అన్వేషించండి

AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

AP Direct Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రత్యక్షంగా అంటే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే ఎన్నుకునేలా మారుస్తున్నారు.

Mayor Elections:   ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నగారా త్వరలోనే మోగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి కేవలం ఎన్నికలు నిర్వహించడమే కాకుండా, నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్ల ఎన్నిక విధానంలో చారిత్రాత్మక మార్పు తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. కౌన్సిలర్లు/కార్పొరేటర్లు మేయర్లను ఎన్నుకునే పరోక్ష పద్ధతికి స్వస్తి చెప్పి, ప్రజలే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

 ప్రత్యక్ష vs పరోక్ష పద్ధతి: అసలు తేడా ఏంటి? 

రాజకీయాల్లో విధానపరంగా ఈ రెండు ఎన్నికల పద్ధతులకు చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. పరోక్ష పద్ధతి విధానంలో ప్రజలు కేవలం తమ వార్డు కౌన్సిలర్లను లేదా కార్పొరేటర్లను మాత్రమే ఓటు వేసి ఎన్నుకుంటారు. అలా గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లంతా కలిసి అసెంబ్లీ తరహాలోనే తమలో ఒకరిని మేయర్‌గా లేదా చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష పద్ధతి పద్ధతిలో ఓటరుకు రెండు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఒకటి తన వార్డు కౌన్సిలర్‌ను ఎన్నుకోవడానికి, రెండోది మొత్తం పట్టణానికి లేదా నగరానికి పెద్దయిన మేయర్, చైర్మన్‌ను ఎన్నుకోవడానికి. అంటే ఇక్కడ మేయర్ అభ్యర్థి నేరుగా ప్రజల తీర్పుతోనే పీఠంపై కూర్చుంటారు.

 ఏపీలో ప్రత్యక్ష పద్ధతి ఎప్పుడు ఉంది? 

ఆంధ్రప్రదేశ్‌లో మేయర్లు, చైర్మన్లను నేరుగా ఎన్నుకునే విధానం కొత్తదేమీ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్టీ రామారావు  హయాంలో 1987లో తొలిసారిగా మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీ సమితి అధ్యక్షులను నేరుగా ప్రజలే ఎన్నుకునే విప్లవాత్మక విధానాన్ని తెచ్చారు. ఆ తర్వాత 2000లో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ మేయర్లను కూడా నేరుగా ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణ చేశారు. అయితే, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ విధానాన్ని రద్దు చేసి మళ్లీ పరోక్ష పద్ధతిని తెచ్చారు. ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వాల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ చట్టాలు మారుతూ వచ్చాయి.

ఫిరాయింపులకు కరెక్ట్  చెక్‌మేట్ 

పరోక్ష పద్ధతిలో అతిపెద్ద మైనస్ ఏంటంటే.. క్యాంపు రాజకీయం, రిసార్ట్ పాలిటిక్స్ . ఎన్నికలు ముగియగానే మెజార్టీ కోసం కౌన్సిలర్లను రిసార్టులకు తరలించడం,  బెదిరింపులు, కోట్లాది రూపాయల చేతులు మారడం పరిపాటిగా మారింది. ప్రజా తీర్పు ఒక పార్టీకి వస్తే, గెలిచిన కౌన్సిలర్లను కొనుగోలు చేసి మరో పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఘటనలు కోకొల్లలు. కానీ ప్రత్యక్ష పద్ధతి వస్తే ఈ ఫిరాయింపులకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. మేయర్ లేదా చైర్మన్ ప్రజల ఓట్లతో నేరుగా గెలుస్తారు కాబట్టి, కౌన్సిలర్లు పార్టీ మారినా లేదా తిరుగుబాటు చేసినా మేయర్ కుర్చీకి ఎలాంటి ముప్పు ఉండదు. ఇది స్థానిక సంస్థల్లో రాజకీయ స్థిరత్వాన్ని తెస్తుంది.

 ఎవరికి మేలు? ఎవరికి నష్టం? 

ఈ మార్పు వల్ల ప్రధానంగా  ప్రజలకు, బలమైన లీడర్‌షిప్ ఉన్న పార్టీలకు  ప్రయోజనం చేకూరుతుంది. తమ నగరాన్ని లేదా పట్టణాన్ని పాలించే నాయకుడు ఎవరో ప్రజలకు స్పష్టత ఉంటుంది. వార్డు స్థాయి రాజకీయం కంటే నగర సమగ్ర అభివృద్ధి విజన్ ఉన్న నాయకుడిని ప్రజలు ఎన్నుకునే వీలుంటుంది. సాధారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రధాన నాయకుడి ఇమేజ్, ప్రభుత్వ గ్రాఫ్ బాగా పనిచేస్తాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం సానుకూలంగా ఉండటం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ క్యాంపెయినర్ల ఇమేజ్ కలసివస్తుందనే ధీమాతో ప్రభుత్వం ఉంది.  బలమైన మున్సిపల్ అభ్యర్థులు, విస్తృతమైన ప్రచారం చేయగల సామర్థ్యం ఉన్న ప్రతిపక్షానికే ఇది అనుకూలిస్తుంది. కౌన్సిలర్ల స్థాయి బేరసారాలతో గెలవాలనుకునే వ్యూహాలకు ఈ పద్ధతి గండికొడుతుంది.

 సవాళ్లు కూడా లేకపోలేదు! 

ప్రత్యక్ష పద్ధతిలో కొన్ని యాజమాన్య లోపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు.. ఒకవేళ ప్రజలు ఒక పార్టీకి  చెందిన అభ్యర్థిని మేయర్‌గా ఎన్నుకుని, కార్పొరేటర్లలో మెజార్టీ స్థానాలను మరో పార్టీకి కట్టబెడితే అక్కడ నిరంతరం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మేయర్ ప్రతిపాదించే బడ్జెట్ లేదా అభివృద్ధి పనులను కౌన్సిల్ ఆమోదించకుండా అడ్డుకునే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల నగర పాలన పడకేసే అవకాశం కూడా లేకపోలేదు. స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి, క్యాంపు రాజకీయాల అసహ్యకరమైన సంస్కృతిని తుడిచిపెట్టడానికి ప్రత్యక్ష ఎన్నికల విధానం ఒక మంచి మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించిన అనంతరమే ఈ ముందస్తు మున్సిపల్ సమరానికి ప్రభుత్వం తెరలేపనుంది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget