Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Spider Man OTT Platform : హాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'స్పైడర్ : బ్రాండ్ న్యూ డే' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Tom Holland's Spider Man OTT Platform Locked : హాలీవుడ్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే' (Spider Man Brand New Day) బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వీక్ డేస్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా $1.31 బిలియన్ డాలర్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.12,300 కోట్లకు పైగా కలెక్షన్స్) పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో ఇప్పటివరకూ రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
థియేట్రికల్ రన్ తర్వాత స్పైడర్ మ్యాన్ లేటెస్ట్ మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ సెకండ్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 'స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్' జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. లేటెస్ట్ మూవీ ఈ ఓటీటీలోనూ వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Also Read : Mahesh Babu : వి లవ్ సో మచ్ మహేశ్ - రాజ కుమారుడితో భార్య నమ్రత, కూతురు సితార బెస్ట్ మూమెంట్స్
ఈ మూవీకి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించగా... టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా నటించాడు. అతనికి జోడీగా జెండయా నటించారు. జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్నాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో తదితరులు కీలకపాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) ఎవరనేది ప్రపంచం మర్చిపోవడంతో స్నేహితులు, ప్రియురాలు అందరికీ దూరంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. న్యూయార్క్‌లో జరగబోయే నేరాలను తన ట్రాకింగ్ సిస్టమ్‌తో ముందే పసిగట్టి వాటిని అడ్డుకుంటూ నేరస్థులను చట్టానికి అప్పగిస్తూ... ఓ ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్‌గా వ్యవహరిస్తుంటాడు. సరిగ్గా అదే టైంలో స్పైడర్ మ్యాన్ శరీరంలో ఊహించని మార్పులు జరుగుతుంటాయి.
హార్మోన్ల ప్రతిస్పందన తీవ్రంగా ఉండడంతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. మరోవైపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్‌పై ఓ అదృశ్య శక్తి దాడులు చేస్తూ V MAX కోసం వెతుకుతూ ఉంటుంది. అసలు డీసీసీపై దాడి చేస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? వి మ్యాక్స్ అంటే ఏంటి? ఆ శక్తిని ఎదుర్కొనేందుకు స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? తన ప్రియురాలికి పీటర్ పార్కర్ ఎలా గుర్తొచ్చాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Before You Go
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















