అన్వేషించండి

Local Body Elections AP 2026: పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?

TDP Janasena Internal Fight: గోదావరి జిల్లాల్లో టీడీపీ-జనసేన ద్వితీయ శ్రేణి నేతల మధ్య అంతర్గత పోరు పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇవి పెరగకుండా రెండు పార్టీలు పెద్దలు జాగ్రత్తలు తీసుకోగలరా?

Chandrababu Pawan Kalyan Alliance Issues: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికార కూటమి పచ్చని సంసారంలో స్థానిక సంస్థల ఎన్నికల సెగలు రేపుతోంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మైత్రి ఫెవికాల్ బంధంలా అత్యంత బలంగా కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి సీన్ పూర్తిగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల నాటి త్యాగాలు, సర్దుబాట్లు ఒకెత్తయితే.. ఇప్పుడు ముంచుకొస్తున్న స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ  ఎన్నికల వేళ ఏ గ్రామానికి ఆ గ్రామంలో సీట్ల పంచాయితీ ముదిరిపాకాన పడుతోంది. పొత్తుల రొంపిలో ఇరు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, అటు తమ్ముళ్లు, ఇటు జనసైనికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గోదావరి జిల్లాల్లో సమస్యలు

ముఖ్యంగా పిఠాపురం, భీమవరం, అమలాపురం నియోజకవర్గాల అంతర్గత గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పల్లెల్లో ప్రెసిడెంట్  సీటు ఎవరిదనే దానిపై హోరాహోరీ పోరు సాగుతోంది. గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ వేధింపులను తట్టుకుని, కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన స్థానిక టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే సీటునే జనసేనకు త్యాగం చేశాం, కనీసం ఊరి సర్పంచ్ సీటైనా మాకు ఇవ్వకపోతే ఎలా  అని గట్టిగా నిలదీస్తున్నారు. మరోవైపు, తమ అధినేత నియోజకవర్గం కాబట్టి మెజారిటీ గ్రామాలు తమకే దక్కాలని జనసైనికులు పట్టుబడుతుండటంతో అంతర్గత వర్గపోరు పీక్స్‌కు చేరింది.

భీమవరం, అమలాపురంలో అదే సీన్ 

పశ్చిమ గోదావరి కేంద్రమైన భీమవరంలోనూ ఇదే తరహా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.  ఏ గ్రామంలో ఏ పార్టీ వార్డు దక్కించుకోవాలి? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? అనే అంశంపై ప్రతి ఊరిలోనూ రచ్చబండ పంచాయితీలు జరుగుతున్నాయి. ఉమ్మడి వేదికలపై పైకి నవ్వుతూ షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంటున్న స్థానిక నేతలు.. లోపల మాత్రం ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఒకరు పిలిచిన కార్యక్రమాలకు మరొకరు డుమ్మా కొట్టడం, లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో పరోక్ష విమర్శలతో పోస్టులు పెట్టుకోవడం వంటి పరిణామాలు క్షేత్రస్థాయిలో అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. అమలాపురం రూరల్ పరిధిలో సమీకరణాలు మరింత క్లిష్టంగా మారాయి. ఇక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్లు ఎప్పుడూ హాట్ టాపిక్కే. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. నిధుల కేటాయింపులు, గ్రామీణ పనుల కాంట్రాక్టుల విషయంలో టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా క్షేత్రస్థాయిలో మాకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అనే గుబులు జనసేన కిందిస్థాయి లీడర్లలో కనిపిస్తుంటే..  మెజారిటీ ఓటు బ్యాంకు మాదే, సీట్ల కేటాయింపులో సింహభాగం మాకే దక్కాలి  అని తమ్ముళ్లు వాదిస్తున్నారు. ఈ పట్టువిడుపులు లేని ధోరణి ఉమ్మడి జిల్లాల అంతటా కూటమి సమన్వయాన్ని దెబ్బతీస్తోంది.

లోకల్ పోల్స్ లిట్మస్ టెస్ట్ 

అసెంబ్లీ సీట్ల సర్దుబాటు కంటే స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటే చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌లకు అసలైన పరీక్ష అని చెబుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే సీటు అనేది నియోజకవర్గానికి ఒక్కటే ఉంటుంది కాబట్టి నచ్చజెప్పడం సులువు. కానీ, వేలాదిగా ఉండే వార్డులు, వందలాదిగా ఉండే సర్పంచ్ స్థానాల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సదరు లీడర్ రెబెల్‌గా మారే ప్రమాదం ఉంది లేదా పక్కనే పొంచి ఉన్న విపక్ష వైఎస్సార్‌సీపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అది రాష్ట్ర వ్యాప్త కూటమి గ్రాఫ్‌పై ప్రభావం చూపిస్తుంది. ముగింపుగా చెప్పాలంటే.. గోదావరి జిల్లాల గ్రామాల్లో తమ్ముళ్లు, సైనికుల మధ్య సాగుతున్న ఈ సీట్ల పంచాయితీని అధిష్టానం ఎంత త్వరగా సెటిల్ చేస్తే అంత మంచిది. పైస్థాయిలో ఉన్న దోస్తీ.. కిందిస్థాయి గడప దాకా చేరకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాల కోటల్లో అంతర్గత తిరుగుబాట్లు తప్పవు. మరి ఈ పొత్తుల రొంపి నుంచి ఇరు పార్టీల స్థానిక లీడర్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget