అన్వేషించండి

Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!

Flex Fuel Vehicles India: భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లు 14,951కు చేరాయి. వీటిలో 99.85 శాతం టూ వీలర్లే. అధిక ధరలు, E85 లభ్యత వంటివి కార్ల అమ్మకాలకు అడ్డంకిగా మారాయి.

Flex Fuel Vehicle Registrations: భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, ఈ విభాగంలో టూ వీలర్లకే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతోనూ నడిచే (ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌) వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకులు, స్కూటర్ల వాటా ఏకంగా 99.85 శాతం. కార్ల వాటా కేవలం వాటా 0.15 శాతం. అంటే.. ప్యాసింజర్ కార్ల విభాగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి పెద్దగా ఆదరణ లభించడం లేదు. వాహన్ (Vahan) డేటాను విశ్లేషిస్తే ఈ నిజాలు తెలిశాయి.

వాహన్ డేటా ప్రకారం, దేశంలో ఇప్పటివరకు మొత్తం 14,951 ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 14,928 టూ వీలర్లు ఉన్నాయి. అంటే మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 99.85 శాతం. లైట్ మోటార్ వెహికల్స్ (LMV) విభాగంలో కేవలం 23 వాహనాలు మాత్రమే నమోదయ్యాయి. వీటి వాటా 0.15 శాతానికి పరిమితమైంది.

బైకుల వైపు ఎందుకు మొగ్గు చూపారు?

ఫ్లెక్స్ ఫ్యూయల్ టూ వీలర్లకు, సాధారణ పెట్రోల్ మోడళ్లకు మధ్య ధర వ్యత్యాసం తక్కువగా ఉండటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్యాసింజర్ కార్ల విషయానికి వస్తే మాత్రం.. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో వచ్చే అదనపు ధర కొనుగోలుదారులకు భారంగా మారుతోంది. దీనికి తోడు E85 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం కూడా కార్ల మార్కెట్ వృద్ధికి అడ్డంకిగా ఉంది.

2026 జూన్‌లో ఈ విభాగానికి ఊపు వచ్చింది. ఆ సమయంలో Hero MotoCorp తన Splendor+ Flex Fuel, HF Deluxe Flex Fuel మోడళ్లను పరిచయం చేసింది. ఈ బైకులకు E20 నుంచి E85 వరకు పెట్రోల్‌-ఇథనాల్ మిశ్రమాలతో నడిచే సామర్థ్యం ఉంది. ఆ తర్వాత, Maruti Suzuki తన Wagon R Bioflex మోడల్‌ను తీసుకొచ్చింది.

బైకుల ధరల్లో తక్కువ వ్యత్యాసం

ఫ్లెక్స్ ఫ్యూయల్ టూ వీలర్ల రేట్లు సాధారణ పెట్రోల్ వెర్షన్లతో పోలిస్తే పెద్దగా పెరగలేదు. Hero HF Deluxe Flex Fuel ధర రూ.72,792గా ఉంది. సాధారణ HF Deluxeతో పోలిస్తే ఇది కేవలం రూ.172 ఎక్కువ.

ఇక Splendor+ Flex Fuel ధర రూ.82,710గా ఉంది. సాధారణ పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే దీని ధర సుమారు రూ.5,153 అధికం. ఈ స్థాయి ధర వ్యత్యాసం ఉండటంతో కొనుగోలుదారులు ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!

కార్లలో అధిక ధర భారం

మారుతి సుజుకి తీసుకొచ్చిన Wagon R Bioflex టాప్-స్పెక్ ZXi+ వేరియంట్ ఆధారంగా రూపొందింది. దీని ప్రారంభ ధర రూ.7.24 లక్షలు. ఇదే స్థాయి సాధారణ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే సుమారు రూ.85,000 ఎక్కువ.

టూ వీలర్లతో పోలిస్తే కార్లలో ఈ ధర వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు, అధిక ఇథనాల్ మిశ్రమాలు ఉపయోగించినప్పుడు కారు ఇంధన సామర్థ్యం (మైలేజీ) ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీంతో ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు కోసం పెట్టే అదనపు డబ్బుకు తగిన ఆదా తిరిగి వస్తుందా లేదా అన్న సందేహం జనంలో ఉంది.

టయోటా నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్

ప్యాసింజర్ వాహనాల విభాగంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కంపెనీ Innova Hycross Flex-Fuel Hybrid మోడల్‌ను రూ.19.99 లక్షల ప్రారంభ ధరతో లాంచ్‌ చేసింది.

ఈ మోడల్‌తో, Innova Hycrossలో గతంలో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్‌కు బదులుగా ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని రూ.19.99 లక్షల ప్రారంభ ధరను రూ.19.59 లక్షల GX పెట్రోల్ వేరియంట్‌తో నేరుగా పోల్చలేం. ఎందుకంటే ఇవి ఒకే రకమైన వేరియంట్లు కావు. అయినప్పటికీ, G Hybrid ఎంట్రీ వేరియంట్ ధర GX పెట్రోల్ మోడల్ కంటే రూ.40,000 ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి: 2026 Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్‌లో భారీ మార్పులు.. 12.3 అంగుళాల స్క్రీన్లు, కొత్త లుక్, హైబ్రిడ్ మోడల్‌

కార్ల మార్కెట్‌లో వృద్ధికి ఏం చేయాలి?

ప్యాసింజర్ కార్ల విభాగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని విస్తరించాలంటే కొన్ని కీలక మార్పులు అవసరమని రిపోర్ట్‌ను బట్టి అర్ధం చేసుకోవచ్చు. మొదటగా, సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ధర వ్యత్యాసం తగ్గాలి. రెండోది, ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉన్న E20కి మించి E85 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాల లభ్యత పెరగాలి.

ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చుల పరంగా కూడా స్పష్టమైన ప్రయోజనం ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడే వ్యక్తిగత కార్ల కొనుగోలుదారులతో పాటు ఫ్లీట్ ఆపరేటర్లు కూడా ఈ టెక్నాలజీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టాటా నెక్సాన్ EVకి పోటీగా వస్తున్న Hyundai Ioniq P EV.. లాంగ్‌ రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లు, లెవల్ 2 ADAS
సంక్రాంతి కానుకగా హ్యుందాయ్‌ కొత్త EV.. ₹9.79 లక్షల ధర, టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ!
Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
కారు ఏసీపై ఈ గుర్తులు గమనించారా? వాటి అర్థాలు తెలిస్తే చలికాలంలోనూ హ్యాపీ జర్నీ!
RC Smart Cards: మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఏపీ వాహనదారుల చేతిలోకి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RC కార్డులు!
ఆంధ్రప్రదేశ్‌ వెహికల్ ఓనర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RCలు వచ్చేస్తున్నాయోచ్‌!
Toyota Innova Hycross Faceliftలో ఏ వేరియంట్ కొనాలి? E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్‌, రూ.19.59 లక్షల నుంచి ధరలు
2026 Toyota Innova Hycrossలో 4 వేరియంట్లు.. ఏ వేరియంట్‌ కొంటే 'పైసా వసూల్‌'?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget