Duleep Trophy Final: షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
దులీప్ ట్రోఫీ ఫైనల్లో తిలక్ వర్మ మాటల యుద్ధం తర్వాత 44 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరి తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు.

Tilak Varma Clashes With Vaibhav Sooryavanshi In Final: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈస్ట్ జోన్ ఓపెనర్, 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో అర్ధశతకానికి చేరువగా వచ్చి 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే అతడు పెవిలియన్ చేరడానికి కాసేపటి ముందు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మతో మైదానంలో మాటల యుద్ధం నడిచింఇ. వైభవ్‌ను ఉద్దేశించి తిలక్ స్లెడ్జింగ్ చేసిన కొద్దిసేపటికే పేసర్ చామా మిలింద్ బౌలింగ్‌లో వైభవ్ తన వికెట్ సమర్పించుకున్నాడు.
Vaibhav Sooryavanshi and Tilak Varma banter. 😂🔥 pic.twitter.com/Fp1y07GIH6
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 6, 2026
వైభవ్ దూకుడు..
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వైభవ్ దూకుడుగా ఆడాడు. టీమ్ ఇండియా సీనియర్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను సైతం లెక్కచేయకుండా బౌండరీలు నమోదు చేశాడు. ఈ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ "క్యా యార్ యే వైస్ కెప్టెన్" అంటూ వైభవ్‌ను టీజ్ చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు నవ్వుతూ కనిపించినా, 15 ఏళ్ల కుర్రాడిపై తిలక్ ఈ తరహా స్లెడ్జింగ్ వ్యూహాన్ని అమలు చేయడం నెటిజన్లకు ఏమాత్రం రుచించలేదు. మైదానంలో జరిగిన ఈ ఘటనా క్రమంపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐈𝐬𝐡𝐚𝐧 𝐊𝐢𝐬𝐡𝐚𝐧’𝐬 𝐝𝐚𝐲 𝐨𝐮𝐭 𝐚𝐭 𝐂𝐡𝐞𝐩𝐚𝐮𝐤 💥
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026
Motivational speech 🗣️
Led from the front 🫡
Unbeaten 💯
#DuleepTrophy | #EZvSZ | @ishankishan51 pic.twitter.com/Z5cNtf9ZCP
సత్తా చాటిన ఈస్ట్ జోన్..
వైభవ్ సూర్యవంశీ 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔట్ కాగా, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన ఫామ్‌ను కనబర్చాడు. వైభవ్ దూకుడు చూసి తాను కూడా వేగంగా ఆడుతూ కేవలం 86 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 72 పరుగులు సాధించాడు. అయితే చివర్లో దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో ఈశ్వరన్ ఇన్నింగ్స్ కు ఎండ్ కార్డు పడింది.. వీరిద్దరి మెరుపు ఆరంభంతో ఈస్ట్ జోన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో పటిష్టమైన పునాదిని నిర్మించుకుంది.
రికార్డుల జోరు..
సెమీఫైనల్లో 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి దులీప్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర నెలకొల్పాడు. సెమీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 81 బంతుల్లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లో 40 రన్స్ చేసిన అతడు, ఇప్పుడు ఫైనల్లోనూ తన ముద్ర వేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం మిస్ అయినప్పటికీ, ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇంకా చాలా రోజుల ఆట మిగిలి ఉంది కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోరు సాధించేందుకు వైభవ్‌కు మంచి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్.. ఆదివారం తొలిరోజు ఆటముగిసేసరికి 79 ఓవర్లలో 4 వికెట్లకు 385 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీ (111 బ్యాటింగ్ ) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో చామా మిలింద్ కు రెండు వికెట్లు దక్కాయి.
ట్రెండింగ్ వార్తలు



















