అన్వేషించండి

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, విద్యా, రవాణా తదితర కీలక శాఖలకు కొత్త అధికారులను నియమించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేసింది.
  • పర్యాటకం, విద్య, ఆరోగ్య, రవాణా శాఖలకు కొత్త అధికారులు వచ్చారు.
  • ఏపీటీడీసీకి పట్నంశెట్టి రవి సుభాష్, ఆమ్రపాలి రిలీవ్ అయ్యారు.
  • గోదావరి పుష్కరాలు, టీటీడీకి ప్రత్యేక, జాయింట్ అధికారులను నియమించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో భారీ మార్పులు చేపట్టింది. 20 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ, కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎస్.ఎస్. రావత్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, జె. శ్యామలరావును పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే రవాణా, రోడ్లు-భవనాల శాఖ కార్యదర్శిగా కోనా శశిధర్, ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఎఫ్ఎస్ అధికారి ఎం. శివప్రసాద్‌ను నియమించారు.

జీఏడీలో రిపోర్ట్ చేయనున్న ఆమ్రపాలి కాటా
పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ (APTDC) ఎండీ బాధ్యతల నుంచి ఆమ్రపాలి కాటాను రిలీవ్ చేస్తూ, తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనా శాఖ (GAD)కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆమె స్థానంలో పట్టంశెట్టి రవి సుభాష్‌ను ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ, ఏపీపీఎస్సీ సీఈఓ, కార్యదర్శి బాధ్యతలను పూర్తి అదనపు బాధ్యతలుగా (FAC) అప్పగించారు. కాగా, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిగా సురేష్ కుమార్‌ను, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నారాయణ భరత్ గుప్తాను నియమించారు. పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా ముత్యాలరాజు రేవు బాధ్యతలు చేపట్టనున్నారు.

వైద్యారోగ్య, ఇతర శాఖల్లో కూడా పలు కీలక బాధ్యతలను అప్పగించారు. కె.వి.ఎన్. చక్రధర బాబుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హెప్సిబా రాణి కొర్లపాటిని నియమించి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఎఫ్ఏసీ అప్పగించారు. పి. అరుణ్ బాబు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా, ప్రఖర్ జైన్ వీఎమ్‌ఆర్‌డీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌గా చేతన్ టి.ఎస్.లకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.  

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఎం. జయకృష్ణ నియమితులు కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్) బాధ్యతలను ప్రభల గోపీనాథ్‌కు అప్పగిస్తూనే, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్‌ను కూడా అదే హోదాలో కొనసాగించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఈఓగా ఎ.ఎ.ఎల్. పద్మావతిని, ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఐఎఫ్ఎస్ అధికారి బి. సునీల్ కుమార్ రెడ్డికి ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్లో IAS అధికారుల బదిలీలు, నియామకాలు...

ఎస్ ఎస్. రావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ.

జె. శ్యామలరావు – పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ.

అమ్రపాలి కాటా – ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్. తదుపరి పోస్టింగ్ కోసం GADకు రిపోర్ట్ చేయాలని ఆదేశం.

కోనా శశిధర్ – రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా నియామకం.

ఎం. శివ ప్రసాద్, IFS – ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ.

పట్టంశెట్టి రవి సుభాష్ – ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం. APPSCలో CEO, సెక్రటరీ పోస్టులకు FAC బాధ్యతలు.

కె.వి.ఎన్. చక్రధర బాబు – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా FAC బాధ్యతలు.

హెప్సిబా రాణి కొర్లపాటి – హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం; ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా FAC.

పి. అరుణ్ బాబు – డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా నియామకం.

సురేష్ కుమార్ – గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియామకం.

నారాయణ భరత్ గుప్తా – గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం.

ముత్యాలరాజు రేవు – పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా బదిలీ.

ఎన్. తేజ్ భరత్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్.

ప్రఖర్ జైన్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా నియామకం.

గీతాంజలి శర్మ – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీగా FAC బాధ్యతలు.

చేతన్ టి.ఎస్. – డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా FAC బాధ్యతలు.

డా. ఎ. శరత్ (రిటైర్డ్ IAS) – తిరుమల తిరుపతి దేవస్థానాల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)గా కొనసాగింపు.

టీటీడీలో హెల్త్ & ఎడ్యుకేషన్ విభాగానికి జాయింట్ ఈవోగా డా. ఎ. శరత్ కొనసాగింపు.

ప్రభల గోపీనాథ్‌కు టీటీడీ జేఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్) బాధ్యతలు.

ప్రభల గోపీనాథ్ – టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)గా నియామకం.

ఎ.ఎ.ఎల్. పద్మావతి – ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా FAC బాధ్యతలు.

ఎం. జయకృష్ణ – తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియామకం.

బి. అనిల్ కుమార్ రెడ్డి – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్.

బి. సునీల్ కుమార్ రెడ్డి, IFS – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త కమిషనర్‌గా ఎం. జయకృష్ణ IAS.

ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు ఎ.ఎ.ఎల్. పద్మావతికి FAC బాధ్యతలు.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎలాంటి మార్పులు చేపట్టింది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో భారీ మార్పులు చేపట్టింది. పలువురు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ, కొత్త పోస్టింగ్‌లు కేటాయించింది.

ఎస్.ఎస్. రావత్, జె. శ్యామలరావులకు ఏ పోస్టింగ్‌లు కేటాయించారు?

ఎస్.ఎస్. రావత్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, జె. శ్యామలరావును పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు.

ఆమ్రపాలి కాటాను ఏ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు?

ఆమ్రపాలి కాటాను పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ (APTDC) ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక అధికారులుగా ఎవరిని నియమించారు?

గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం సురేష్ కుమార్‌ను ప్రత్యేక అధికారిగా, నారాయణ భరత్ గుప్తాను జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్ ఎవరు?

ఎం. జయకృష్ణ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget