అన్వేషించండి

AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

AP DSC 2026 Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. టెట్‌ 2026 ప్రారంభం రోజునే నారా లోకేష్‌  తీపి కబురు చెప్పారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రారంభం; మంత్రి లోకేష్ శుభాకాంక్షలు.
  • టెట్‌ పరీక్షలు బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్‌తో అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయి.
  • డీఎస్సీ నోటిఫికేషన్ అక్టోబర్‌లో, పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం.
  • నూతన విద్యా సంవత్సరం నాటికి అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే లక్ష్యం.

AP DSC 2026 Notification:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని భావించే లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కబురు రానే వచ్చింది. డీఎస్సీకి సంబంధించిన వివరాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. టెట్‌ ప్రారంభం రోజునే అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ డీఎస్సీకి రాబోతోందని స్పష్టం చేశారు. ఎన్ని పోస్టులు అనేది చెప్పకపోయినా నోటిఫికేషన్ ఎప్పుడు, పరీక్ష ఏ నెలలో పెడతారనే విషయంపై కార్లిటీ ఇచ్చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హ పరీక్ష టెట్‌ ప్రారంభమైంది. ప్రభుత్వం పాఠశాలల్లో టీచర్‌ పోస్టు సాధించాలనే లక్ష్యానికి ఇదో మెట్టు. ఈ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వివిధ కేంద్రాల్లో డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి ఈ కీలక ఘట్టం ప్రారంభమైన తరుణంలో పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులకు ధైర్యం చెబుతూనే భవిష్యత్ నియామక ప్రక్రియ గురించి తెలియజేశారు. 

పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి, మానసిక ఆందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆయన ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు కావాలనే యువత కలలను నెరవేర్చే దిశా ఈ టెట్‌ ఒక చారిత్రాత్మక మలుపు అని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌పై నమ్మకంతో ప్రతికూల ఆలోచనలకు తావులేకుండా పరీక్షా హాల్‌లోకి అడుగు పెట్టాలని సూచించారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు భరోసా ఇచ్చారు. 

నిఘా నీడలో టెట్‌ 

పరీక్షల నిర్వహణలో విశ్వసనీయతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ అత్యాధునిక సాంకేతికతను వాడుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో నిబంధనలు కఠిన తరం చేశారు. ప్రతి అభ్యర్థిని బయోమెట్రిక్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాలకు అమరావతిలోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు. ప్రతి నిమిషం అక్కడ జరిగే పరిణామాలను లైవ్ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించారు. సెంటర్లకు చేరుకోవడానికి రవాణా శాఖ ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పించడంతోపాటు, సందేహాల నివృత్తికి జిల్లాల వారీగా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. 

టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు 

టెట్ రాస్తున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్‌ ఐడీ ప్రూఫ్‌ అంటే ఆధార్, ఓటర్ ఐడీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

అక్టోబర్‌లో డీఎస్సీ, డిసెంబర్‌లో ఎగ్జామ్‌

కేవలం టెట్‌ నిర్వహణతోనే సరిపెట్టకుండా, డీఎస్సీ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ ప్రకారం నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2026 డీఎస్సీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ అక్టోబర్‌లో విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నెల రోజుల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత నెల రోజులకు పరీక్ష పెడతారు. అంటే నోటిఫికేషన్ వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే అంటే డిసెంబర్ నెలలోనే డీఎస్సీ పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. 

టెట్ ముగిసిన తర్వాత అభ్యర్థులు మరింత ఉత్సాహంతో డీఎస్సీకి సన్నద్దం కావాలని మంత్రి నారా లోకేష్ ఈ ప్రకటన జారీ చేశారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు.  

Frequently Asked Questions

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది?

డీఎస్సీ 2026 అధికారిక నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో విడుదల కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉంటుంది.

డీఎస్సీ పరీక్షలను ఏ నెలలో నిర్వహిస్తారు?

నోటిఫికేషన్ విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే, అంటే డిసెంబర్ నెలలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

టెట్ పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారు?

టెట్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహిస్తున్నారు. ప్రతి అభ్యర్థిని బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.

టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఏమి తీసుకురావాలి?

అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తోపాటు ఆధార్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget