Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Crime Investigation Thriller OTT : ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్, టీజర్ భారీ హైప్ క్రియేట్ చేయగా ట్రెండ్ అవుతోంది.

New Crime Investigation Thriller OTT Streaming : ఈ వారం ఓటీటీల్లో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా మరో లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీలో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చూస్తే...
నగరంలో వరుస హత్యలు కలకలం రేపగా... దాని విచారణ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఆ మూవీనే పంచనామా (Panchanama). జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఫ్రీగా కూడా అందుబాటులోకి రావొచ్చు.
ఈ మూవీకి సిగతాపు రమేష్ దర్శకత్వం వహించగా... జాన్ రమేష్, ప్రజ్ఞా రెడ్డి, కె దినేష్, హేమ సుధ, అపూర్వ శ్రీనివాసన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హార్దిక క్రియేషన్స్ బ్యానర్‌పై గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు.
Also Read : DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
స్టోరీ ఏంటంటే?
నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. దీని వెనుక ఉన్నది ఎవరో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటారు. హంతకుడి గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? మోటివ్ ఏంటి? సంక్లిష్మైన కేసును పోలీసులు ఎలా ఛేదించారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఊహించని మలుపులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో అనుక్షణం కథలో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.
Also Read : DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























