అన్వేషించండి

YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Clashes Between YSRCP And TDP Vijayawada: విజయవాడ ముత్యాలంపాడులో TDP, YCP వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ టెంట్ ను టీడీపీ వర్గీయులు తీసేయడంతో వివాదం తీవ్రమైంది. 

Vijayawada : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ వర్గాలు నిర్వహిస్తున్న ధర్నాను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు ప్రింటింగ్ ప్రెస్ సమీపంలో టెంట్లు వేసి ధర్నా చేపట్టారు. ఇది అనధికారికమని, ధర్నా చౌక్ వదిలి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై టెంట్లు వేశారని ఎమ్మెల్యో బోండా ఉమ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ టెంట్లను తొలగించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.   విజయవాడ సెంట్రల్ సహా యాడికి, పొన్నూరులోనూ వైసీపీ ధర్నా చేస్తున్న టెంట్లు  తొలగించారు. ఇరు వర్గాలు కుర్చీలు, టమాటాలు, కోడిగుడ్లు విసురుకున్నారు.  రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా - మల్లాది విష్ణు

ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా? తమపై దాడులు ఎంత వరకు సబబు,  రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డాపు వైసీపీ నేత మల్లాది విష్ణు.  రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని కేంద్ర ప్రభుత్వం జ్యోక్యం చేసుకుని తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ దాడులేంటని ప్రశ్నించారు.

చంద్రబాబుపై అనవసర విమర్శలు ఊరుకునేది లేదు -  బోండా ఉమ

ధర్నా చేసేందుకు ఇక్కడ అనుమతి లేదు,  రోడ్డుపై టెంట్ వేసి ధర్నాలు ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే బోండా ఉమ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, మంత్రి లోకేష్ పై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బోండా ఉమ. గత ప్రభుత్వం యువతను మోసం చేసింది..వాళ్లు కల్పించలేని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు బోండా ఉమ. 18వేల మంది డీఎస్సీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితాలు నాశనం చేసేందుకు వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. డీఎస్సీ నిర్వహణ, పారదర్శకతపై చర్చించేందుకు రావాలని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు..దానిపై చర్చించే దమ్ము, ధైర్యం జగన్ పార్టీ నేతలకు లేదు..ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే ఇంటికొచ్చి కొడతాం అని హెచ్చరించారు బోండా ఉమ. ధర్నా చౌక్ లో ఆందోళన చేసి ఉంటే తాము అడ్డుకునేవారం కాదని స్పష్టం చేశారు.

రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు-పేర్నినాని

YSRCP దీక్షా శిబిరంపై టీడీపీ వర్గాల దాడి ఘటనపై తీవ్రస్థాయితో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయ్..రౌడీయిజానికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారు అన్నారు. బోండా ఉమ అధికారమదంతో..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేశారని..అధికారపార్టీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బోండా ఉమ లాంటి వందమంది రౌడీలను పోగేసుకుని చంద్రబాబు, లోకేశ్ శునకానందం పొందినా ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవదని, శిశుపాలుడి పాపాల మాదిరిగా లెక్కిస్తున్నారు ప్రజలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతాం అని బెదిరిస్తున్నారు..మీకు చేతనైంది చేసుకోండి ఎంతమందిని కొడతారో చూస్తాం అని సవాల్ విసిరారు నాని.  

 

 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget