అన్వేషించండి

Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

Cheyutha Pensions:తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రక్రియను ప్రారంభించింది. శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అయితే అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ప్రభుత్వం చేయూత కొత్త పింఛన్ల మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసింది.
  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరి తేదీ లేదు, మే 15 నుండి మంజూరు.
  • ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు, ఆదాయ పరిమితులు వర్తిస్తాయి.
  • ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర పింఛన్లు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు.

Cheyutha Pensions:తెలంగాణలోని నిరుపేదల, అణగారిన వర్గాల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి అధికారికంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. సామాజిక భద్రతను కల్పించడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందజేయాలని లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే... దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి చివరి తేదీ లేదు. ఇది కంటిన్యూగా సాగా ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఎవరు అర్హులు?

ప్రభుత్వం పింఛన్ల మంజూరులో కొన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది. వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, డయాలసిస్‌ బాధితులు, దివ్యాంగుల విభాగంలో థలసీమియా, సికిల్‌ సెల్, హిమోఫిలియో వ్యాధులతో బాధపడుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత ప్రమాణాలు, ఆదాయ పరిమితులు 

పింఛన్ పొందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ఆర్థికపరమైన రూల్స్ పాటించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం 1.50 లక్షల లోపు ఉండాలి. పట్టణాల్లో ఉండేవారికి ఈ పరిమితి 2 లక్షల వరకు పెంచారు. దరఖాస్తుదారులకు 3 ఎకరాల కంటే ఎక్కవ మాగాణి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉండకూడదు. 

ఎవరు అనర్హులు?

ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం కొన్ని అనర్హతలను కూడా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది. ప్రైవేటు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధదిలో పని చేస్తున్న వారు అనర్హులు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు అనర్హులు. పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులు.. ఫోర్ వీలర్‌ వాహనాలు, లేదా భారీ వాహనాలు ఉన్న వారికి పింఛన్ వర్తించదు. ఇప్పటికే ఇతర ప్రభుత్వ పింఛన్ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు కూడా అనర్హులు. 

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. కొత్తగా పింఛను కోరుకునే వారు కొన్ని స్టెప్స్‌ ఫాలో అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చేయూత అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

  • ఫామ్‌లో అడిగిన వివరాలను స్పష్టంగా నింపి, సంబంధిత పత్రాలను అటాచ్ చేయాలి. 
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో అందజేయాలి. 
  • పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, లేదా పురపాలక కమిషనర్లకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 
  • గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అయితే తమ దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి స్థానిక పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులను సంప్రదించి కన్ఫామ్‌ చేసుకోవాలి. 

సామాజిక భద్రత పింఛన్లు అనేవి సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఒక భరోసా. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, జీవనోపాధి కష్టంగా మారిన మహిళలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా ప్రకటించడం ద్వారా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది.

Frequently Asked Questions

చేయూత పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి?

చేయూత పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయబడతాయి.

చేయూత పింఛన్ కోసం ఎవరు అర్హులు?

ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు అర్హులు. బోదకాలు, డయాలసిస్, థలసీమియా, సికిల్ సెల్, హిమోఫిలియా వ్యాధుల బాధితులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

చేయూత పింఛన్ పొందడానికి ఆదాయ, భూమి పరిమితులు ఏమిటి?

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు ఉండాలి. 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉండకూడదు.

చేయూత పింఛన్ కోసం ఎవరు అనర్హులు?

ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, పెట్రోల్ పంపు యజమానులు అనర్హులు. ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నవారు, లేదా ఇతర ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారు కూడా అనర్హులు.

కొత్త పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు చివరి తేదీ ఉందా?

చేయూత వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసి నింపి, సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. ఈ దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి చివరి తేదీ లేదు, ఇది నిరంతరంగా సాగుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget