ఖరీఫ్-2026 సీజన్ కోసం పీఎంఎఫ్‌బీవై పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15, 2026 వరకు పొడిగించారు. రైతులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
PMFBY Last Date: పంట బీమా పథకం పీఎం ఫసల్ బీమా యోజన దరఖాస్తు గడువును ఆగస్టు 15 వరకు పొడించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రైతులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- ఖరీఫ్-2026 PMFBY గడువు ఆగస్టు 15కు పొడిగింపు.
- ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుంచి పంటలకు ఆర్థిక భరోసా.
- రుణం తీసుకున్న, తీసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
PMFBY Last Date: ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రైతులకు ప్రభుత్వం అలర్ట్ ఇచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, కరువు లేదా తెగుళ్ల వల్ల పంట నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15, 2026 వరకు పొడిగించింది. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులకు ఈ గడువు పెంపు ఎంతో ఊరట కలిగిస్తుంది. ఇంకా బీమా నమోదు చేసుకోని రైతులు తక్షణమే సమీపంలోని సీఎస్సీ, మీసేవ కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పంటల వారీగా బీమా ప్రీమియం వివరాలు (ఎకరానికి):
రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు,క్లెయిమ్ వివరాలు
పంట పేరు - ప్రీమియం (ఎకరానికి) -బీమా మొత్తం (ఎకరానికి) - నమోదు చివరి తేదీ
వరి (Paddy) రూ.76 - రూ.840 రూ.40,000 - రూ.76,860 వరకు 15 ఆగస్టు 2026
కంది రూ.36 - రూ.400 రూ.38,000 15 ఆగస్టు 2026
జొన్న రూ.38 15 ఆగస్టు 2026
రాగి రూ.170 15 ఆగస్టు 2026
మిరప రూ.360 - రూ.4,500
పత్తి రూ.1,140 - రూ.2,100 రూ.38,000
వేరుశెనగ రూ.280 - రూ.560 24 జులై 2026
టమాటా రూ.1,500 24 జులై 2026
ఎక్కడ నమోదు చేసుకోవచ్చు?
మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్లు (CSC - డిజిటల్ సేవ)
సమీప ప్రభుత్వ కేంద్రాలు లేదా బ్యాంకులు
PMFBY అధికారిక పోర్టల్ (pmfby.gov.in) లేదా PMFBY మొబైల్ యాప్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు
కావాల్సిన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డు
- పట్టాదారు పాస్ పుస్తకం
- బ్యాంకు పాస్ పుస్తకం
- ఈ-క్రాప్ నమోదు
- చెల్లింపు పూర్తయ్యాక రసీదు డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
ముఖ్య సూచనలు
- పంట రుణం తీసుకున్న వారైనా, తీసుకోని వారైనా ఈ బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చు.
- దరఖాస్తు చేసేటప్పుడు ఎటువంటి తప్పు వివరాలు నమోదు చేయకూడదు.
- పంట నష్టం వాటిల్లితే, నష్ట తీవ్రతను అంచనా వేసి పరిహారం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు.
- పీఎంఎఫ్బీవై నమోదుకు ఆగస్టు 15, 2026 వరకు మాత్రమే గడువు ఉండడంతో రైతులందరూ వెంటనే స్పందించి, తక్కువ ప్రీమియంతో తమ పంటలకు పూర్తి భద్రత కల్పించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Frequently Asked Questions
పీఎంఎఫ్‌బీవై పంటల బీమా నమోదుకు చివరి తేదీ ఎప్పుడు?
పీఎంఎఫ్బీవై పథకం దేని గురించి?
ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, కరువు లేదా తెగుళ్ల వల్ల పంట నష్టం వాటిల్లితే రైతులకు ఆర్థిక భరోసా కల్పించే పథకమే పీఎంఎఫ్‌బీవై.
రైతులు పీఎంఎఫ్‌బీవై కోసం ఎక్కడ నమోదు చేసుకోవచ్చు?
రైతులు సమీపంలోని సీఎస్సీ, మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కేంద్రాలు, బ్యాంకులు, లేదా PMFBY అధికారిక పోర్టల్/యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
పీఎంఎఫ్‌బీవై నమోదుకు అవసరమైన పత్రాలు ఏమిటి?
నమోదుకు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, మరియు ఈ-క్రాప్ నమోదు అవసరం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















