అన్వేషించండి

Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్

మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ హాజరుకానుండటంతో భారత మహిళల జట్టు ట్రోఫీ ప్రెజెంటేషన్ పై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

Asia Cup 2026 -PCB Chief Presence Sparks Trophy Handover Concerns:  భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్ ట్రోఫీ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నట్లే, ఇప్పుడు భారత మహిళల జట్టుకు కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యేలా అవ‌కాశం ఉంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సెప్టెంబర్ 13న జరిగే మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరుకు హాజరుకానున్నట్లు సమాచారం. ముగింపు వేడుకలకు అతడిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. గతంలో జరిగినట్లే విజేతలకు ట్రోఫీని నఖ్వీ స్వయంగా అందించాలని భావిస్తున్నాడు. అయితే ఒకవేళ భారత్ టైటిల్ గెలిస్తే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించే అవకాశాలు ఉండటంతో మరోసారి తీవ్ర వివాదం చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Read Also: Duleep Trophy Final:  షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా

2025 ఎడిష‌న్ లో ఉద్రిక్త‌త‌..
2025 మెన్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత పోడియం వద్ద పెద్ద రగడ జరిగిన సంగ‌తి తెలిసిందే. ట్రోఫీని అందజేయడానికి మొహ్సిన్ నఖ్వీ దాదాపు అరగంట పాటు వేదికపై వేచి చూశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అతడి చేతుల నుంచి ట్రోఫీని తీసుకోవడానికి ససేమిరా ఒప్పుకోక‌పోవ‌డంతో జ‌గ‌డం స్టార్ట్ అయింది. వేరే ఇతర ఏసీసీ అధికారి చేతుల మీదుగా ట్రోఫీని ఇవ్వాలని టీమ్ ఇండియా పట్టుబట్టింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన నఖ్వీ ప్రెజెంటేషన్ వేడుకను మధ్యలోనే వదిలేసి ట్రోఫీని తన వెంట హోటల్ గదికి తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికీ ఆ ట్రోఫీ దుబాయ్ లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయింది తప్ప భారత జట్టుకు అధికారికంగా అందలేదని తెలుస్తోంది.

Read Also: Shafali World Record: పాకిస్తాన్‌పై షెఫాలీ అరుదైన ఫీట్.. అత్యంత పిన్న వయసులోనే సరికొత్త ప్రపంచ రికార్డుతో సంచలనం

సేమ్ సీన్ రిపీట్..
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు అద్భుత ఫామ్‌తో సెమీఫైనల్ చేరుకుని టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ కెప్టెన్ సనా మిర్ టాస్ సమయంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. గతేడాది సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ ఆఘా మధ్య జరిగిన ఘటనను ఇది అంద‌రి మైండ్ లోకి వ‌చ్చింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో మహిళల జట్టు కూడా అదే బాటలో నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మేలుకున్న బీసీసీఐ.. సంప్ర‌దింపులు
పురుషుల ట్రోఫీ వివాదంపై ఇప్పటికే బీసీసీఐ, ఏసీసీ అధికారులతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన సంగ‌తి తెలిసిందే. అయినప్పటికీ ఆ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. ఇప్పుడు మహిళల టోర్నీలోనూ భారత్ విజేతగా నిలిస్తే నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు హర్మన్ సేన నిరాకరించవచ్చని ప్రచారం ముమ్మ‌రంగా సాగుతోంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ ముగింపు వేడుక ఎలా ముగుస్తుందోనన్న అంశం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India World Record: 149 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా.. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు
149 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా.. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు
Chahal Politics: బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్
బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget