అన్వేషించండి

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!

SBI Clerk Notification 2026:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15వందల క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కోసమే నియామక ప్రక్రియ చేపట్టింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎస్‌బీఐ 1538 జూనియర్ అసోసియేట్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు మాత్రమే; డిగ్రీ, వయోపరిమితి అర్హతలు.
  • ప్రిలిమ్స్, మెయిన్స్ ఎంపిక విధానం; నవంబర్ 27 చివరి దరఖాస్తు తేదీ.

SBI Clerk Notification 2026:బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ ప్రారంభించాలని ఆశిస్తున్న రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వం రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. జూనియర్ అసోసియేట్‌ విభాగంలో ఖాళీగా ఉన్న 1538 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రారంభించింది. 

సాధారణంగా బ్యాంక్ నోటిఫికేషన్లలో అన్ని వర్గాలకు పోస్టులు ఉంటాయి, కానీ ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేయడానికి ఉద్దేశించింది. జనరల్‌ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. తక్కువ పోటీతో భారత్‌లోనే అత్యంత విశ్వసనీయమైన బ్యాంకులో ఉద్యోగం సాధించేందుకు ఇదొక మంచి అవకాశం. 

దేశవ్యాప్తంగా మొత్తం 1538 పోస్టులు ఉండగా, కేటగిరీల వారీగా విభజన చూస్తే ఎస్సీలకు 1219 పోస్టులు, ఎస్సీలు 207 పోస్టులు, ఓబీసీలకు 112 పోస్టులు కేటాయించారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి

తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 88 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే కేటాయించారు. తెలంగాణలో 32 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా ఎస్టీ వర్గానికి కేటాయించారు. అంతేకాకుండా గుజరాత్‌ 289, మహారాష్ట్ర 165 వంటి రాష్ట్రాల్లో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు- వయోపరిమితి 

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు డిసెంబర్ 31, 2026 నాటికి ఉత్తీర్ణత పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదేళ్ల సడలింపు ఉంది. గరిష్టంగా ౩౩ ఏళ్ల వరకు  దరఖాస్తు చేసుకోవచ్చు. OBC అభ్యర్థులకు 3ఏళ్లు సడలింపు ఉంటుంది. 31 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు కేటగిరీని బట్టి 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఎస్‌బీఐ క్లర్క్‌ ఎంపికలో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మూడు దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో వంద మార్కులు ప్రిలిమ్స్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్‌లు కట్ చేస్తారు. నాలుగు తప్పులకు ఒక మార్కు పోతుంది. 

రెండో దశలో మెయిన్స్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో మెయిన్స్‌కు పిలుస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్‌ క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్ అండ్ కంప్యూటర్‌ అంశాలు ఉంటాయి. దీనికి 2 గంటల 40 నిమిషాల సమయం కేటాయిస్తారు. 

స్థానిక భాషా పరీక్ష మూడో దశలో ఉంటుంది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర భాషను చదవడం రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. పది లేదా 12వ తరగతిలో ఆ భాషను చదివి ఉంటే ఈ పరీక్ష అవసరం లేదు. 

జీతం- ఇతర ప్రయోజనాలు 

ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌గా చేరిన వారికి ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. మెట్రో నగరాల్లో చేరిన వారికి నెలకు దాదాపు 37వేల నుంచి 42 వేల వరకు గ్రాస్ శాలరీ అందుతుంది. దీంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ ఇన్సూరెన్స్‌ సదుపాయాలు ఉంటాయి. పదోన్నతుల ద్వారా వేగంగా ఆఫీసర్ స్థాయికి చేరుకోవచ్చు. 

దరఖాస్తు ప్రక్రియ 

దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజులు చెల్లించాల్సిన పని లేదు. ఓబీసీ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి. 

అభ్యర్థులు sbi.bank/careers వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫొటో, సంతకం, ఎడమచేతి బొటనవేలి ముద్రను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. 

Frequently Asked Questions

ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది?

ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామకం. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి?

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏప్రిల్ 2026 నాటికి వయస్సు 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది?

ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మూడు దశలలో ఎంపిక జరుగుతుంది. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, అలాగే స్థానిక భాషా పరీక్ష ఉంటాయి.

దరఖాస్తు రుసుము ఎంత? చివరి తేదీ ఎప్పుడు?

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము లేదు. ఓబీసీ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 27.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget