భారత టెస్ట్ క్రికెట్లో సీనియర్ ఆటగాళ్ల ప్రాముఖ్యతపై టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జట్టులో సీనియర్లు లేకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని, వారి అనుభవం ఎంతో కీలకమని రహానే స్పష్టం చేశారు.