అన్వేషించండి

Best Commuter Bikes: 125cc నుండి 350cc వరకు ఏ బైక్ అత్యుత్తమ విలువ కలిగి ఉంటుంది.. లిస్ట్ చూడండి

Best Daily Commuter Bikes | కొత్త బైక్ కొనడంలో మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే 125cc నుంచి 350cc వరకు బైకుల మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చు, మీకు సరిపోయే అత్యుత్తమ బైక్ గురించి తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 125cc బైక్‌లు నగర ప్రయాణాలకు, అధిక మైలేజీకి ఉత్తమం.
  • 150-200cc బైక్‌లు శక్తి, స్టైల్, మైలేజీ సమతుల్యతను అందిస్తాయి.
  • అధిక సీసీ బైక్‌లు సుదూర హైవే ప్రయాణాలకు, టార్క్‌కు అనుకూలం.

Best Daily Commuter Bikes: భారత్‌లో బైక్‌లకు మొదటి నుంచీ డిమాండ్ ఉంది. దీని కారణంగా నేడు మార్కెట్లో అనేక కంపెనీల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా బైక్ కొనాలని చూస్తున్నారా.. ముందుగా ఏ బైక్ మీకు వాల్యూ ఫర్ మనీ (మీ డబ్బుకు తగ్గ విలువ) ఇస్తుందో తెలుసుకోవడం మంచిది. భారత మార్కెట్లో 125 నుంచి 350 cc వరకు బైక్‌లు ఎక్కువగా అమ్ముడవుతాయి. మీకు ఏ బైక్ మీకు బెస్ట్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి. ఈ వేర్వేరు కెపాసిటీల బైక్స్, వాటి మైలేజీ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

రోజువారీ ప్రయాణాలకు మైలేజ్ కోసం ఈ బైక్‌లు బెస్ట్

ఒకవేళ మీరు నగరంలోని ట్రాఫిక్ నుండి బయటపడాలన్నా, నెలవారీ పెట్రోల్ ఖర్చును ఆదా చేసుకోవాలి అనుకుంటే 125cc బైక్‌లు మీకు బెస్ట్ ఆప్షన్. ఈ సెగ్మెంట్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, టీవీఎస్ రైడర్, హోండా ఎస్పీ 125 వంటి అద్భుతమైన బైక్స్ వస్తాయి. ఈ బైక్‌ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఈ బైకులను ట్రాఫిక్‌లో హ్యాండిల్ చేయడం చాలా సులభం. ఇవి 60 నుండి 70 kmpl వరకు అద్భుతమైన మైలేజ్‌ను ఇస్తాయి. వీటి సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు అద్భుతమైన మైలేజ్‌తో పాటు బడ్జెట్‌ బైక్ కావాలనుకుంటే 125 cc సెగ్మెంట్ బెస్ట్ అని చెప్పవచ్చు. 

ఈ బైక్‌లు సింపుల్ స్టైల్, మైలేజ్ 

మైలేజ్‌తో పాటు కొద్దిగా టార్క్, పికప్, స్పోర్టీ లుక్ కావాలనుకునే యువత కూడా అలాంటి బైక్ కోసమే వెతుకుతున్నట్లయితే, మీకు 150cc నుండి 200cc సెగ్మెంట్ ఖచ్చితంగా సరిపోతుంది. సాధారణంగా ఈ రేంజ్‌లో బజాజ్ పల్సర్ N160, టీవీఎస్ అపాచీ, యమహా MT-15 వంటి పాపులర్ బైక్‌లు సరిగ్గా సరిపోతాయి. 

Also Read: హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?

ఈ సెగ్మెంట్ మీకు రోజువారీ సిటీ రైడింగ్‌తో పాటు వీకెండ్‌లో చిన్నపాటి లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. వీటిలో మీకు 40 నుండి 50 కి.మీ/ లీటర్ వరకు పర్వాలేదు అనేలా మైలేజ్ ఉంటుంది. హై-స్పీడ్‌లో ప్రయాణించడానికి సింగిల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

250cc నుంచి 350cc సెగ్మెంట్ బైక్‌లు

ఒకవేళ బైక్‌పై అడ్వెంచర్ చేయడం కనుక మీకు ఇష్టమైతే, మీరు 250 నుండి 350cc సెగ్మెంట్ బైకులు కొనడం మంచిది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హంటర్ 350, హోండా CB350 వంటి బైక్‌లు ఈ కేటగిరీలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ అధిక సీసీ బైకులలో అద్భుతమైన టార్క్ లభిస్తుంది. దాని కారణంగా హైవేపై గంటకు 100 కి.మీ వేగంతో వెళ్తున్నప్పుడు కూడా బైక్ ఎలాంటి వైబ్రేషన్ లేకుండా స్మూత్‌గా దూసుకుపోతుంది. 

అయితే, మిగతా బైకులతో పోల్చితే వీటి బరువు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అందరూ ఈ బైకులను మెయింటైన్ చేయలేదరు. అధిక బరువు కారణంగా భారీ ట్రాఫిక్‌లో నడపడం అంత సులభం కాదని తెలిసిందే. వీటి మైలేజ్ కూడా లీటర్ పెట్రోల్ కు 30 నుండి 35 కి.మీ మధ్య ఉంటుంది.

Frequently Asked Questions

రోజువారీ ప్రయాణాలకు, మంచి మైలేజ్ కోసం ఏ బైక్‌లు ఉత్తమం?

ట్రాఫిక్ నుండి బయటపడటానికి, పెట్రోల్ ఖర్చులు ఆదా చేసుకోవడానికి 125cc బైక్‌లు బెస్ట్. ఇవి 60-70 kmpl మైలేజ్ ఇస్తాయి, తక్కువ నిర్వహణ ఖర్చుతో తేలికగా ఉంటాయి.

మైలేజ్‌తో పాటు టార్క్, స్పోర్టీ లుక్ కావాలనుకునే యువతకు ఏ బైక్‌లు సరిపోతాయి?

150cc నుండి 200cc సెగ్మెంట్ బైక్‌లు సరిపోతాయి. వీటిలో బజాజ్ పల్సర్ N160, టీవీఎస్ అపాచీ వంటివి ఉన్నాయి. ఇవి సిటీ రైడింగ్, చిన్న లాంగ్ డ్రైవ్‌లకు అనుకూలం, 40-50 kmpl మైలేజ్ ఇస్తాయి.

అడ్వెంచర్ రైడింగ్‌కు, అధిక టార్క్ కోసం ఏ సెగ్మెంట్ బైక్‌లు కొనాలి?

250 నుండి 350cc సెగ్మెంట్ బైక్‌లు అడ్వెంచర్ ఇష్టపడే వారికి మంచివి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వంటివి అధిక టార్క్ అందిస్తాయి, హైవేపై స్మూత్‌గా ఉంటాయి.

250-350cc బైక్‌లలో ఉన్న ప్రధాన ప్రతికూలతలు ఏమిటి?

ఈ బైక్‌లు బరువు ఎక్కువగా ఉంటాయి, భారీ ట్రాఫిక్‌లో నడపడం కష్టం. వీటి మైలేజ్ కూడా తక్కువగా (30-35 కి.మీ/లీ) ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget