PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మెడల్ విజేతలతో ప్రధాని మోడీ సమావేశమై వారిని అభినందించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించి, 4వ స్థానంలో నిలిచింది.

PM Narendra Modi Interacts With Indian Athletes: 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మెడల్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై వారి అద్భుత ప్రదర్శనను అభినందించారు. క్రీడారంగంలో వారి కంట్రిబ్యూషన్‌ను ప్రశంసించారు. ఇండియాకు ఎక్కువ మెడల్స్ తెచ్చిపెట్టే కొన్ని ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఈసారి లేకపోయినా, గ్లాస్గో గేమ్స్‌లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచి సత్తా చాటింది. బ్రిటన్ లో జరిగిన ఈ ఎడిషన్ లో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, కొన్ని క్రీడాంశాలను నిర్వహించలేకపోయారు.
Delhi: Prime Minister Narendra Modi hosts medal winners from the Commonwealth Games 2026 at 7, Lok Kalyan Marg.
— IndSamachar News (@Indsamachar) August 9, 2026
In his tweet, PM Modi wrote, "...Heard about their experiences from the Games. Each one of them has made our nation proud through their exceptional performances.… pic.twitter.com/5fi3v3QiOY
యంగ్ అథ్లెట్లకు మోడీ సందేశం.. స్పోర్ట్స్ కల్చర్ ప్రమోషన్
అథ్లెట్లతో ముఖాముఖి సందర్భంగా దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ పార్టిసిపేషన్‌ను ప్రోత్సహించడం చాలా ముఖ్యామని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. వివిధ క్రీడాంశాలకు చెందిన ప్లేయర్లకు కంటిన్యూయస్ సపోర్ట్ అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరింత మంది యూత్ క్రీడల్లోకి వచ్చేలా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీటింగ్ ద్వారా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.
గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి హ్యాపీనెస్.. పిఎమ్ మోడీ హంబుల్ నేచర్
Delighted to host our outstanding medal winners from the Commonwealth Games 2026 at 7, Lok Kalyan Marg. Heard about their experiences from the Games.
— Narendra Modi (@narendramodi) August 9, 2026
Each one of them has made our nation proud through their exceptional performances. Their success will motivate many youngsters. pic.twitter.com/1zkYCKiV8r
గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ సాక్షి చౌదరి ఈ మీటింగ్ పై రియాక్ట్ అవుతూ, "ప్రధాని నరేంద్ర మోడీ మమ్మల్ని ఇన్వైట్ చేయడం గర్వంగా ఉంది. ఆయన చాలా హంబుల్ గా మాట్లాడారు. ఈ మీటింగ్ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చెప్పింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మోడీ "ఆడేవాళ్లే మెరుస్తారు, ఎప్పుడూ భారత్‌కు మద్దతుగా నిలవండి, భారత్ మాతాకీ జై" అని మెసేజ్ ఇచ్చారు.
ఇతర క్రీడల్లో కొత్త వెలుగులు.. భవిష్యత్ టార్గెట్లు
కీలకమైన కొన్ని క్రీడలు లేకపోయినా ఇండియా 4వ స్థానంలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇతర క్రీడల అథ్లెట్లు ముందుకు వచ్చి తమ టాలెంట్ నిరూపించుకోవడానికి హెల్ప్ అయింది. రాబోయే రోజుల్లో ఇండియా తన స్పోర్ట్స్ బేస్‌ను విస్తరించడానికి, అన్ని రకాల క్రీడల్లో డెప్త్ పెంచుకోవడానికి గ్లాస్గో పర్ఫార్మన్స్ చాలా ఉపయోగపడుతుందని పీఎంఓ ప్రతినిధి వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు






















