Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్‌తో విశ్వరూపం ప్రదర్శించాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో తొలి రోజే విధ్వంసకర శతకంతో చెలరేగి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తన నిర్ణయానికి పూర్తి న్యాయం చేస్తూ, మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఆడుకున్నాడు.
తొలుత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్, శిఖర్ మోహన్ హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడటంతో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్రతో కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రారంభంలో వికెట్‌ను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడిన ఇషాన్, క్రీజులో కుదురుకున్నాక సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 111 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఈస్ట్ జోన్ 4 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు సాధించింది.
2023 నుంచి భారత టెస్ట్ జట్టుకు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్‌కు ఈ ఇన్నింగ్స్ అత్యంత కీలకం. రెడ్ బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన శతకం బాది, తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు స్పష్టం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు






















