అన్వేషించండి

Sreesanth VS Sanju Samson, Kerala League Rift:  శ్రీశాంత్-సంజూ మ‌ధ్య విబేధాలు..!! వేదికపై షేక్ హ్యాండ్ ఇవ్వ‌ని శ్రీశాంత్.. వీడియో వైరల్

కేరళ క్రికెట్ లీగ్ ఫైనల్ వేదికపై సంజూ శాంసన్‌కు శ్రీశాంత్ కరచాలనం చేయకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అభిమానులు జోరుగా చ‌ర్చ‌లు సాగిస్తున్నారు.

Viral Stage Video Sparks Speculation Between Kerala Stars:  కేరళ క్రికెట్ లీగ్ 2026 ఫైనల్ బహుమతుల ప్రదానోత్సవ వేదికపై జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచ‌న‌లంగా మారింది. కేరళకు చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు సంజూ శాంసన్, ఎస్ శ్రీశాంత్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయంటూ ఒక వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వేడుకలో ట్రోఫీ పక్కనే సంజూ శాంసన్ ఇతర అధికారులతో కలిసి నిలబడి ఉండగా, శ్రీశాంత్ వేదికపైకి వ‌చ్చాడు. అక్కడ ఉన్న నిర్వాహకులు, అధికారులందరికీ చేతులు కలిపిన శ్రీశాంత్, సరిగ్గా తన పక్కనే ఉన్న సంజూ శాంసన్‌కు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ముందుకు సాగిపోయాడు. సంజూ కూడా శ్రీశాంత్ వైపు చేయి చాచకుండా అలాగే చూస్తూ నిల‌బ‌డ్డాడు. ఈ విజువల్స్ బయటకు రావడంతో వీరిద్దరి మధ్య అంతర్గత వివాదం ఏమైనా మొదలైందా అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై ఇరు ఆటగాళ్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక‌పోవ‌డం విశేషం.

నిల‌క‌డ లేదు..
మరోవైపు టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, దేశవాళీ దిగ్గజం వసీం జాఫర్ సంజూ శాంసన్ కెరీర్‌పై కీలక వ్యాఖ్య‌లు చేశాడు. దూరదర్శన్ వేదికగా ప్రసారమైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన జాఫర్, 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో బ్యాకప్ ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను తాను చూడటం లేదని తెలిపాడు. శాంసన్‌లో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే ప్రతిభ ఉన్నప్పటికీ, వన్డే ఫార్మాట్ డిమాండ్ చేసే నిలకడ అతడిలో లోపించిందని తెలిపాడు. క్రీజులో ఎక్కువ సమయం గడపాల్సిన 50 ఓవర్ల ఫార్మాట్‌కు సంప్రదాయ సాంకేతికత, క్రమశిక్షణతో కూడిన గేమ్ ప్లాన్ చాలా అవసరమని వివరించాడు.

ఆ ఫార్మాటే బెస్ట్..
"2027 ప్రపంచకప్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా సంజూ సరిపోతాడని నేను అనుకోవడం లేదు. అతడి ఆటతీరులో కన్సిస్టెన్సీ లోపించింది. వన్డే క్రికెట్‌లో నిలకడ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ బ్యాటర్లకు భారీ ఇన్నింగ్స్‌లు నిర్మించే సమయం లభిస్తుంది. సంజూ తన గత వన్డేలో సెంచరీ బాదిన మాట నిజమే అయినా, ఇప్పటికే అతడికి తగినన్ని అవకాశాలు వచ్చాయి. ఇండియా వద్ద శాంసన్ కంటే మెరుగైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అతడిని కేవలం టీ20 ఫార్మాట్‌కే ఆడనివ్వడం మంచిది" అని జాఫర్ పేర్కొన్నాడు. 

Read Also: Shafali World Record: పాకిస్తాన్‌పై షెఫాలీ అరుదైన ఫీట్.. అత్యంత పిన్న వయసులోనే సరికొత్త ప్రపంచ రికార్డుతో సంచలనం

తీవ్ర‌మైన పోటీ..
రాబోయే వన్డే ప్రపంచకప్ కోసం భారత యాజమాన్యం సరైన కాంబినేషన్లను సిద్ధం చేస్తున్న వేళ, బ్యాకప్ స్థానాల కోసం దేశవాళీ క్రికెట్ నుంచి ఎందరో కుర్రాళ్లు జ‌ట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vaibhav Sooryavanshi News: సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్
సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget