అన్వేషించండి

Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్

చావుబతుకుల మధ్య ఉన్న కుమార్తె ప్రియాంక పరిస్థితిపై ఆమె తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రియాంక తండ్రి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.
  • రాజమండ్రిలో కారు ఢీకొనడంతో ప్రియాంక చావుబతుకుల మధ్య ఉంది.
  • ఎస్పీ ప్రకారం, ఇది ఉద్దేశపూర్వక హత్యాయత్నం, సాధారణ ప్రమాదం కాదు.

హైదరాబాద్: రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తె పరిస్థితిపై కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదన్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన కుమార్తె ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని కన్నీరుమున్నీరయ్యారు. మెడిసిన్ ర్యాంక్ సాధించిన ప్రతిభావంతురాలైన తమ బిడ్డకు ఇలాంటి దారుణ పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని, తమ జీవితం అంధకారంగా మారిపోయిందని ఆవేదన చెందారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించకపోవడం, బాధితురాలి పరిస్థితిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రతి వారం, ప్రతి నెలా హైదరాబాద్ వచ్చే నాయకులు తమ బిడ్డ ఆరోగ్యం గురించి కనీసం సమాచారం తెలుసుకోలేరా అని ప్రశ్నించారు. నిన్నటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ పట్టించుకోలేదని, స్థానిక రాజమండ్రి ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. తన కుమార్తెకు ఈ పరిస్థితి కలిగించిన నిందితులను కఠినంగా శిక్షించాలని, నడిరోడ్డుపై ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రమాదం వివరాలు
ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ (AV Mall) సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు: రాజమండ్రి జీఎస్‌ఎల్ (GSL) మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగాంలో పీజీ (వైద్య విద్య) ద్వితీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ ప్రియాంక.

Also Read: Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

ప్రమాదం ఎలా జరిగింది
 సినిమా చూసి స్కూటీపై బయటకు వస్తున్న ప్రియాంక, ఆమె స్నేహితుడిని, మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ వచ్చిన ఇద్దరు యువకులు (సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్) బలంగా ఢీకొట్టారు. స్కూటీ కిందపడిపోగా, కారును ప్రియాంకపై నుంచి అలాగే పోనిచ్చారు.

తలకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రియాంకను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే బ్రెయిన్ డెడ్ అయిందేమోనని టెస్టులు చేయాలని డాక్టర్లు భావించారు కానీ, సోడియం లెవెల్స్ అసాధారణంగా ఉండటంతో టెస్టులు చేయలేదు. 

ప్రకాష్ నగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి, హత్యాయత్నం (Section 308 BNS), డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.

ప్రియాంక ప్రమాద ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కీలక ప్రకటన

రాజమండ్రిలో మెడికో ప్రియాంకపై జరిగిన దాడి సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, నేరపూరిత కక్షతో కూడిన క్రిమినల్ చర్య అని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వి స్పష్టం చేశారు. ప్రియాంకను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసేందుకు యత్నించారన్న తీవ్ర ఆరోపణలతో నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసు బృందాలు రంగంలోకి దిగి అన్ని రకాల కీలక ఆధారాలను సేకరించాయని తెలిపారు. ప్రమాదం సమయంలో ప్రియాంకతో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న ఆమె స్నేహితుడు ఉమేష్ స్టేట్‌మెంట్ కూడా నమోదు చేసినట్లు చెప్పారు.

షాపింగ్ మాల్ ప్రాంగణంలో ప్రియాంక, ఆమె స్నేహితుడు, నిందితుల మధ్య వాగ్వాదం జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆ తర్వాత నిందితులు తమ కారుతో ఉద్దేశపూర్వకంగానే వారి వాహనాన్ని మూడుసార్లు బలంగా ఢీకొట్టినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, ఘటనకు సంబంధించిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే నిందితులు కావాలనే ప్రియాంకపైకి కారును పోనిచ్చి హత్యకు యత్నించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

Frequently Asked Questions

మెడికో ప్రియాంక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

రాజమండ్రిలో ప్రమాదం తర్వాత ప్రియాంక హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ టెస్టులు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు.

ప్రియాంకకు ప్రమాదం ఎలా జరిగింది? నిందితులు ఎవరు?

సినిమా చూసి స్కూటీపై వస్తున్న ప్రియాంక, ఆమె స్నేహితుడిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే నిందితులు కారును ప్రియాంకపై నుంచి పోనిచ్చారు.

ప్రియాంక తండ్రి ఏపీ ప్రభుత్వంపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?

తన కుమార్తె పరిస్థితిపై కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు.

ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి, హత్యాయత్నం (సెక్షన్ 308 BNS), డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Common Travel Pass: త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
Advertisement

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Common Travel Pass: త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
Maruti Victoris Discount: రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న మారుతి సుజుకీ విక్టోరిస్.. ఆ మోడల్ ప్రత్యేకం
Maruti Victoris Discount: రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న మారుతి సుజుకీ విక్టోరిస్
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Anaswara Rajan: కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
Embed widget