అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై రాష్ట్ర హైకోర్టు హోంశాఖకు నోటీసులు ఇచ్చింది. ప్రజాప్రతినిధులు సభలోకి ప్రవేశించకుండా పోలీసులు ఆంక్షలు విధించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Telangana Assembly Sessions | శాసనసభలోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోకూడదని, వారిపై చర్యలు తీసుకునే అధికారం కేవలం స్పీకర్‌కే ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Telangana High Court | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై హోంశాఖకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రజాప్రతినిధులు ప్రవేశించకుండా పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఎమ్మెల్యేలు సభా నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం కేవలం స్పీకర్‌కే ఉంటుందని, ఈ విషయంలో పోలీసులకు జోక్యం చేసుకునే హక్కు లేదని వ్యాఖ్యానించింది. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారాలే అత్యంత కీలకమైనవని స్పష్టం చేస్తూ, ఎమ్మెల్యేల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అలాగే, ఈ ఘటన సమయంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన పోలీసులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించిన కోర్టు, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం 2 వారాల పాటు వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే..
అసెంబ్లీ సమావేశాల వేళ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనను ఎండగడుతూ నల్ల టీషర్టులతో నిరసన తెలిపేందుకు వచ్చిన బిఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకుని, మహిళా ఎమ్మెల్యేలపై సైతం దురుసుగా ప్రవర్తించడం.. అక్కడి నుంచి ప్రజాప్రతినిధుల్ని తరలించడంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని, అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ బిఆర్ఎస్ అధిష్టానం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
పోలీసుల ప్రవర్తనపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని, జుట్టు పట్టి లాగుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ దుర్మార్గపు చర్యే నిదర్శనమన్నారు.
Frequently Asked Questions
తెలంగాణ హైకోర్టు హోంశాఖకు నోటీసులు ఎందుకు జారీ చేసింది?
అసెంబ్లీ వ్యవహారాలలో పోలీసుల అధికారంపై హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది?
ఎమ్మెల్యేలు సభా నిబంధనలను ఉల్లంఘిస్తే స్పీకర్‌కే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో పోలీసులకు జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది.
మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమిటి?
మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను హైకోర్టు ఆదేశించింది. బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని సూచించింది.
ట్రెండింగ్ వార్తలు























