ప్రపంచ వింతలు అంటే ప్రజలను ఆశ్చర్యపరిచే ప్రత్యేకమైన, అద్భుతమైన నిర్మాణాలు లేదా ప్రదేశాలు. ఇవి తమ అందం, చరిత్ర, నిర్మాణం లేదా ప్రత్యేకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచంలో కేవలం 7 వింతలనే ఎందుకు పరిగణిస్తారు? 8వ వింత లేదా ? అసలు వింతల చరిత్ర, దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

- ప్రపంచంలోని వింతలు ప్రత్యేకమైన, అద్భుతమైన నిర్మాణాలని గ్రీకులు గుర్తించారు.
- పాత వింతలు నశించగా, కొత్తవి ఓటింగ్ ద్వారా ఎంపికయ్యాయి.
- అధికారికంగా ఎనిమిదో వింత లేకున్నా, ప్రత్యేకతకు గౌరవం దక్కుతుంది.
ప్రపంచంలో కొన్ని వింతల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా 7 వింతలు (World Wonders) అనే పేరే వినిపిస్తుంది. అసలు వీటిని వింతలు అని ఎందుకు అంటారు అని చాలామందికి చిన్న సందేహం వస్తుంది. దాంతోపాటు ప్రపంచంలో కేవలం 7 వింతలు మాత్రమే ఎందుకు ఉన్నాయి. నిజంగానే 8వ వింత ఏర్పడలేదా? అని కూడా ఆలోచించే వారు లేకపోలేదు. దీనికి సమాధానం, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
వింతలు అంటే ఏమిటీ ?
చూసిన వెంటనే ప్రజలు బాగా ఆశ్చర్యపోయేలా ఉండే ప్రత్యేకమైన, విలక్షణమైన నిర్మాణాలను వింతలు అని పిలుస్తున్నారు. ఆ జాబితాలో చేరడం సైతం అంత ఈజీ కాదు. ఈ ప్రదేశాలు తమ అందం, చరిత్ర, నిర్మాణం లేదా ప్రత్యేకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిని చూసేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు దేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. వీటిలో అనేక వింతలు వేల సంవత్సరాల కిందటే నిర్మించారు. అయినప్పటికీ, నేటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
ప్రపంచంలో వింతలు 7 మాత్రమే ఎందుకు ఉన్నాయి?
దాదాపు 2,000 సంవత్సరాల కిందట, కొందరు గ్రీకు విద్వాంసులు ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన, అందమైన కట్టడాల జాబితాను తయారుచేవారు. ఆ సమయంలో వారు 7 ప్రముఖ ప్రదేశాలు, కట్టడాలను ఎంచుకున్నారు. ఆ రోజుల్లో ఏడు అనే సంఖ్యను ప్రత్యేకమైనదిగా, శుభప్రదంగా భావించేవారు. ఆ కారణంగానే వారు 7 వింతల జాబితా రూపొందించారు. ఆ తర్వాత ఈ జాబితా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం తెలిసిందే.
కాలక్రమేణా ఆ నాటి పాత 7 వింతలలో ఎక్కువ భాగం నశించిపోయాయి. ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్ మాత్రమే వాటిలో మిగిలి ఉంది. ఆ తర్వాత 2007 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించగా.. ప్రజలు ఓటు వేసి కొత్త 7 వింతలను ఎన్నుకున్నారు. వీటినే నేడు ప్రపంచంలోని 7 కొత్త వింతలు అని పిలుస్తున్నారు.
8వ వింత లేదా..
8వ వింత ఏర్పడకూడదు అనే రూల్ ఏదీ లేదు. నిజానికి 7 వింతలు అనేది ఒక ప్రసిద్ధ జాబితా పేరు మాత్రమే. భవిష్యత్తులో ఏదైనా కొత్త, చాలా ప్రత్యేకమైన ప్రదేశం తయారైతే, ప్రజలు దాని గౌరవార్థం ప్రపంచంలో 8వ వింత అని పిలవవచ్చు. కానీ ప్రపంచ అధికారిక జాబితాలో ఇప్పటికీ 7 వింతలు మాత్రమే ఉన్నట్లు పరిగణిస్తారు.
ప్రజలు చాలాసార్లు ఏదైనా కొత్త, అద్భుతమైన కట్టడం, వంతెన, స్టేడియం లేదా ప్రకృతి సహజసిద్ధంగా ప్రదేశాన్ని కూడా 8వ వింత అని భవిష్యత్తులో అనవచ్చు. అది గౌరవించే అవకాశం మాత్రమ. అధికారికంగా మాత్రం 8వ వింతగా పరిగణించరు.
నేడు ఉన్న 7 ప్రపంచ వింతలు ఏవి ?
నేడు ప్రపంచంలోని కొత్త 7 వింతలలో తాజ్ మహల్ మాత్రం భారత్‌లో ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మాచు పిచ్చు, పెట్రా, కొలోసియం, చిచెన్ ఇట్జా, క్రిస్ట్ ద రిడీమర్ ఉన్నాయి. ఇవన్నీ తమ ప్రత్యేకమైన గుర్తింపు, అందంతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి.
ప్రపంచంలో నేటికీ చాలా అందమైన, విలక్షణమైన ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. అయినప్పటికీ, చరిత్ర, సాంప్రదాయం కారణంగా 7 వింతలు అనే అంశం మాత్రం మారలేదు. కానీ ఏడు వింతల్ని మాత్రం ఓటింగ్ ద్వారా ప్రజలు ఎన్నుకున్నారు. అందుకే ప్రపంచంలో అధికారికంగా ఇప్పటికీ ఏడు వింతలు ఉన్నాయి.
Frequently Asked Questions
ప్రపంచ వింతలు అంటే ఏమిటి?
ప్రపంచంలో కేవలం 7 వింతలు మాత్రమే ఎందుకు ఉన్నాయి?
సుమారు 2,000 సంవత్సరాల క్రితం, గ్రీకు పండితులు 'ఏడు' అనే సంఖ్యను శుభప్రదంగా భావించి 7 ప్రత్యేక కట్టడాలను ఎంపిక చేశారు. కాలక్రమేణా, ప్రజలు ఓటు వేసి 2007లో కొత్త 7 వింతలను ఎన్నుకున్నారు.
8వ ప్రపంచ వింత అంటూ నిజంగా ఏదైనా ఉందా?
అధికారికంగా 8వ ప్రపంచ వింత అంటూ ఏదీ లేదు. '7 వింతలు' అనేది ఒక ప్రసిద్ధ జాబితా పేరు మాత్రమే. ప్రజలు ఏదైనా కొత్త, అద్భుతమైన ప్రదేశాన్ని గౌరవార్థం 8వ వింత అని పిలవవచ్చు, కానీ అది అధికారికం కాదు.
ప్రస్తుతం ఉన్న 7 ప్రపంచ వింతలు ఏవి?
ప్రస్తుతం ఉన్న కొత్త 7 ప్రపంచ వింతలలో తాజ్ మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మాచు పిచ్చు, పెట్రా, కొలోసియం, చిచెన్ ఇట్జా, క్రిస్ట్ ద రిడీమర్ ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
ట్రెండింగ్ వార్తలు























