ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జనవరి 2027లో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా 5 మ్యాచ్‌లతో కూడిన టెస్ట్ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
INDIA vs AUSTRALIA Test Series : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చే ఏడాది జనవరిలో రానుంది. WTC 2025-27లో భాగంగా నిర్వహించనున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్, ఆసీస్ జట్లు తలపడనున్నాయి.

- ఆస్ట్రేలియా జనవరి 2027లో భారత్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది.
- నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్‌లలో టెస్టులు జరుగుతాయి.
- ఈ సిరీస్ డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో కీలకం.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ లో చాలా కీలకమైన సిరీస్ అని తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుండి గాలేలో జరగనుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుండి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. ఆస్ట్రేలియా జట్టు జనవరి 2027లో భారత పర్యటనకు రానుంది. ఈ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్ చూడండి.
నాగ్‌పూర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్ట్
ఆస్ట్రేలియా భారత పర్యటన జనవరి 2027 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జనవరి 21న ప్రారంభమవుతుంది. ఈ స్టేడియంలో భారత్ 7 టెస్టులు ఆడగా, అందులో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయి, 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
చెన్నైలో రెండో టెస్ట్
ఆస్ట్రేలియా జట్టు తమ పర్యటనలో రెండో టెస్ట్ చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో భారత్‌ను ఢీకొట్టనుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 మధ్య షెడ్యూల్ చేశారు. ఇది ఒక చారిత్రక మైదానం, ఇక్కడ భారత్ 35 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. 16 టెస్టుల్లో గెలవగా, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ గువాహటిలోని డాక్టర్ భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 11 నుండి 15 మధ్య టెస్ట్ షెడ్యూల్ చేశారు. ఈ వేదికలో జరిగిన ఏకైక టెస్ట్ గతేడాది దక్షిణాఫ్రికాతో జరగ్గా, అందులో భారత్ ఓటమిపాలైంది.
రాంచీలో నాలుగో టెస్ట్..
నాలుగో టెస్ట్ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతుంది. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఫిబ్రవరి 19 నుంచి 23 మధ్య జరగనుంది. ఈ గ్రౌండ్‌లో భారత్ 3 టెస్టులు ఆడగా, అందులో 2 గెలిచి, ఒక మ్యాచ్ ఆస్ట్రేలియాతో డ్రా అయింది.
అహ్మదాబాద్‌లో చివరి టెస్ట్
సిరీస్‌లో చివరిదైన 5వ టెస్ట్ ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానంలో భారత్ 16 టెస్టులు ఆడగా, అందులో 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్ 4 మ్యాచ్‌ల్లో గెలవగా 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
WTC 2025-27 పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఎక్కడ..
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు 9 టెస్టుల్లో 4 గెలిచి, మరో 4 ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంది. శ్రీలంకతో జరగబోయే రాబోయే సిరీస్ సైతం చాలా కీలకం. అందులోని 2 మ్యాచ్‌లను గెలిస్తే కనుక ఆ పాయింట్లతో భారత్ టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.
Before You Go
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Frequently Asked Questions
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎప్పుడు భారత్‌లో పర్యటిస్తుంది?
భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రాముఖ్యత ఏమిటి?
ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో చాలా కీలకమైనది. దీని ద్వారా పాయింట్ల పట్టికలో స్థానాలు మారే అవకాశం ఉంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ ఎక్కడ జరుగుతుంది?
జనవరి 21న నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియంలో భారత్ 7 టెస్టుల్లో 5 గెలిచింది.
ఈ సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నాయి? చివరి టెస్ట్ ఎక్కడ జరుగుతుంది?
ఈ సిరీస్‌లో 5 టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. చివరి టెస్ట్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 మధ్య జరుగుతుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంత?
ప్రస్తుతం భారత్ 5వ స్థానంలో ఉంది. శ్రీలంకతో జరగబోయే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు గెలిస్తే భారత్ టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు




















