అన్వేషించండి

రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి

Innova Hycross EMI | టయోటా ఇన్నోవా హైక్రాస్ G ఫ్లీట్ 7 సీటర్ వేరియంట్‌ ఆన్ రోడ్ ధర హైదరాబాద్‌లో ₹23.93 లక్షలు ఉంటుంది. ఈ కారు EMI ఫైనాన్స్ ప్లాన్ ద్వారా మీ సొంతం చేసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆన్-రోడ్ ధర ₹23.93 లక్షలు.
  • లక్ష డౌన్ పేమెంట్‌కు, ₹44k-₹53k EMI చెల్లించాలి.
  • పెద్ద క్యాబిన్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS వంటి ఫీచర్లు.
  • దీర్ఘకాల EMI వడ్డీ పెంచుతుంది; హైబ్రిడ్ మైలేజీ అధికం.

Toyota Innova Hycross Down Payment | మీరు ఎక్కువ స్పేస్, ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే 7 సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు మీకు అద్భుతమైన ఆప్షన్ అవుతుంది. ఈ MPV తన హైబ్రిడ్ టెక్నాలజీ, అద్భుతమైన మైలేజ్, బెస్ట్ కేబిన్ వల్ల భారత మార్కెట్‌లో చాలా పాపులర్ అయింది. దీని ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, పూర్తి పేమెంట్ ఒకేసారి చేయకుండా ఫైనాన్స్ ద్వారా సైతం కొనుగోలు చేయవచ్చు. 1 లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే, ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలో ఇక్కడ తెలుసుకోండి. 

కారు ఆన్ రోడ్ ధర ఎంత?

టయోటా ఇన్నోవా హైక్రాస్ G ఫ్లీట్ 7 సీటర్ వేరియంట్‌ హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర ₹18,70,000 కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు ₹23.93 లక్షలుగా ఉంది. మీరు ₹1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తం కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్ మంజూరు చేస్తుంది. బెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి లోన్ ఇస్తారు. 

ప్రతి నెలా EMI ఎంత చెల్లించాలి?
4 ఏళ్ల కాల వ్యవధి: బ్యాంక్ మీకు సంవత్సరానికి 9 శాతం వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు కార్ లోన్ ఇస్తే, మీరు నెలవారీ EMI దాదాపు 52, 53 వేలు వరకు చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో కారు లోన్ త్వరగా పూర్తయి, మొత్తం వడ్డీ కూడా తక్కువ చెల్లించాల్సి వస్తుంది.

5 ఏళ్ల కాల వ్యవధి: మీరు EMI భారాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి అనుకుంటే, 5 సంవత్సరాల కారు లోన్ ఎంచుకోవచ్చు.  మీ EMI నెలకు సుమారు 44 వేల వరకు ఉంటుంది. ప్రతి నెలా కొద్దిగా తక్కువ EMI చెల్లించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. 

Also Read: EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?

ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఎక్కువ కాల వ్యవధి ఉన్న లోన్ తీసుకోవడం వల్ల నెలవారీ ఈఎంఐ వాయిదా తగ్గుతుంది. కానీ కారు కోసం చెల్లించే వడ్డీ మొత్తం పెరుగుతుంది. కనుక కారు లోన్ కాలాన్ని ఎంచుకునే ముందు మీ బడ్జెట్, అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు చెక్ చేసుకుని తీసుకోవాలి. డౌన్ పేమెంట్ ఎక్కువ చేస్తే కారు లోన్ మొత్తం తగ్గుతుంది. తద్వారా EMI తగ్గుతుంది. 

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫీచర్లు

టయోటా ఇన్నోవా హైక్రాస్ తన పెద్ద, ప్రీమియం కేబిన్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో 7, 8 సీటర్ సీటింగ్ ఆప్షన్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ADAS సేఫ్టీ ఫీచర్లు, ఎయిర్‌బ్యాగ్స్, ఆధునిక సౌకర్యాలు లభిస్తాయి. హైబ్రిడ్ వేరియంట్ మెరుగైన మైలేజ్‌తో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

Also Read: వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!

భారత మార్కెట్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు కొన్ని కార్లు పోటీ ఇస్తున్నాయి. వాటిలో మహీంద్రా XUV700, మారుతి సుజుకి ఇన్విక్టో,  టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కేరెన్స్ వంటి 7 సీటర్ కార్లు ఉన్నాయి. ఎక్కువ స్పేస్, హైబ్రిడ్ టెక్నాలజీ, బ్రాండ్ వ్యాల్యూ వల్ల హైక్రాస్ తనదైన ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంది.

 

Frequently Asked Questions

టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర ఎంత?

టయోటా ఇన్నోవా హైక్రాస్ G ఫ్లీట్ 7 సీటర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ₹18,70,000. హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర సుమారు ₹23.93 లక్షలు.

₹1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే ఇన్నోవా హైక్రాస్‌కు నెలవారీ EMI ఎంత?

9% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల లోన్ తీసుకుంటే, నెలవారీ EMI సుమారు ₹52,000-₹53,000 ఉంటుంది. 5 సంవత్సరాల కాలానికి EMI సుమారు ₹44,000 వరకు ఉంటుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ముఖ్య ఫీచర్లు ఏమిటి?

ఇది పెద్ద, ప్రీమియం కేబిన్‌తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ADAS, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కార్ లోన్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమిటి?

లోన్ కాలాన్ని ఎంచుకునే ముందు మీ బడ్జెట్, అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కువ కాల వ్యవధి ఉన్న లోన్ EMI తగ్గిస్తుంది కానీ మొత్తం వడ్డీ పెరుగుతుంది. బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు చెక్ చేసుకోవాలి.

భారత మార్కెట్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎందుకు ప్రసిద్ధి చెందింది?

దాని హైబ్రిడ్ టెక్నాలజీ, అద్భుతమైన మైలేజ్, పెద్ద, బెస్ట్ కేబిన్ కారణంగా ఇది భారత మార్కెట్‌లో చాలా పాపులర్ అయింది. ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget