అన్వేషించండి

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం

Pawan Kalyan | పిఠాపురం నియోజకవర్గంలో రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే రూ. 100 కోట్లతో 611 రోడ్ల పనులను పవన్ కళ్యాణ్ పూర్తి చేయించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్లు కేటాయింపు.
  • 307 కి.మీ. రహదారి పనుల్లో 152 కి.మీ. విజయవంతంగా పూర్తి.
  • మత్స్యకారులు, గ్రామాలు, కాలనీలకు శాశ్వత రహదారులు నిర్మించారు.
  • పంట పొలాల రహదారులు, పెండింగ్ పనుల వేగవంతం ఆదేశాలు.

పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా పల్లెల నుంచి పట్టణాల వరకు మౌలిక వసతుల కల్పనకు, ముఖ్యంగా రహదారుల పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసమే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా నిధులను వెచ్చించారు. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ (SASKI), రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల భాగస్వామ్యంతో మొత్తం 307 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నిర్ణీత లక్ష్యంలో దాదాపు 80 శాతం పనులు పూర్తి కావడంతో పిఠాపురం నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ రూపురేఖలు మారిపోయి గ్రామాల్లో కొత్త కళ సంతరించుకుంది.

13 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు..
రహదారుల నిర్మాణంలో ప్రజల, రైతులు, మత్స్యకారుల అవసరాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. దశాబ్దాలుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా జెట్టీకి వెళ్లే మార్గంలో గ్రావెల్ రోడ్డును నిర్మించి వారి రవాణా కష్టాలను తీర్చారు. అంతేకాకుండా సముద్ర కోత వల్ల ఇళ్లను కోల్పోయిన మాయాపట్నం మత్స్యకారులకు సుబ్బంపేట సమీపంలో కల్పించిన కొత్త మాయాపట్నం పునరావాస కాలనీలో 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రూ. 1.52 కోట్లతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Also Read: YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!


Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం

కొత్తసూరాడపేట పునరావాస కాలనీకి సైతం రూ. 93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు నిర్మించి, ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు. తుపాన్ల ధాటికి పూర్తిగా కొట్టుకుపోయిన యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి-రామన్నపాలెం బీచ్ రోడ్డును రూ. 88 లక్షలతో పునర్నిర్మించడం ద్వారా వేలాది మంది ప్రజలకు, స్థానిక బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు మార్గం సుగమమైంది.

ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు పరిష్కారం
సెజ్ పరిధిలో ఉండి ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరమైన ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారిని అందుబాటులోకి తెచ్చారు. కొత్తపల్లి గ్రామంలో ప్రజల చిరకాల కోరికైన శ్మశాన వాటిక దారిని రూ. 26.30 లక్షలతో సీసీ రోడ్డుగా మలిచారు. కొండెవరం గ్రామ పరిధిలోని పిఠాపురం-ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డును రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో పవన్ కళ్యాణ్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. మరోవైపు దశాబ్దాలుగా గుంతలమయమై నరకప్రాయంగా మారిన గొల్లప్రోలు మండలం వెన్నెపూడి జీఎన్టీ ప్రధాన రహదారిని రూ. 85 లక్షలతో, గొల్లప్రోలు-తాటిపర్తి పుంత రోడ్డును రూ. 1.46 కోట్లతో పునర్నిర్మించి రైతులకు, ప్రయాణికులకు ఊరటనిచ్చారు. చిత్రాడ గ్రామంలోని ఈబీసీ కాలనీ వాసుల కోసం రూ. 3 కోట్లతో సీసీ రోడ్లు, ఆధునిక డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల భద్రతకై రూ. 50 లక్షలతో ప్రహరీ గోడను నిర్మించారు.


నిర్దేశిత గడువులోగా రోడ్ల నిర్మాణం పూర్తి: పవన్ కళ్యాణ్
వ్యవసాయ రంగ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ 'పల్లెపండుగ 2.0' ద్వారా పంట పొలాల మధ్య ఉన్న డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పి.రాయవరం, బి. ప్రత్తిపాడు గ్రామాల్లో కోటి రూపాయలకు పైగా వెచ్చించి 3 కిలోమీటర్ల మేర నిర్మించిన గ్రావెల్ రోడ్లు దాదాపు 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించాయి. అభివృద్ధి పనులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పురోగతిలో ఉన్న 70 కిలోమీటర్ల పెండింగ్ రోడ్డు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని స్పష్టం చేశారు.

 

Frequently Asked Questions

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు?

పవన్ కళ్యాణ్ పిఠాపురంను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రహదారుల పునర్నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ. 200 కోట్లకు పైగా నిధులు కేటాయించారు.

పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం ఎంతవరకు పూర్తయింది?

పిఠాపురంలో 307 కి.మీ. రోడ్ల ప్రణాళికలో, రూ. 100 కోట్లతో 152 కి.మీ. మేర 611 రోడ్ల నిర్మాణం పూర్తైంది. ఇది నిర్ణీత లక్ష్యంలో దాదాపు 80% పూర్తి అయినట్లు.

మత్స్యకారుల కోసం ఎలాంటి రహదారులు నిర్మించారు?

ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారుల కోసం జెట్టీకి గ్రావెల్ రోడ్డు నిర్మించారు. మాయాపట్నం పునరావాస కాలనీలో రూ. 1.52 కోట్లతో 1.5 కి.మీ. సీసీ రోడ్లు, డ్రెయినేజీని ఏర్పాటు చేశారు.

వ్యవసాయ రంగ సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు ఏమిటి?

'పల్లె పండుగ 2.0' ద్వారా పంట పొలాల మధ్య డొంక రోడ్లు నిర్మిస్తున్నారు. పి. రాయవరం, బి. ప్రత్తిపాడులో కోటి రూపాయలతో 3 కి.మీ. గ్రావెల్ రోడ్లు పూర్తయ్యాయి.

రహదారుల పనులు, నాణ్యతపై పవన్ కళ్యాణ్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఏమిటి?

పవన్ కళ్యాణ్ 70 కి.మీ. పెండింగ్ రోడ్డు పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతపై రాజీ పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget