌మెంట్ కి హెల్ప్ చేయాలని ఉంది. మూడేళ్ల నుంచి ల్యాండ్ కోసం వెయిట్ చేస్తున్నా" అని పంత్ రాసుకొచ్చాడు.

Read Also: IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ ! 

పంత్ పోస్ట్ పై సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాజిటివ్ రిప్లై
పంత్ పోస్ట్ వైరల్ అవ్వడంతో సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. క్రికెట్ లో పంత్ సాధించిన అచీవ్‌మెంట్స్‌ను పొగుడుతూ ఉత్తరాఖండ్ గర్వపడేలా చేశాడని ప్రశంసించారు. "డియర్ రిషభ్, నువ్వు ఉత్తరాఖండ్ గర్వకారణం. ప్రపంచ వేదికపై దేవభూమి పేరును నిలబెట్టావు. సొంత గడ్డపైకి వచ్చి సేవ చేయాలనే నీ ఆలోచన అభినందనీయం. నువ్వు లేవనెత్తిన ప్రాబ్లమ్ పై సంబంధిత అఫీషియల్స్‌కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఆఫీసర్లు త్వరలోనే నిన్ను కాంటాక్ట్ అయి రూల్స్ ప్రకారం హెల్ప్ చేస్తారు" అని ధామీ రిప్లై ఇచ్చారు.

ఐపీఎల్ 2027 ముందు లక్నో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కి పంత్ ట్రేడ్
గత జూన్ లో ఐపీఎల్ 2027 ఆక్షన్ కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పంత్ తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ అయ్యాడు. రూ. 15 కోట్లకు ఢిల్లీ పంత్‌ను సొంతం చేసుకోగా, లక్నో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ. 13.5 కోట్లకు ట్రేడ్ చేసుకుంది. పంత్ ల్యాండ్ ఇష్యూ త్వరలోనే క్లియర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asian Games Squad: జపాన్ ఏర్పాట్లపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి.. ఏషియన్ గేమ్స్ కు టీమ్ ఇండియా బి టీమ్ పంపే ఆలోచ‌న‌లో బోర్డు!
జపాన్ ఏర్పాట్లపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి.. ఏషియన్ గేమ్స్ కు టీమ్ ఇండియా బి టీమ్ పంపే ఆలోచ‌న‌లో బోర్డు!
Team India U-19 Squad: సెహ్వాగ్, ద్రవిడ్ కొడుకులకు ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఎంపిక కాక‌పోవ‌డానికి ఆ బీసీసీఐ రూలే కార‌ణమా..!!
సెహ్వాగ్, ద్రవిడ్ కొడుకులకు ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఎంపిక కాక‌పోవ‌డానికి ఆ బీసీసీఐ రూలే కార‌ణమా..!!
Shubman Gill Reaction: చేతిలో ఉన్న మ్యాచ్ చేజారడంపై గిల్ కామెంట్స్... డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ పై కీలక వ్యాఖ్యలు!
చేతిలో ఉన్న మ్యాచ్ చేజారడంపై గిల్ కామెంట్స్... డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ పై కీలక వ్యాఖ్యలు!
Sri Lanka Epic Draw Vs India: కొలంబో టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట బోల్తా... శ్రీలంక ఊహించని వీరోచిత పోరాటంతో మ్యాచ్ డ్రా!
కొలంబో టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట బోల్తా... శ్రీలంక ఊహించని వీరోచిత పోరాటంతో మ్యాచ్ డ్రా!
Advertisement

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget