అన్వేషించండి

Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి

Budget Friendly Bike: తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ ఉన్న బైక్ కొనాలనుకుంటే, ఈ మోడళ్లు మీకు అద్భుతమైన ఎంపికలుగా నిలవవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా SP 125 అధిక మైలేజ్, తక్కువ నిర్వహణతో ప్రీమియం లుక్.
  • టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R స్పోర్టీ డిజైన్ కలిగి ఉన్నాయి.
  • అధిక శక్తి, ప్రీమియం లుక్ కోసం అపాచే, ఎన్‌ఫీల్డ్ మంచివి.
  • బైక్ కొనేముందు మైలేజ్, నిర్వహణ, టెస్ట్ రైడ్ పరిశీలించండి.

Budget Friendly Bike: ప్రతి ఒక్కరూ చూసేందుకు ప్రీమియం‌గా కనిపించే, కంఫర్ట్ రైడింగ్ బైక్ కోసం చూస్తారు.  జేబుపై ఎక్కువ భారం వేయని బైక్ కొనాలని భావిస్తారు. భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో కూడా లగ్జరీ అనుభూతిని ఇచ్చే అనేక బైకులు ఉన్నాయి. వీటిలో స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్, మంచి మైలేజ్, మోడ్రన్ ఫీచర్ల కాంబినేషన్ లభిస్తుంది. మీరు కూడా కొత్త బైక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా.. అయితే ఈ కింద తెలిపిన లిస్ట్ ఓసారి చెక్ చేయండి. 

హోండా SP 125 ఫీచర్లు 

మీ ఫస్ట్ ప్రియారిటీ కచ్చితంగా అధిక మైలేజ్ అయి ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ అయితే, హోండా SP 125 మంచి ఆప్షన్ కావచ్చు. దీని డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ ప్రీమియం లుక్ ఇస్తుంది. బైక్‌లో LED హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మూత్ ఇంజిన్ లభిస్తాయి. రోజూ ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లి వచ్చే వారికి ఇది బెస్ట్ బైక్‌గా పరిగణిస్తారు.

TVS Raider 125 ఫీచర్లు

TVS Raider 125 తన స్పోర్టీ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల వల్ల యువతలో చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ లభిస్తాయి. కొన్ని రోజుల కిందట దీని కొత్త స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు. ఇది మరింత ప్రీమియంగా మారింది.

Hero Xtreme 125R 

తక్కువ ధరలో స్పోర్టీ లుక్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా.. Hero Xtreme 125R కూడా అద్భుతమైన బైక్. దీని డిజైన్ మొదటి చూపులోనే పెద్ద స్పోర్ట్స్ బైక్‌లా అనిపిస్తుంది. ఇందులో మంచి పనితీరుతో పాటు రోజువారీ అవసరాలకు సరిపోయే మైలేజ్  లభిస్తుంది.

Also Read:  కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు

ఈ బైక్స్ కూడా అత్యధిక విక్రయాలు

TVS Apache RTR 160 కొంచెం ఎక్కువ పవర్, ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి మెరుగైన బైక్. దీని ఇంజిన్, రైడ్ క్వాలిటీ, స్పోర్టీ స్టైల్ ఇవన్నీ దీన్ని తన సెగ్మెంట్‌లోని కస్టమర్ల ఆదరణ పొందిన బైకుల్లో చేర్చుతాయి. నగరం, హైవే రెండింటిలోనూ ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

ఇది క్లాసిక్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది  

మీరు బడ్జెట్‌ను కొంచెం పెంచగలిగితే, రాయల్ లుక్ కొరుకుంటే కనుక Royal Enfield Classic 350 కూడా అద్భుతమైన ఆప్షన్. దీని బలమైన రోడ్ ప్రెజెన్స్, కంఫర్టబుల్ రైడ్ దీన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఇటీవల కంపెనీ ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. యువత ఈ బైక్ అంటే పడి చచ్చిపోతుంటారు.

Also Read: రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!

బైక్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి

కేవలం లుక్ చూసి బైక్ కొనాలని నిర్ణయించుకోవద్దు. మైలేజ్, సర్వీస్ ఖర్చు, రైడింగ్ కంఫర్ట్, స్పేర్ పార్ట్స్ లభ్యత, మీ రోజువారీ వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే  బైక్ని కొనడంపై నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ బడ్జెట్‌తో పాటు మీ అవసరాలను కూడా తీర్చే బైకు కోసం ట్రై చేయండి. 

Frequently Asked Questions

బైక్ కొనేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?

మైలేజ్, సర్వీస్ ఖర్చు, రైడింగ్ కంఫర్ట్, స్పేర్ పార్ట్స్ లభ్యత మరియు మీ రోజువారీ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే బైక్ కొనడంపై నిర్ణయం తీసుకోవడం మంచిది.

రోజువారీ రాకపోకలకు మరియు మంచి మైలేజీకి ఏ బైక్ ఉత్తమం?

హోండా SP 125 అధిక మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ మరియు స్మూత్ ఇంజిన్‌తో రోజువారీ రాకపోకలకు మంచి ఎంపిక. ఇది సింపుల్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

యువత కోసం స్పోర్టీ డిజైన్ గల బైక్ ఏది?

TVS Raider 125 దాని స్పోర్టీ డిజైన్, డిజిటల్ డిస్‌ప్లే, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కారణంగా యువతలో ప్రాచుర్యం పొందింది. Hero Xtreme 125R కూడా అద్భుతమైన స్పోర్టీ లుక్ అందిస్తుంది.

రాయల్ లేదా క్లాసిక్ లుక్ కోసం ఏ బైక్ సిఫార్సు చేయబడింది?

బడ్జెట్‌ను పెంచగలిగితే, Royal Enfield Classic 350 దాని బలమైన రోడ్ ప్రెజెన్స్, కంఫర్టబుల్ రైడ్ మరియు రాయల్ లుక్‌తో అద్భుతమైన ఆప్షన్. ఇది యువతలో బాగా ప్రాచుర్యం పొందింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget