అన్వేషించండి

China Masters Champions:  చైనా గడ్డపై సాత్విక్ చిరాగ్ జోడీ సంచలన విక్టరీ.. అద్భుత పోరాట ప‌టిమ‌తో టైటిల్ కైవసం

చైనా మాస్టర్స్ ఫైనల్లో చైనా జంటను  ఓడించి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ టైటిల్ త‌న ఖాతాలో వేసుకుంది.

Indian Duo Stuns Chinese Pair In Shenzhen Arena: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి మరోసారి ప్రపంచ వేదికపై అద‌ర‌గొట్టారు. షెన్‌జెన్‌లోని షెన్‌జెన్ అరేనా వేదికగా జరిగిన చైనా మాస్టర్స్ పురుషుల డబుల్స్ హోరాహోరీ ఫైనల్లో స్థానిక చైనా జోడీ హీ జీ టింగ్, రెన్ షియాంగ్ యూపై 11-21, 21-13, 21-17 తేడాతో అద్భుత విజయాన్ని సాధించారు. మూడో ప్రయత్నంలో ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను ముద్దాడారు. దాదాపు 1 గంట 10 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో భారత ద్వయం తమ అనుభవాన్ని, పట్టుదలను ప్రదర్శించి కీలక సమయాల్లో పైచేయి సాధించి, టైటిల్ కైవ‌సం చేసుకుంది. మే నెలలో సింగపూర్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఈ సీజన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కావడం విశేషం.

తొలి గేమ్ ఓడినా.. ప‌ట్టుద‌ల‌తో
మ్యాచ్ ఆరంభంలో చైనా ద్వయం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. థాయిలాండ్ ఓపెన్, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్ చేరిన హీ, రెన్ ఆరంభం నుంచే వేగవంతమైన ర్యాలీలతో స‌త్తా చాటారు. వారి అద్భుతమైన డ్రాప్ షాట్లు, యాంగిల్డ్ రిటర్న్స్‌ను ఎదుర్కోవడంలో భారత జోడీ తీవ్రంగా తడబడింది. వరుస అన్‌ఫోర్స్డ్ ఎర్రర్లు కూడా సాత్విక్-చిరాగ్ జంట‌ను వెనుకంజ వేసేలా చేశాయి. దీంతో ఏకపక్షంగా సాగిన మొదటి గేమ్‌ను చైనా జంట 21-11 తేడాతో చాలా సులువుగా సొంతం చేసుకుని ఆధిక్యంలో నిలిచింది.

సూప‌ర్బ్ క‌మ్ బ్యాక్..
రెండో గేమ్ తొలి ర్యాలీలోనే చైనా ద్వయం 39 షాట్ల సుదీర్ఘ పోరాటంతో పాయింట్ సాధించి జోరు కనబరిచింది. నెట్ వద్ద చిరాగ్ చేసిన పుష్‌లను చైనా ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్‌తో తిప్పికొట్టారు. అయితే ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా భారత స్టార్స్ తమ వ్యూహాన్ని మార్చారు. దూకుడుగా ఆడుతూ పాయింట్లు రాబట్టి భారీ ఆధిక్యాన్ని సంపాదించారు. భారత ఆటగాళ్ల ఎదురుదాడితో చైనా ఆటగాళ్లు తప్పులు చేయడం స్టార్ట్ చేశారు. వరుసగా స్మాష్‌లతో చెలరేగిన సాత్విక్-చిరాగ్ 21-13తో రెండో గేమ్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లారు.

వ‌రుస పాయింట్ల‌తో చెక్..
మూడో గేమ్‌లో చైనా జంట సర్వీస్, ఫాలో-అప్ షాట్లతో వేగంగా 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గేమ్ ఆఖరి దశ వరకు ఇరు జట్లు చెస్ గేమ్‌లా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ హోరాహోరీగా పోరాడాయి. ప్రతీ పాయింట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే కీలకమైన క్లైమాక్స్ క్షణాల్లో భారత ద్వయం తిరుగులేని ఏకాగ్రతను ప్రదర్శించి, స‌త్తా చాటింది. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఐదు కీలక పాయింట్లు పిండుకుని 21-17తో గేమ్‌తో పాటు చైనా మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
Rohit Sharma Record: అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget