అన్వేషించండి

Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

Mahindra Scorpio N Facelift | కొత్త స్కార్పియో-Nలో చేసిన అతిపెద్ద మార్పులలో పనోరమిక్ సన్‌రూఫ్ ఒకటి. ఈ ఫీచర్ ప్రత్యేకంగా Z8L వేరియంట్‌లో ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాత ఇంజిన్‌లతో, ఫీచర్లు, సాంకేతికతపై కంపెనీ ప్రధాన దృష్టి.

మీరు ఒక పవర్‌ఫుల్, పెద్ద SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇటీవల లాంచ్ అయిన Mahindra Scorpio N Facelift మీకు సరిగ్గా సరిపోతుంది. మీరు ఈ వాహనాన్ని ఫుల్ పేమెంట్ ఇవ్వకుండా ఫైనాన్స్ ద్వారా సైతం కొనుగోలు చేయవచ్చు. ఒకేసారి పూర్తి నగదు చెల్లించలేని వారు డౌన్ పేమెంట్, EMI లెక్కలు తెలుసుకోవాలి.

Mahindra Scorpio N Facelift హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్ మోడల్ డీజిల్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 25.54 లక్షలు. ఈ కార్ Z2 పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 16 లక్షలుగా ఉంది.

ప్రతి నెల ఎంత EMI చెల్లించాలి?
మహీంద్రా స్కార్పియో కార్ కొనుగోలు చేయడానికి రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే కనుక, 9.8 శాతం వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకి ప్రతి నెల రూ. 37,903 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 5 సంవత్సరాలకు ఈ లోన్ తీసుకుంటే, ప్రతి నెల రూ. 31,726 మేర EMI చెల్లించాలి.

కొత్త స్కోర్పియో-Nలో చేసిన అతిపెద్ద మార్పులలో పనోరమిక్ సన్‌రూఫ్ ఇచ్చారు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా Z8L వేరియంట్‌లో ఇచ్చారు. దీనివల్ల SUV క్యాబిన్ గతంలో కంటే మరింత ప్రీమియం, విశాలమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అంతకుముందు స్కోర్పియో-Nలో సన్‌రూఫ్ ఉండేది, కానీ కొత్త మోడల్‌లో దీన్ని మరింత పెద్దదిగా చేసి పనోరమిక్ సన్‌రూఫ్‌గా ఇచ్చారు. 

కార్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మహీంద్రా స్కార్పియో Nలో ఇప్పుడు 540 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా ఇచ్చారు. దీనితో పాటు బ్లైండ్ వ్యూ మానిటర్ లభిస్తుంది. దీనివల్ల డ్రైవింగ్ సీట్ నుండి సులభంగా కనిపించని ప్రదేశాలను డ్రైవర్ చూడటానికి హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా నగరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమయంలో డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

కొత్త స్కార్పియో-N క్యాబిన్‌లో కూడా పెద్ద అప్‌డేట్ చేశారు. ఇందులో 12.3 అంగుళాల ఫ్లోటింగ్ HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,దీనితో పాటు 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. దీని ద్వారా డ్రైవర్ స్పీడ్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని మోడ్రన్ పద్ధతిలో చూడవచ్చు.

Also Read : రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి

మహీంద్రా కంపెనీ దీని క్యాబిన్‌ను మునుపటి కంటే మరింత ప్రీమియమ్‌గా చేయాలని ప్రయత్నించింది. పెద్ద స్క్రీన్ సెటప్ ఉండటం వల్ల డాష్‌బోర్డ్‌కు మరింత మోడర్న్ లుక్ లభిస్తుంది. ఫేస్‌లిఫ్ట్‌తో పాటు మహీంద్రా కొత్త Z8S వేరియంట్‌ను పరిచయం చేసింది. దీన్ని Z6, Z8 వేరియంట్‌ల మధ్య ఉంచారు.

Z8Sలో 17 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, LED DRLs, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. 

కొత్త స్కార్పియో-N టాప్ వేరియంట్ Z8Lలో లెవల్-2 ADAS.. ఈ సిస్టమ్ డ్రైవింగ్ సమయంలో సేఫ్టీ, డ్రైవర్‌కు సహాయం చేయడానికి అనేక ఫీచర్లు అందిస్తుంది. దీనితో పాటు బ్లైండ్ వ్యూ మానిటర్, 540 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి. దీనితో కొత్త స్కార్పియో-N సాంకేతికత విషయంలో తన సెగ్మెంట్‌లోని ఇతర కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

ఈ వేరియంట్లలో ప్రత్యేక ఫీచర్లు
మహీంద్రా కేవలం ఖరీదైన వేరియంట్లపై మాత్రమే ఫోకస్ చేయలేదు. బేస్ Z2 వేరియంట్‌లో కూడా అనేక ముఖ్యమైన ఫీచర్లను ఇచ్చింది. ఇందులో LED టెయిల్ ల్యాంప్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, ESP, సెకండ్-రో AC వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

Also Read: గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు

 Z4 వేరియంట్‌లో 20.32 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,ఎలక్ట్రిక్ ORVM, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వైపర్, వాషర్, అలాగే రూఫ్ స్పాయిలర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. Z6 వేరియంట్‌లో సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, రివర్స్ కెమెరా,  6 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు అందించారు.

కార్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు
మహీంద్రా దీని ఇంజన్, మెకానికల్ సెటప్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. స్కార్పియో N మునుపటిలాగే 2.0 లీటర్ టర్బో-పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు లభిస్తాయి. అలాగే కొన్ని వేరియంట్లలో 2WD, 4WD ఆప్షన్ కూడా ఉంది. అంటే కంపెనీ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా ఫీచర్లు, టెక్నాలజీ,  ప్రీమియం లుక్‌పై దృష్టి సారించింది. ఇంజన్ పవర్, సామర్థ్యంలో ఎలాంటి మార్పులపై ఫోకస్ చేయలేదు.

ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయడానికి బదులుగా, కంపెనీ వినియోగదారుల రోజువారీ అవసరాలు,  ప్రీమియం ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెట్టింది.పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 540 డిగ్రీ కెమెరా, ADAS వంటి ఫీచర్లు దీనిని పాత మోడల్ కంటే మరింత మోడరన్‌గా మారుస్తాయి.

 

Frequently Asked Questions

స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఇంజన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

ఇంజన్, మెకానికల్ సెటప్‌లో మార్పులు లేవు. ఇది 2.0 లీటర్ టర్బో-పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌లతో లభిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget