హెచ్ఎండీఏ మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్ల పరిధిలోని భూములను కోకాపేట నియోపొలిస్, బుద్వేల్ మాదిరిగానే మెగా లేఅవుట్‌గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
HMDA Miyapur Layout: మియాపూర్‌లో మెగా లేఅవుట్ అభివృద్ధికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుమారు రూ. 600 కోట్ల నుంచి రూ. 700 కోట్లతో ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

- మియాపూర్ 550 ఎకరాల భూమి ప్రభుత్వానికేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
- ఆక్రమణలు పోను, 400 ఎకరాలను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేయనుంది.
- రూ.600-700 కోట్లతో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
- ప్లాట్లుగా విభజించిన స్థలాలను త్వరలో ఈ-వేలం వేస్తారు.
HMDA Miyapur Layout: హైదరాబాద్ నగర శివార్లలో భూముల అభివృద్ధి, అమ్మకాల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA). ఇప్పుడు మియాపూర్‌పై దృష్టి సారించింది. కోకాపేటలోని నియోపొలిస్, బుద్వేల్ మాదిరిగానే శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని భూములను మెగా లేఅవుట్‌గా అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పుతో
మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల యాజమాన్య హక్కులపై గత 23 ఏళ్లుగా ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు, పలు సొసైటీల మధ్య న్యాయపోరాటం జరిగింది. ఇటీవల ఈ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ మొత్తం 550 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఏ అధికారులు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.
రూ. 600-700 కోట్లతో అభివృద్ధి
అధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం మొత్తం 550 ఎకరాల్లో 110 నుంచి 150 ఎకరాల వరకు ఆక్రమణలు జరిగి కాలనీలు, బస్తీలు వెలిశాయి. ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్లకుండా, ఆక్రమణల విషయంలో ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆక్రమణలు పోను మిగిలిన 386 నుంచి 400 ఎకరాల ఖాళీ భూమిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 600 కోట్ల నుంచి రూ. 700 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.
లేఅవుట్ ప్రత్యేకతలు
నియోపొలిస్ తరహాలో ఈ లేఅవుట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించనున్నారు. మొత్తం 400 ఎకరాల్లో సుమారు 150 ఎకరాల భూమిని కేవలం రహదారులు, పార్కులు, గ్రీన్ స్పేస్, మౌలిక వసతుల కోసమే కేటాయించనున్నారు. మిగిలిన స్థలాన్ని ప్లాట్లుగా విభజించి త్వరలోనే ఈ-వేలం వేయాలని భావిస్తున్నారు.
Also Read: రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి సర్దుకున్నట్లేనా? బీఎం సందీప్ వార్నింగ్‌తో అసంతృప్తి ఆగుతుందా!?
భారీ డిమాండ్
ముంబయి నేషనల్ హైవే(NH-65)కు కేవలం అర కిలోమీటరు దూరంలోనే ఈ భూములు ఉండటం, ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఉండడంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఈ లేఅవుట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భూముల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయడంతో, అభివృద్ధి పనులకు నిధులు కూడా త్వరగా మంజూరు కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Frequently Asked Questions
హెచ్‌ఎండీఏ మియాపూర్‌లో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది?
మియాపూర్ భూమి యాజమాన్యంపై సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి?
మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు 23 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత, ఈ మొత్తం భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది.
మియాపూర్‌లో ఎంత భూమిని అభివృద్ధి చేయనున్నారు, అంచనా వ్యయం ఎంత?
ఆక్రమణలు పోను మిగిలిన 386 నుంచి 400 ఎకరాల ఖాళీ భూమిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 600 కోట్ల నుంచి రూ. 700 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.
మియాపూర్ లేఅవుట్‌లోని ప్రధాన ప్రత్యేకతలు ఏమిటి?
నియోపొలిస్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పిస్తారు. మొత్తం 400 ఎకరాల్లో 150 ఎకరాలు రహదారులు, పార్కులు, గ్రీన్ స్పేస్, ఇతర మౌలిక వసతుల కోసం కేటాయిస్తారు.
మియాపూర్ లేఅవుట్‌కు ఎందుకు భారీ డిమాండ్ ఉంది?
ఈ భూములు ముంబయి నేషనల్ హైవే (NH-65)కి అర కిలోమీటరు దూరంలో, ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఉండడంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















