శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే తిరుమల కొండపై అప్పుడప్పుడు వన్యప్రా్రణులు సంచరిస్తుంటాయి. తాజాగా తిరుమలలో భారీ పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జనావాసాల మధ్య పాములు సంచరిస్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు