DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
బెంగళూరు ప్రాక్టీస్ క్యాంప్ లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ సందడి చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ స్టాఫ్ లో బిగ్ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

Sourav Ganguly, Yuvi in Delhi Capitals Camp: ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తమ కోచింగ్ సెటప్‌లో బిగ్ చేంజెస్ చేయడానికి రెడీ అవుతోంది. బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీలో జరిగిన ట్రెయినింగ్ క్యాంప్‌లో ఇండియా లెజెండ్స్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ కనిపించడంతో ఈ ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ మార్పుల్లో భాగంగా ఈ ఇద్దరు దిగ్గజాలు కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. అభినేక్ శర్మకు మెంటార్‌గా వ్యవహరించిన యువరాజ్ పేరు ఇప్పుడు ఐపీఎల్ కోచింగ్ రేసులో హాట్ టాపిక్ గా మారింది.
Sourav Ganguly is back as Director of Cricket for the Delhi Capitals men’s team.
— Vishal Yadav (@VishalY73709681) August 8, 2026
As JSW Group begins its two-year cycle, Dada takes charge of the IPL side once again.
Sources : Sportskeeda #DelhiCapitals #SouravGanguly pic.twitter.com/jxZqq4Q2yX
నెట్స్ లో యువరాజ్ టిప్స్.. స్క్వాడ్ ప్లానింగ్ లో గంగూలీ
ట్రెయినింగ్ సెషన్‌లో యువరాజ్ సింగ్ నెట్స్ వెనుక ఉంటూ యంగ్ బ్యాటర్లకు టెక్నికల్ అడ్వైజెస్ ఇచ్చాడు. పవర్ హిట్టింగ్ మెకానిక్స్ ని అబ్జర్వ్ చేస్తూ గైడెన్స్ ఇచ్చాడు. మరోవైపు గంగూలీ టీమ్ స్క్వాడ్ ప్లానింగ్, బిగ్ పిక్చర్ పై ఫోకస్ పెట్టాడు. మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా లోకల్ బౌలింగ్ టాలెంట్‌ను అంచనా వేస్తూ సెషన్ మేనేజ్‌మెంట్‌లో హెల్ప్ చేశాడు. గంగూలీ హెడ్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చూస్తుండగా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ మెంటార్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Yuvraj singh Was Heavily invested and active During DC Trials🐯
— Morris (@sinha7605) August 9, 2026
-He Guided Many Players and rizvi went to yuvi for help we may see some technical changes in stance
Super proud of this group they r heavily invested and serious🤞 pic.twitter.com/UfIzbkxOLD
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలకు మెంటార్ షిప్.. యువరాజ్ అగ్రెసివ్ మైండ్ సెట్
ఇప్పటికే శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యంగ్ ఇంటర్నేషనల్ బ్యాటర్లకు ఇన్ఫార్మల్‌గా మెంటార్ షిప్ ఇచ్చి యువరాజ్ వాళ్ల సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. అతని టాక్టికల్ మైండ్ సెట్, అగ్రెసివ్ బ్యాటింగ్ థింకింగ్ టీమ్ కి ప్లస్ అవుతుందని యాజమాన్యం భావిస్తోంది. జేఎస్డబ్ల్యూ (JSW) ఆపరేషనల్ కంట్రోల్ తీసుకోవడంతో సపోర్ట్ స్టాఫ్ లో భారీ మార్పులు రానున్నాయి.
ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ పై టార్గెట్.. రీ-ఎంట్రీ ఇచ్చిన పంత్
గంగూలీ అడ్మినిస్ట్రేటివ్ లీడర్‌షిప్, యువరాజ్ మోడర్న్ టి20 మైండ్ సెట్ తో కలసి ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ కొట్టాలని ఢిల్లీ ప్లాన్ చేస్తోంది. కొత్త సీజన్‌కు ముందే లక్నో సూపర్ జెయింట్స్ నుంచి లోకల్ స్టార్ రిషభ్ పంత్‌ను ఫ్రాంచైజీ మళ్లీ సొంతం చేసుకుంది. ఈ లెజెండరీ కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యూచర్ ను ఎలా మారుస్తుందో చూడాలి.
ట్రెండింగ్ వార్తలు



















