అన్వేషించండి

TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?

TDP vs Janasena: ఏపీ కూటమి ప్రభుత్వంలో బయట సఖ్యత ఉన్నా, సోషల్ మీడియాలో టీడీపీ - జనసేన శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం నడుస్తోంది. ఎన్టీఆర్ డైలాగ్ వివాదం నుండి నారా లోకేష్ వరకు అసలు కథేంటి?

AP Alliance Politics:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం అత్యంత ఐక్యంగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పర సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, అభివృద్ధి ఎజెండాతో పాలన అందిస్తున్నారు. ప్రభుత్వ వేదికలపై, సమీక్షా సమావేశాల్లో, మీడియా ముందూ ఇరువురి నేతల మధ్య చక్కని సమన్వయం కనిపిస్తోంది. అయితే, భౌతిక ప్రపంచంలో సజావుగా సాగుతున్న ఈ పొత్తు.. డిజిటల్ ప్రపంచంలో, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. బయట నేతలు చూపుతున్న కలుపుగోలుతనం, క్షేత్రస్థాయి సోషల్ మీడియా కార్యకర్తల మధ్య మచ్చుకైనా కనిపించడం లేదనేది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

సఖ్యతకు సోషల్ మీడియానే కీలకం

ప్రస్తుత ఆధునిక రాజకీయాన్ని సోషల్ మీడియా శ్రేణులే ఎక్కువ భాగం శాసిస్తున్నాయి. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాలను పరిశీలిస్తే.. పార్టీ సిద్ధాంతాల కంటే సినీ అభిమానం, హీరోల ఇమేజ్ కాపాడుకోవడమే ప్రధాన ఎజెండాగా మారుతోంది. రాజకీయ సోషల్ మీడియా ప్రతినిధులుగా చలామణి అవుతున్న వారిలో అత్యధికులు మూలాల్లో సినీ అభిమానులే కావడమే దీనికి కారణం. దాంతో ప్రతి చిన్న అంశమూ నందమూరి వర్సెస్ మెగా కాంపౌండ్ ఫ్యాన్ వార్‌గా రూపాంతరం చెందుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, ఈ డిజిటల్ శత్రుత్వం ఏమాత్రం తగ్గకపోగా రోజుకో కొత్త వివాదంతో రగులుతూనే ఉంది.

కొరియన్ కనకరాజుతో మరింత వివాదం

కొరియన్ కనకరాజు సినిమా వివాదం ఈ సోషల్ మీడియా వార్‌ను మరింత పరాకాష్ఠకు చేర్చింది. అందులో మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాలోని ఐకానిక్ డైలాగ్ “అమెచ్యూరిష్ స్ట్రోక్స్”ను స్పూఫ్ చేయడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహానాయకుడిని కించపరిచే కుట్ర జరిగిందని, అది మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రంలో ఉండటంతో కావాలనే చేశారంటూ ఆరోపణలు గుప్పించాయి. మరోవైపు, సినిమా రంగంలో క్లాసిక్ డైలాగ్‌లను సరదాగా వాడటం సాధారణమేనని, దీన్ని రాజకీయ రంగు పులుమడం అనవసరమని జనసేన లేదా మెగా అభిమానులు తిప్పికొడుతున్నారు.

నారా లోకేష్ స్పందించాలంటున్న టీడీపీ సోషల్ మీడియా సైనికులు

ఈ రచ్చ కేవలం సినీ వివాదానికే పరిమితం కాకుండా, పొలిటికల్ లీడర్ల ఇమేజ్‌ను టార్గెట్ చేసే స్థాయికి వెళ్లడమే ఇక్కడ గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ ఇమేజ్‌ను కించపరుస్తుంటే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదంటూ కొంతమంది వ్యూహాత్మకంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా మొదలైన ఈ పోరులోకి లోకేష్, పవన్ కళ్యాణ్ నేరుగా లాగాలనుకునే రాజకీయం మరింత వేడెక్కింది. పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, ఇరు పార్టీల అధినేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విద్వేషపూరిత పోస్టులు పెట్టడం సర్వసాధారణంగా మారింది.

సీరియస్‌గా తీసుకోలేరు.. లైట్ తీసుకోలేరు!

ఈ పరిస్థితి ఇప్పుడు టీడీపీ, జనసేన అధిష్టానాలకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది. క్షేత్రస్థాయిలో, నాయకత్వ స్థాయిలో సఖ్యత ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో నిరంతరం సాగుతున్న ఈ సైబర్ వార్ వల్ల శ్రేణుల మధ్య క్రమంగా శత్రుత్వం పెరిగే ప్రమాదం ఉందని   హెచ్చరిస్తున్నారు. వీటిని కంట్రోల్ చేయడం ఇటు లోకేష్‌కు, అటు పవన్ కళ్యాణ్‌కు అంత తేలికైన విషయమేమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ట్రోలింగ్స్‌పై అధినేతలు బహిరంగంగా స్పందిస్తే, ఆ చిల్లర వివాదాలకు మరింత ప్రచారం కల్పించినట్లవుతుంది. సైలెంట్‌గా ఉంటే ఇది మరింత పెరిగి పెద్దదయ్యే ప్రమాదం ఉంది.

కానీ చల్లబరచాల్సిందే! 

  ప్రజాస్వామ్యంలో పొత్తులు, ప్రభుత్వాలు సుస్థిరంగా కొనసాగాలంటే క్షేత్రస్థాయిలోనే కాదు, డిజిటల్ సైన్యాల మధ్య కూడా క్రమశిక్షణ, అవగాహన అవసరం. సినిమా ఫ్యాన్ వార్స్‌ను రాజకీయాలకు అంటగట్టడం వల్ల కూటమి ధర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అధిష్టానాలు తక్షణమే రంగంలోకి దిగి, తమ సోషల్ మీడియా వింగ్‌లను క్రమశిక్షణలో పెట్టకపోతే.. డిజిటల్ వేదికలపై సాగుతున్న ఈ నిశ్శబ్ద సమరం భవిష్యత్తులో అసలు రాజకీయాన్నే ప్రభావితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget