అన్వేషించండి

Historic Captaincy Record: ధోని రికార్డును దాటేసి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ప్ర‌పంచ రికార్డు.. ఎవరికీ అందనంత ఎత్తులో భారత కెప్టెన్

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేయర్‌గా భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు సాధించింది

India Captain Harmanpreet Reaches Historic Landmark Against Arch Rivals: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట సాధించింది. పురుషులు, మహిళల క్రికెట్ చరిత్రలోనే ఏకంగా 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మొట్టమొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ 2026 గ్రూప్ ఏ ఆఖరి పోరులో బరిలోకి దిగడం ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ మైలురాయిని అధిగ‌మించింది. ఇప్పటికే థాయిలాండ్, హాంకాంగ్‌లపై తిరుగులేని విజయాలతో దర్జాగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్, పాక్ ను కూడ ఓడించి లీగ్ దశను వరుసగా మూడు విజయాలతో ముగించింది. 

టాప్ లో హర్మన్.. ఆట‌ప‌ట్టు, లానింగ్‌లను వెనక్కి నెట్టిన భార‌త కెప్టెన్
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సారథుల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ 150 మ్యాచ్‌లతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆట‌ప‌ట్టు 121 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ సారథి మెగ్ లానింగ్ 100 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ లీడర్ హీథర్ నైట్, రువాండా కెప్టెన్ డయానే బిమెనియిమానా చెరో 96 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో నిలిఆరు. ఈ అరుదైన ఘనత సాధించడంపై హర్మన్ స్పందిస్తూ, "ఇదొక గొప్ప ఘనత. కానీ మైదానంలో ఆడుతున్నంత సేపు ఆటను ఆస్వాదించడం మాత్రమే అత్యంత ముఖ్యం, నేను అదే కొనసాగించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను" అని పేర్కొంది..

మెన్స్ రికార్డులు బ్రేక్.. ధోనిని వెనక్కి నెట్టిన హ‌ర్మ‌న్
హర్మన్‌ప్రీత్ సాధించిన ఈ రికార్డు పురుషుల అగ్రశ్రేణి కెప్టెన్ల రికార్డులను కూడా ఎంతగానో అధిగ‌మించింది. మెన్స్ టీ20 క్రికెట్‌లో నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ 91 మ్యాచ్‌లతో అత్యధిక మ్యాచ్‌ల లీడర్‌గా ఉన్నాడు. ఇక ఇండియా తరఫున పురుషుల విభాగంలో మహేంద్ర సింగ్ ధోని 72 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి ఓవరాల్ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ 150 మ్యాచ్‌లకు చేరుకుని ధోనితో పాటు ప్రపంచ మేటి కెప్టెన్లందరినీ చాలా వెనక్కి నెట్టేసింది.

పాక్ చిత్తు.. ఇండియా హ్యాట్రిక్ విజ‌యం..
ఇక మ్యాచ్ విష‌యానికొస్తే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ ను టీమిండియా మ‌రోసారి చిత్తు చేసింది. ఆసియాక‌ప్ 2026లో భాగంగా మ‌హిళా జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ లో ఏక‌ప‌క్షంగా 7 వికెట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భార‌త బౌల‌ర్ల ధాటికి 18.1 ఓవ‌ర్ల‌లో 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓపెన‌ర్ ష‌వాల్ జుల్ఫిక‌ర్ (14) టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. బౌల‌ర్ల‌లో తెలుగు స్టార్ శ్రీ చ‌ర‌ణి, ప్రేమ రావ‌త్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటారు. అనంత‌రం ఛేద‌న‌ను కేవ‌లం 8.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 57 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ( 18 నాటౌట్) అజేయ బ్యాటింగ్ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచింది.  ఫాతిమా స‌నాకు మూడు వికెట్లు ద‌క్కాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Arshdeep, Tilak Historic Record: భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Late-Night Eating : రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Tragic Incident in MP: మధ్యప్రదేశ్‌లో విషాదం.. బాల్కనీలో గుట్కా ఉమ్మివేస్తే.. విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి!
మధ్యప్రదేశ్‌లో విషాదం.. బాల్కనీలో గుట్కా ఉమ్మివేస్తే.. విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి!
Rajinikanth Nayanthara : రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Embed widget