అన్వేషించండి

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

Top stories Today | ఆగస్టు 5న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు

పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

నా పొలిటికల్ రీఎంట్రీతో పాటు భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తానంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు.  నాది స్వతంత్ర భావజాలం అని, ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ముగిసిన మాజీ సీఐ నాగరాజు కస్టడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

విజయవాడలో సస్పెండెడ్ సీఐ నాగరాజుకు సంబంధించి ఏడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ ప్రక్రియ మొత్తాన్ని ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు పూర్తి స్థాయిలో రికార్డు చేశారు. విచారణకు సంబంధించిన సమగ్ర వివరాలను, రికార్డింగ్‌లను రెండు హార్డ్ డిస్కులలో భద్రపరిచి అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. ఈ ప్రక్రియ సందర్భంగా న్యాయమూర్తి ముందు తనకు చెప్పుకోవడానికి ఏమీ లేదని ప్రధాన నిందితుడు (A1) నాగరాజు తెలిపారు. విచారణానంతరం, పోలీసు బలిష్ట భద్రత నడుమ ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Andhra Pradesh Assembly Session: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Andhra Pradesh Assembly Session: ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. సభ నిర్వహణ ఎన్ని రోజులనే దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రేపటి కేబినెట్ భేటీలో చర్చిస్తారు. .

Anakapalle Latest News:యలమంచిలిలో నడిరోడ్డుపై బస్సులో మంటలు- డ్రైవర్ అప్రమత్తతతో ఐదుగురు సేఫ్‌!

Anakapalle Latest News:అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది. మహిళా కార్మికులను తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏటికొప్పాక నుంచి అచ్యుతాపురం పరిశ్రమకు మహిళా కార్మికులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఇంజన్‌లోంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును ఆపేశాడు. ఆ తర్వాత సమయస్ఫూర్తితో ఐదుగురు మహిళా కార్మికులను సురక్షితంగా కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు బస్సును పూర్తిగా ఆవరించాయి. డ్రైవర్ అప్రమత్తత వల్లే ఐదుగురు మహిళా కార్మికులు క్షేమంగా బయటపడగా, ఈ ఘటనపై స్థానికులు డ్రైవర్‌ను అభినందిస్తున్నారు.

Dundigal Latest News: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో గంజాయి చాక్లెట్ల విక్రయం- బిహార్ వ్యక్తి అరెస్టు 

Dundigal Latest News: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్ల విక్రయానికి పాల్పడుతున్న బిహార్‌కు చెందిన వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎస్‌వోటీ, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆగస్టు 4న సాయంత్రం 4 గంటల సమయంలో దుండిగల్ తండా–2లో బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం అందడంతో అధికారులు దాడి నిర్వహించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 71 గంజాయి చాక్లెట్లు, మొత్తం 350 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రంజిత్ కుమార్ బిహార్ రాష్ట్రానికి చెందినవాడని, ప్రస్తుతం దుండిగల్ తండా–2లో నివాసం ఉంటూ కాజీపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

బిహార్‌లోని తన అత్తగారి గ్రామం నుంచి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి దుండిగల్ తండా–2లో ఉన్న ఇతర కార్మికులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

HYDRA Commissioner Ranganath:  హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ప్రైవేట్‌ ఇంటర్ కాలేజీలు!

HYDRA Commissioner Ranganath: హైదరాబాద్‌లో మరో సంచలన కేసు నమోదు అయింది. కొన్ని ఇంటర్ ప్రైవేట్ కాలేజీకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇలా ఫోర్జరీ సంతకాలు చేసిన ఎన్‌వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించారు. హైదరాబాద్‌లోని 8 కాలేజీలు ఈ పని చేసినట్టు గుర్తించారు. దీంతో లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. 

రంగనాథ్‌ సంతకాన్ని ఫోర్జీరీ చేసిన కాలేజీల లిస్ట్‌ ఇదే

1.హైందవీ జూనియర్ కాలేజ్‌, బర్కత్‌పురా 
2.ప్రియంకా జూనియర్ కాలేజ్‌, మెహిదీపట్నం
3.మదర్స్ గాల్స్ జూనియర్ కాలేజ్, విద్యానగర్ 
4.న్యూఎరా జూనియర్ కాలేజ్, ‌చిక్కడపల్లి
5.వశిష్ట జూనియర్ కాలేజ్‌ 
6.రెసోనెన్స్‌ జూనియర్ కాలేజ్‌, 
7.శ్రీచైతన్య జూనియర్ కాలేజ్‌, చాంద్రయానగుట్ట 
8.షాహీన్ జూనియర్ కాలేజ్‌, శివారంపల్లి 

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు..!

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ చిట్‌ఫండ్స్ కుంభకోణంలో భారీగా నగదు దారి మళ్లించారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఈడీ దూకుడు పెంచింది. వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించిదంి. హైదరాబాద్, విశాఖలో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. బిహార్‌కు చెందిన ఈడీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. రూ.3 వేల కోట్లకుపైగా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. మళ్ల విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్‌గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ సోదాలు చేస్తోంది. 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget