అన్వేషించండి

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం

Mamata Banerjee Car Safety: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై రాళ్లతో దాడి చేశారు. కార్యకర్త ఇంటికి వెళ్తుంటే బారక్‌పూర్‌లో తనపై కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మమతా బెనర్జీ కారుపై రాళ్ల దాడి, భద్రత ప్రశ్నలు రేపింది.
  • ఆమె పాత శాంత్రో కారు 2 స్టార్ భద్రతా రేటింగ్‌తో ఉంది.
  • జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ, వాహన కాన్వాయ్‌లో లోపాలు.

Mamata Banerjee Car Attack: టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారుపై బారక్‌పూర్‌లో రాళ్లదాడి జరిగింది. దాంతో ఆమె భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. టీఎంసీ కార్యకర్త ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ దాడిపై మమతా బెనర్జీ మాట్లాడుతూ, కారు కిటికీ తెరిచి ఉంటే తన తల పగిలిపోయేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాళ్లదాడి తర్వాత మమతా బెనర్జీ ఉపయోగిస్తున్న కారు, దాని భద్రతపై చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ మమతా బెనర్జీ వద్ద ఏ కారు ఉంది, అది ఎంతమేరకు సురక్షితం అనేది తెలుసుకుందాం.

మమతా బెనర్జీ కారు, వ్యక్తిగత వాహనం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు అందించినప్పటికీ మమతా బెనర్జీ పేరుమీద ఎలాంటి వ్యక్తిగత వాహనం రిజిస్టర్ కాలేదు. కోల్‌కతా నగరంలో రోజువారీ పనుల కోసం ఆమె తన పార్టీకి చెందిన ఒక సహచరుడు ఇచ్చిన పాత హ్యుందాయ్ సాంట్రో (Hyundai Santro) కారును ఉపయోగిస్తున్నారు. కోల్‌కతా  బయట సుదూర పర్యటనలకు వెళ్లాల్సినప్పుడు ఆమె మహీంద్రా స్కార్పియో లేదా ఇతర ఎస్‌యూవీలను ఉపయోగిస్తారని తెలిసిందే. బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ ప్రభుత్వ ఖర్చుతో లభించే ఖరీదైన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో తాను ప్రయాణించనని ఆమె పేర్కొన్నారు.


Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం

క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ సాంట్రో సేఫ్టీ ఎలా ఉంది?

బారక్‌పూర్‌లో రాళ్లతో జరిగిన దాడి తర్వాత మమతా బెనర్జీ హ్యుందాయ్ సాంట్రో ఇచ్చే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు 5లో కేవలం 2 స్టార్ భద్రతా రేటింగ్ మాత్రమే పొందింది. నివేదికలో కారు నిర్మాణం అంటే బాడీ షెల్, కాళ్ల దగ్గర భాగం సాధారణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం లేదా పెద్ద దాడి పరిస్థితిలో ఈ కారు ఎక్కువ భద్రత ఇవ్వలేదు. టెస్టుల సమయంలో డ్రైవర్ ఛాతీ, మోకాళ్ల రక్షణ కూడా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. 

మమతా బెనర్జీకి ఏ భద్రత కల్పిస్తున్నారు

మమతా బెనర్జీకి అధికారికంగా దేశంలో రెండో అత్యున్నత జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత ఇస్తున్నారు. ఇది యెల్లో బుక్ ప్రోటోకాల్ కింద ఇస్తారు. ఇందులో భాగంగా మొత్తం 55 లేదా అంతకంటే ఎక్కువ సాయుధ కమాండోలు, భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారు.  

  • భద్రతలో మొదటి, అంటే ఇన్నర్ రింగ్ వలయాన్ని అత్యంత శిక్షణ పొందిన NSG లేదా ఎస్‌పీజీ స్థాయి కమాండోలు నిర్వహిస్తారు. 
  • సెక్యూరిటీ మధ్య వలయంలో కార్యకలాపాలను గమనించే సపోర్ట్ సిబ్బంది ఉంటారు. 
  • ఔటర్ రింగ్.. మూడో వలయంలో CRPF, సీఐఎస్ఎఫ్ లేదా స్థానిక పోలీసు సిబ్బంది రాకపోకలు, చుట్టుపక్కల గుంపును కంట్రోల్ చేస్తారు.

Also Read: Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

మాజీ సీఎం కాన్వాయ్, నివాస భద్రత

జెడ్-ప్లస్ ప్రోటోకాల్ కింద వీఐపీ కాన్వాయ్‌లో ముందు వెనుక ఎస్కార్ట్ వాహనాలు, పైలట్ వాహనం, బుల్లెట్‌ప్రూఫ్ కారు, అంబులెన్స్ కూడా ఉంటాయి. అలాగే నివాసం, కార్యాలయంలో 24 గంటలూ గార్డులు అప్రమత్తంగా ఉంటారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం మారిన తర్వాత మమతా బెనర్జీ నివాసం బయట నుంచి కొన్ని అదనపు బారికేడ్లు తొలగించారు. పాత వ్యక్తిగత భద్రతా అధికారులను మార్చిన వివాదం కారణంగా ఆమె కొత్త ప్రభుత్వ భద్రతా సిబ్బంది సేవలను నిరాకరించారు.

ఇల్లు, భూమి లేని ముఖ్యమంత్రి

ఇతర ప్రముఖ రాజకీయ నాయకులకంటే భిన్నంగా మమతా బెనర్జీ ప్రొఫైల్ ఉంది. ఆమె వద్ద ఎలాంటి స్థిరాస్తి లేదు. ఆమెకు ఇల్లు లేదు, కమర్షియల్ భవనం లేదు, వ్యవసాయ భూమి కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రోజువారీ అవసరాల కోసం ఆమె వద్ద 75,700 నగదు ఉంది, ఇది 2021లోని 69,255 రూపాయల కంటే కొంచెం ఎక్కువ. అఫిడవిట్‌లో ఆమెపై ఎలాంటి లోన్ లేదా అప్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత ఇల్లు, స్వంత కారు లేకుండా దేశంలో అతి తక్కువ ఆస్తి ఉన్న ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.

Also Read: Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!

Frequently Asked Questions

మమతా బెనర్జీ కారుపై దాడి ఎక్కడ జరిగింది?

మమతా బెనర్జీ కారుపై బారక్‌పూర్‌లో రాళ్లదాడి జరిగింది. టీఎంసీ కార్యకర్త ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మమతా బెనర్జీ రోజువారీ పనుల కోసం ఏ కారును ఉపయోగిస్తారు?

కోల్‌కతాలో రోజువారీ పనుల కోసం ఆమె తన పార్టీకి చెందిన సహచరుడు ఇచ్చిన పాత హ్యుందాయ్ సాంట్రో కారును ఉపయోగిస్తారు. ఆమె పేరుమీద ఎలాంటి వ్యక్తిగత వాహనం రిజిస్టర్ కాలేదు.

మమతా బెనర్జీ ఉపయోగించే హ్యుందాయ్ సాంట్రో కారు భద్రతా రేటింగ్ ఎంత?

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ సాంట్రో కారుకు 5కి 2 స్టార్ భద్రతా రేటింగ్ మాత్రమే లభించింది. ప్రమాదం లేదా పెద్ద దాడిలో ఈ కారు ఎక్కువ భద్రత ఇవ్వదు.

మమతా బెనర్జీకి ఎటువంటి భద్రత కల్పిస్తున్నారు?

మమతా బెనర్జీకి అధికారికంగా దేశంలో రెండో అత్యున్నతమైన జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత కల్పిస్తారు. ఇందులో 55 లేదా అంతకంటే ఎక్కువ సాయుధ కమాండోలు, భద్రతా సిబ్బంది ఉంటారు.

మమతా బెనర్జీ వద్ద ఎలాంటి ఆస్తులు ఉన్నాయి?

మమతా బెనర్జీకి ఇల్లు, కమర్షియల్ భవనం, వ్యవసాయ భూమి వంటి స్థిరాస్తులు లేవు. ఆమె వద్ద కేవలం 75,700 రూపాయల నగదు మాత్రమే ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget