అన్వేషించండి

 Epic Knock Return:  టీమిండియాలో ప్లేస్ ఔట్..  క‌ట్ చేస్తే సెంచ‌రీల మోత‌.. ప‌డిలేచిన కెర‌టం ఇషాన్ కిష‌న్

దులీప్ ట్రోఫీ ఫైనల్లో 270 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ అతిగా ఆలోచించడం మానేసి పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు.

Ishan Kishan Reflects On Epic Double Century: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్‌పై 270 పరుగుల సంచలన డబుల్ సెంచరీతో విరుచుకుపడిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్ల‌డించాడు. కెరీర్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న తర్వాత అనవసరపు ఆలోచనలు, అంచనాలను పక్కన పెట్టి పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు.  సోమవారం ఆట ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కిషన్, "నేను మారడానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, సహజంగానే మార్పు వచ్చింది. ఇండియా జట్టుకు దూరమైనప్పుడు మన బాధ్యత కేవలం క్రీజులోకి వెళ్లి పరుగులు చేయడమేనని గుర్తించాను. కెరీర్‌కు ఉపయోగపడేది పరుగులు మాత్రమే. బయటి ఆలోచనలు మైండ్‌సెట్‌ను దెబ్బతీసి అనవసరపు ఒత్తిడిని పెంచుతాయి. జట్టును గెలిపించడం మీదే శ్రద్ధ పెట్టాలి" అని తెలిపాడు.

Read Also: Sreesanth VS Sanju Samson, Kerala League Rift:  శ్రీశాంత్-సంజూ మ‌ధ్య విబేధాలు..!! వేదికపై షేక్ హ్యాండ్ ఇవ్వ‌ని శ్రీశాంత్.. వీడియో వైరల్

చీక‌టి రోజుల నుంచి వెలుగులోకి..
2023 లో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడిన ఇషాన్ కిషన్, కొన్ని ఊహించని పరిణామాల వల్ల చివరకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను సైతం కోల్పోయాడు. అయితే నిరాశ చెందకుండా దేశవాళీ క్రికెట్‌లో క‌ఠోర సాధ‌న చేశాడు. 2025-26 రంజీ ట్రోఫీలో శతకాలతో పాటు, జార్ఖండ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలో 517 పరుగులు చేసి రెండు సెంచరీలతో కీలక పాత్ర పోషించాడు. దాంతో మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్‌తో పాటు వైట్ బాల్ జట్టులో స్థానం పొందాడు. "ప్రస్తుతం నేను చేస్తున్న అత్యుత్తమ పని ఏమీ ఆలోచించకపోవడమే. బంతిని చూడటం, దానికి తగ్గట్లు ఆడటం తప్ప నాపై నేనే ఎలాంటి అంచనాలు పెట్టుకోవడం లేదు. సంయమనం కోల్పోయినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే ముఖ్యం" అని పేర్కొన్నాడు.

Read Also: Fatima Sana Fined: భారత ప్లేయర్లను క‌వ్వించిన‌ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా..  కొరడా ఝుళిపించిన ఐసీసీ

ప్ర‌త్యేక ప్రాక్టీస్..
ఫైనల్ మ్యాచ్ వ్యూహాలను వివరిస్తూ, "సౌత్ జోన్‌తో మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సీవోఈలో రెడ్ బాల్‌తో ప్రత్యేక ప్రాక్టీస్ చేశాను. టీ20లు ఎక్కువగా ఆడినప్పుడు షాట్లు ఎక్కువగా ఆడాలనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో కట్ షాట్ ఆడబోయి ఔటయ్యాను. ఫైనల్లో ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇండియాకు ఆడిన అనుభవం ఉన్నప్పుడు జట్టు మన నుంచి భారీ స్కోరు ఆశిస్తుంది. అందుకే నా పార్ట్‌నర్‌తో కలిసి యాభై పరుగుల చొప్పున భాగస్వామ్యాలు నిర్మిస్తూ వికెట్ కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను" అని వ్యాఖ్యానించాడు.

డొమెస్టిక్ క్రికెట్ లో ఎంతో నేర్చుకోవ‌చ్చు..
రెండు సంవత్సరాల పాటు గ్రౌండ్‌లో కష్టపడటం తనకు ఎంతో మేలు చేసిందని కిషన్ తెలిపాడు. భారత జట్టులో ఆడుతున్నప్పుడు ఒకే ఫ్లోలో వెళ్లిపోతామని, ఒక దశలో గ్రోత్ ఆగిపోతుందని పేర్కొన్నాడు. తిరిగి డొమెస్టిక్ క్రికెట్‌కు వచ్చినప్పుడు సున్నా నుంచి మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుందని, స్టార్ట్స్ ను పెద్ద స్కోర్లుగా ఎందుకు మార్చలేకపోయామో సమీక్షించుకోవడానికి సమయం లభిస్తుందని వివరించాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Gambhir Setup Flaw: ఓటములకు గంభీర్ వ్యూహమే కారణం.. గవాస్కర్ సంచలన విశ్లేషణ, హార్దిక్ కోసం వెతుకులాటపై ఘాటు వ్యాఖ్యలు
ఓటములకు గంభీర్ వ్యూహమే కారణం.. గవాస్కర్ సంచలన విశ్లేషణ, హార్దిక్ కోసం వెతుకులాటపై ఘాటు వ్యాఖ్యలు
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Shubman Gill Ranji Shock:  కివీస్ టూర్ కి ముందు చేదు అనుభ‌వం.. రంజీ ట్రోఫీలో సింగిల్ డిజిట్ కే క్లీన్ బౌల్డ్ అయిన గిల్, నెట్టింట ట్రోలింగ్ తో ఫ్యాన్స్ ఫైర్
కివీస్ టూర్ కి ముందు చేదు అనుభ‌వం.. రంజీ ట్రోఫీలో సింగిల్ డిజిట్ కే క్లీన్ బౌల్డ్ అయిన గిల్, నెట్టింట ట్రోలింగ్ తో ఫ్యాన్స్ ఫైర్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Embed widget