Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
బుల్లితెరపై తన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు సాయి కుమార్ కోలా. ప్రస్తుతం 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో కీలక పాత్ర పోషిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. విలనిజంతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటుడిగా ఆయనకు మంచి పేరుంది.
సాయి కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన సాయి కుమార్ చిన్నతనం నుంచే నటనపై ఉన్న విపరీతమైన ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. కేవలం ఒకే సీరియల్‌కు పరిమితం కాకుండా 'అభిషేకం', హిట్ సీరియల్స్ 'కృష్ణ తులసి', 'ప్రేమ ఎంత మధురం' వంటి ప్రాజెక్ట్‌లలో విలన్‌గా చేసి మెప్పించాడు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సాయి కుమార్, షూటింగ్ లొకేషన్ రీల్స్, ఫన్నీ వీడియోలతో ఫాలోవర్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటాడు. స్క్రీన్ పైన ఎంత గంభీరంగా, విలన్‌గా కనిపించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సరదాగా ఉంటారని సెట్స్‌లోని తోటి నటీనటులు చెబుతుంటారు. అంతేకాకుండా ఎంత బిజీగా ఉన్నా డైలీ వర్కవుట్స్ అస్సలు మిస్ కాకుండా ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఇక రెమ్యూనరేషన్ విషయానికొస్తే, ఒక రోజుకు సుమారు 8,000 నుంచి 15,000 వరకు పారితోషికం అందుతుందని సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















