అన్వేషించండి

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!

Trichy East: సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారా? సోషల్ మీడియా హడావుడేనా.. టీవీకే వ్యూహం ఎలా ఉంది?

Trisha Political Entry Tamil Nadu:   తమిళనాడు రాజకీయాల్లో  తిరుచ్చి ఈస్ట్  నియోజకవర్గ ఉపఎన్నిక అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం   అధినేత, సీఎం  విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి స్టార్ హీరోయిన్  త్రిష కృష్ణన్ ను పోటీకి దింపాలంటూ త్రిష అభిమానులు, టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష హాజరైనప్పటి నుంచే ఆమె రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఒకవేళ త్రిషకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదా తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశం నిజంగానే లేకపోతే తన పేరు, ఫ్యాన్స్ ఆధారంగా సాగుతున్న ఈ ప్రచారానికి ఆమె ఇప్పటికే స్పష్టత ఇచ్చి ఫుల్‌స్టాప్ పెట్టేవారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కానీ మౌనం పాటిస్తూ, ఈ చర్చను మరింత ఊపందుకునేలా వదలడం వెనుక ఆమె వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అనే కోణంలో సినీ, రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోలు నెట్టింట మళ్లీ వైరల్ అవుతుండటం ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తోంది.                                              

మరోవైపు, తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై టీవీకేలోనూ భిన్న స్వరాలు, వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు టీవీకే నేతలు, కార్యకర్తలు త్రిష అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతుండగా, మరికొందరు సలహాదారులు రాజ్యసభ మార్గం వైపు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో, పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడిన కార్యకర్తలకే ఆ సీటు దక్కాలంటూ రాఘవ లారెన్స్ వంటి వారు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేయడంతో తిరుచ్చి ఈస్ట్ సీటుపై దృష్టి మరింతగా త్రిష వైపే కేంద్రీకృతమైంది.

విజయ్ సొంత నియోజకవర్గంగా నిలిచిన తిరుచ్చి ఈస్ట్‌లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీవీకేకు, సినీ గ్లామర్, పాపులారిటీతో పాటు బలమైన ప్రచార ఆకర్షణ కలిగిన అభ్యర్థి అవసరమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల ఎత్తుగడలకు దీటుగా, యువత, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు త్రిష బరిలోకి దిగితే ఉపఎన్నికలో వేరే స్థాయి హైప్ క్రియేట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.                          

అయితే, సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం కేవలం అభిమానుల ఉత్సాహమా లేక భవిష్యత్ రాజకీయ ప్రవేశానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే వ్యూహమా అనేది త్వరలోనే తేలనుంది. ఉపఎన్నిక షెడ్యూల్, అభ్యర్థుల ఖరారు ప్రక్రియ మొదలయ్యే సమయానికి టీవీకే అధిష్ఠానం, త్రిష ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Voter List: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల -భారీగా నమోదైన ఓట్లు.. ఏ పార్టీకి ప్లస్? ఎవరికి మైనస్?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల -భారీగా నమోదైన ఓట్లు.. ఏ పార్టీకి ప్లస్? ఎవరికి మైనస్?
Congress Dissent: రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి సర్దుకున్నట్లేనా? బీఎం సందీప్ వార్నింగ్‌తో అసంతృప్తి ఆగుతుందా!?
రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి సర్దుకున్నట్లేనా? బీఎం సందీప్ వార్నింగ్‌తో అసంతృప్తి ఆగుతుందా!?
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget