అన్వేషించండి

Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!

Bikes Under 10000 Down Payment: మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగార్థులకు సొంత టూ వీలర్‌ అనేది అవసరం. అలాంటి బైక్‌ను కేవలం పదివేల డౌన్‌పేమెంట్‌తో ప్రముఖ కంపెనీలు అందిస్తున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చిన్న ఉద్యోగుల రవాణా ఖర్చులకు, బైక్ కొనుగోలుకు రుణ వసతి.
  • కేవలం పదివేల డౌన్‌పేమెంట్‌తో కొత్త బైక్ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
  • హీరో, హోండా వంటి కంపెనీల 100-110cc బైకులు లభ్యమవుతున్నాయి.
  • మంచి క్రెడిట్ స్కోర్ తక్కువ వడ్డీకి లోన్ పొందే అవకాశం.

Bikes Under 10000 Down Payment: ప్రస్తుత రోజుల్లో రవాణా అనేది ఖరీదుగా మారింది. గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్‌, చిన్న తరహా ఉద్యోగులకు ప్రతి రోజూ ఆఫీసులు లేదా పనులకు వెళ్లడానికి సొంతంగా బైక్ ఉండటం చాలా అవసరం. అయితే లక్ష రూపాయలకుపైగా వెచ్చించి ఒకేసారి నగదు రూపంలో బైక్‌ కొనడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసం ఆటోమొబైల్ సంస్థలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు సులభతరమైన రుణ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాయి. కేవలం పదివేల రూపాయల ప్రారంభ చెల్లింపుతో కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. 

తక్కువ డౌన్‌పేమెంట్‌ ప్రయోజనాలు ఏంటీ?

సాధారణంగా వాహన రుణం తీసుకునేటప్పుడు ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తే మిగిలిన అప్పుపై వడ్డీ భారీ తగ్గుతుంది. కానీ తక్షణమే ఎక్కువ నగదు అందుబాటులో లేని వారికి పదివేల డౌన్‌పేమెంట్‌ ఆర్‌్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. దీని వల్ల చేతిలో ఉన్న తక్కువ నగదుతోనే అవసరమైన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని నెలకు చిన్న చిన్న వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. 

పదివేల లభించే టాప్‌ బైక్ మోడల్స్‌

ప్రస్తుతం భారతీయ రోడ్లపై అత్యధిక మైలేజీని, తక్కువ నిర్వహణ ఖర్చులను ఇచ్చే 100cc నుంచి 110cc సెగ్మెంట్‌లో ఐదు  ఉత్తమ బైక్‌లు పదివేల డౌన్‌‌పేమెంట్‌తో అందుబాటులో ఉన్నాయి. 

హీరో స్ప్లెండర్‌ ప్లస్‌

భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కమ్యూటర్‌ బైక్‌ ఇది. దీనిలోని 97.2cc ఇంజన్, i3S టెక్నాలజీ ఇంధన పొదుపు చేస్తుంది. దీని ఆన్‌ రోడ్‌ ధర 90వేలు. ఈ బైక్ కొనాలి అంటే పదివేలు డౌన్‌పేమెంట్‌ చేస్తే మిగతా మొత్తం 80 వేల రూపాయలను 36 నెలలకు తీసుకుంటే 2580 రూపాయలు EMI చెల్లించాలి. 

హీరో హెచ్‌ఎఫ్‌డీలక్స్‌

బడ్జెట్‌ ధరలో లభించే అత్యంత సరసమైన బైక్ ఇది. రైడర్లు సౌకర్యవంతమైన హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది. దీని అన్‌రోడ్ ధర 75వేల రూపాయలు. పదివేల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, 65వేల రూపాయలు లోన్ మూడేళ్లకు ఏళ్లకు తీసుకుంటే నెలకు 2,090 రూపాయలు చెల్లించాలి. 

హోండాషైన్‌ 100

స్మూత్ ఇంజన్‌ పనితీరుకు హోండాషైన్ పేరుగాంచింది. దీనిలో ఈఎస్‌పీ టెక్నాలజీ సైలెంట్‌ స్టార్ట్‌ ఫీచర్‌ను అందిస్తుంది. 60-65 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బైక్‌ ఆన్‌రోడ్ ధర 78ేల రూపాయలు. పదివేలు డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే, 68 వేల రూపాయలను మూడేళ్లకు లోన్‌గా తీసుకుంటే నెలకు 2190 రూపాయలు చెల్లించాలి. 

టీవీఎస్‌ స్పోర్ట్

ఎక్కువ మైలేజీని కోరుకునే వారికి టీవీఎస్‌్ స్పోర్ట్ మంచి ఎంపిక. దీనిలోని ఎకో థ్రస్ట్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్ టెక్నాలజీ ఇంజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. 68-70kmpl ఇచ్చే ఈ బైక్ ఆన్‌రోడ్ ప్రైస్‌ 82వేలు. పదివేలు డౌన్‌పేమెంట్ చేస్తే 72వేలు అప్పుగా తీసుకోవచ్చు. దీన్ని మూడేళ్లకు తీసుకుంటే నెలకు 2320 రూపాయలు చెల్లించాలి. 

బజాజ్‌ ప్లాటినా 110

ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని కోరుకునే వారికి దీనిలోని కంఫర్టెక్‌ సస్పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 65-70kmpl ఇచ్చే ఈ బైక్ ఆన్‌రోడ్ ధర 84వేల రూపాయలు. పదివేలు డౌన్‌పేమెంట్ చెల్లించి 74వేల రూపాయలను బ్యాంకు లోన్ రూపంలో తీసుకోవచ్చు. దీన్ని మూడేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలకు 2380 రూపాయలు చెల్లించాలి. 

కొత్త బైక్ కొనే ముందు కేవలం షోరూమ్‌ ధరను మాత్రమే కాకుండా మరికొన్ని ఆర్థిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీ క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు 8.5 నుంచి 9.5 శాతం వంటి తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. అప్పు మంజూరు చేసే సమయంలో బ్యాంకులు 1నుంచి 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తాయి. ఎక్స్‌షోరూమ్‌ ధర కంటే ఆన్‌రోడ్ ధర భిన్నంగా ఉంటుంది. ఇందులో ఆర్టీవో ట్యాక్స్‌, ఇన్సూరెన్స్‌, ఇతర యాక్సెసరీస్‌ ఖర్చులు కలిసి ఉంటాయి. రుణం తీర్చుకోవడానికి మీరు ఎంచుకునే సమయాన్ని భట్టి EMI మారుతుంది. 2 ఏళ్లు ఎంచుకుంటే EMI పెరుగుతుంది. కానీ వడ్డీ తగ్గుతుంది. అదే 3ఏళ్లు ఎంచుకుంటే నెలకు కట్టే మొత్తం తగ్గుతుంది. అదే టైంలో చెల్లించే వడ్డీ పెరుగుతుంది. పదివేల డౌన్‌పేమెంట్‌తో బైక్ కొనడం సులభమైన మార్గమే. కానీ దీన్ని పాతికవేలు వరకు పెంచుకుంటే మీకు రుణ, వడ్డీ భారం తగ్గుతుంది. 

Frequently Asked Questions

ప్రస్తుతం బైక్ కొనడానికి సులభ రుణాల ఆవశ్యకత ఏమిటి?

ప్రస్తుత రవాణా ఖర్చులు అధికం కావడంతో, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ వంటి వారికి సొంత బైక్ అవసరం. లక్షల రూపాయలు వెచ్చించి ఒకేసారి కొనలేని వారికి ఈ సులభ రుణ సౌకర్యాలు ఉపయోగపడతాయి.

తక్కువ డౌన్‌పేమెంట్‌తో బైక్ కొనుగోలు వల్ల లాభాలు ఏమిటి?

చేతిలో తక్కువ నగదు ఉన్నవారు రూ.10,000 వంటి తక్కువ డౌన్‌పేమెంట్‌తో బైక్ కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని సులభమైన నెలవారీ వాయిదాలలో చెల్లించే అవకాశం లభిస్తుంది.

రూ.10,000 డౌన్‌పేమెంట్‌తో ఏ బైక్ మోడల్స్ లభిస్తాయి?

భారతీయ రోడ్లపై అధిక మైలేజీని, తక్కువ నిర్వహణ ఖర్చులను ఇచ్చే 100cc నుండి 110cc సెగ్మెంట్‌లోని ఐదు ఉత్తమ బైక్‌లు రూ.10,000 డౌన్‌పేమెంట్‌తో లభిస్తున్నాయి.

కొత్త బైక్ లోన్‌పై తీసుకునేటప్పుడు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

లోన్ తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోరు, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, ఆన్‌రోడ్ ధర (RTO, ఇన్సూరెన్స్ కలిపి), అలాగే EMI కాలవ్యవధి వంటి ఆర్థిక అంశాలను పరిగణించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కనీస డౌన్‌పేమెంట్‌తోనే కొత్త టాటా టిగోర్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.. పూర్తి ఫైనాన్స్ ప్లాన్ ఇదిగో
Tata Tigor కొనడానికి రూ.9,998, రూ.9,457, రూ.8,959 EMI ఆప్షన్లు - మీరు ఏది ఎంచుకుంటారు?
TVS Ronin కొనడానికి రూ.20,000 చాలు! తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధరలు & EMI వివరాలు ఇవిగో
మోడ్రన్‌ రెట్రో బైక్‌ TVS Ronin.. కేవలం రూ.20,000తో సొంతం చేసుకునే ప్లాన్‌!
టీవీఎస్ రోనిన్‌లో నాలుగు వేరియంట్లు.. మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో తెలుసుకోండి!
TVS Ronin కొనాలనుకుంటున్నారా? ఏ వేరియంట్ ఎంత, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
సరికొత్తగా వచ్చిన Mahindra Thar OG.. అయినా ఈ 9 ఫీచర్లు మిస్సింగ్‌!
Mahindra Thar OGలో ఇవి మిస్‌.. టాప్ వేరియంట్‌లోనూ లేని 9 ఫీచర్లు ఇవే!
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
Telangana committee probe KCR lands : కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!
Title Sponsorship Deal: టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ
టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ
Sai Durgha Tej : ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
ఐదేళ్ల క్రితం రెండో ఛాన్స్ - రోడ్డు ప్రమాదంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ నోట్... హెల్మెట్ ధరించాలంటూ...
Pumpkin Seeds Benefits : 30 రోజులు గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. బరువు తగ్గుతారా?
30 రోజులు గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. బరువు తగ్గుతారా?
Embed widget