అన్వేషించండి

Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు

Telangana Special TET Notification | తెలంగాణలోని ఇన్-సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నేటి నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రమోషన్లకు టెట్ అర్హత అవసరం; టీచర్లు ఉమ్మడి మార్కులు కోరుతున్నారు.

హైదరాబాద్:  తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం తొలిసారిగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది. ఇన్-సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం టీచర్లు 2028 సెప్టెంబరు నాటికి (మూడేళ్ల వ్యవధిలో) టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి అయింది. లేనిపక్షంలో వారు ఉద్యోగాల్లో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా 2 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా తొలి ప్రత్యేక టెట్ నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది టీచర్లు ఇప్పటివరకు టెట్ పాస్ కాలేదని విద్యాశాఖ అంచనా వేస్తోంది.

మరోవైపు, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఎస్జీటీలుగా (SGT) పనిచేస్తూ బి.ఎడ్ పూర్తి చేసిన టీచర్లు సైతం టెట్ పేపర్-2 పరీక్ష రాయనున్నారు. మోడల్ స్కూళ్లలోని కొందరు టీజీటీలు (TGT) కూడా పేపర్-2 రాసే అవకాశం కల్పించారు. దాని ఫలితంగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది టీచర్లు సైతం కూడా ఈ ప్రత్యేక టీచర్ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోనున్నారు.

నిరుద్యోగ అభ్యర్థుల తరహాలో తమకు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ వర్తించదని, కనుక అందరికీ ఉమ్మడిగా ఒకే విధమైన అర్హత మార్కులు నిర్ణయించాలని కొందరు గవర్నమెంట్ టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 150 మార్కులకు గాను జనరల్/EWS కేటగిరీకి 90, బీసీలకు 75, ఎస్సీ/ఎస్టీలకు 60 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు.

పరీక్షల షెడ్యూల్ వివరాలు

జులై 22 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణ

సెప్టెంబరు 7 నుంచి 11 వరకు టెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు

సెప్టెంబరు 28 నుంచి 30 తేదీల మధ్య ఫలితాల వెల్లడించనున్నారు

తెలంగాణ టెట్ ఫలితాల విడుదల.. ఉత్తీర్ణత శాతం వివరాలు

హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) ఫలితాలను విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ జులై 13న విడుదల చేశారు. జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 1,53,752 మందిలో 74.81 శాతం (1,15,028 మంది) అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష రాసిన 23,623 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల్లో కేవలం 37.29 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో అధికారిక వెబ్‌సైట్ నుండి స్కోర్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

Frequently Asked Questions

టెట్ పాస్ అవ్వడానికి అర్హత మార్కులు ఎంత?

జనరల్/EWS కేటగిరీకి 90, బీసీలకు 75, ఎస్సీ/ఎస్టీలకు 60 మార్కులు వస్తే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget