అన్వేషించండి

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి

Tata Nexon EMI Calculator: టాటా నెట్సన్ బేస్ మోడల్‌ను కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆన్-రోడ్ ధర, బ్యాంక్ లోన్, ఈఎమ్‌ఐ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా నెక్సాన్ రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
  • రూ.6.28 లక్షల లోన్‌కు నెలకు రూ.10,111 ఈఎంఐ పడుతుంది.
  • ఐదేళ్ల లోన్‌కు తక్కువ వడ్డీతో రూ.13,036 ఈఎంఐ చెల్లించాలి.
  • సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేటు, లోన్ వివరాలు తనిఖీ చేయాలి.

భారత్‌లో నమ్మదగిన బ్రాండ్లలో టాటా మోటార్స్ ఒకటి. టాటా మోటార్లు వెహికల్స్ అధిక సంఖ్యలో అమ్ముడవుతుంటాయి. ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా కార్లకు ఉన్న క్రేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.  ఇప్పుడు టాటా కార్లలో ఈవీలకు సైతం డిమాండ్ పెరుగుతోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సురక్షితమైన, బలమైన మరియు అనేక ఫీచర్లతో కూడిన కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు, టాటా నెట్సన్ పేరు అందరికంటే ముందే వస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారు తన సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో ఒకటిగా నిలిచింది. చాలా మంది ఈ కారు కొనాలన్నా, ధర విషయంలో తగ్గేవారు. కానీ ఒకేసారి పూర్తి క్యాష్ పేమెంట్ చేయకున్నా డౌన్ పేమెంట్ చెల్లించి తీసుకుని, ప్రతినెలా EMI చెల్లిస్తే సరిపోతుంది. 

మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో లేదా రాబోయే రోజుల్లో మీ మొదటి SUVగా టాటా నెక్సాన్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా.. మీరు మొదటగా రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేయడం ద్వారా ఈ SUVని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ తర్వాత మీరు బ్యాంక్ నుండి ఎంత లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి నెలా మీ జేబుపై ఎంత ఈఎమ్‌ఐ భారం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

బేస్ వేరియంట్ ధర

టాటా నెక్సాన్‌లో అత్యంత ప్రారంభ వేరియంట్ అంటే బేస్ వేరియంట్‌ను స్మార్ట్ పెట్రోల్ అని పిలుస్తారు. దీని ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్ మార్కెట్‌లో దాదాపు రూ. 7.39 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఆన్ రోడ్ ధర అయితే రూ.9,09,176 గా ఉంది. అయితే మీరు ఏదైనా వాహనాన్ని షోరూమ్ నుంచి కొనుగోలు చేసినప్పుడు దానికి RTO ఛార్జీలు, రోడ్ టాక్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇతర ప్రభుత్వ పన్నులు తోడవుతాయి.

ఈ అవసరమైన ఖర్చులన్నింటినీ జోడించిన తర్వాత, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.28 లక్షలు అలా ఉంటుంది. వేర్వేరు రాష్ట్రాలు, నగరాలను బట్టి స్థానిక పన్నులు, ఇన్సూరెన్స్ పాలసీల ఆధారంగా ఆన్-రోడ్ ధరలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. 

7 సంవత్సరాల EMI వివరాలు

కారు ఫైనాన్సింగ్, లెక్కల గురించి చూస్తే.. మీరు టాటా నెక్సాన్ బేస్ స్మార్ట్ పెట్రోల్ మోడల్ కోసం మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్-రోడ్ ధర రూ. 8.28 లక్షలలో రూ. 2 లక్షలు తీసేస్తే మీ మొత్తం లోన్ అమౌంట్ దాదాపు రూ. 6,28,000 అవుతుంది.

మీరు ఏదైనా జాతీయ లేదా ప్రైవేట్ బ్యాంక్ నుండి 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకి కార్ లోన్ తీసుకుంటే, మీ ప్రతి నెల ఈఎమ్‌ఐ దాదాపు రూ. 10,111 అవుతుంది. ఈ 7 సంవత్సరాలలో మీరు బ్యాంకుకు మొత్తంగా దాదాపు రూ. 2.21 లక్షల వడ్డీని చెల్లిస్తారు.

5 సంవత్సరాల EMI లెక్కలు

చాలా మంది కారు కొనుగోలుదారులు 7 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకోవడానికి బదులుగా 5 ఏళ్ల కాలాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడతారు, తద్వారా కారు త్వరగా లోన్ ఫ్రీ అవుతుంది. వడ్డీ కూడా తక్కువగా చెల్లించవచ్చు. మీరు అదే 9 శాతం వడ్డీ రేటు, రూ. 6.28 లక్షల లోన్ అమౌంట్‌పై 5 సంవత్సరాల లోన్ వ్యవధిని ఎంచుకుంటే, మీ నెలవారీ ఈఎమ్‌ఐ పెరిగి దాదాపు రూ. 13,036 అవుతుంది.

అయితే 5 సంవత్సరాల కాలానికి తీసుకుంటే మీకు లభించే ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే, మీరు బ్యాంకుకు చాలా తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్లకుగానీ మీ మొత్తం వడ్డీ దాదాపు రూ. 1.54 లక్షలు అవుతుంది. 

మీరు ఈ డౌన్ పేమెంట్ ప్లాన్‌పై టాటా నెక్సాన్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే, ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. ముందుగా, మీ ఆర్థిక స్థితికి తగినట్లుగా లోన్ (Loan Term) వ్యవధిని ఎంచుకోండి. తద్వారా నెలవారీ ఈఎమ్‌ఐ బడ్జెట్ మీ రెగ్యూలర్ అవసరాలపై ప్రభావం చూపదు. మీ వడ్డీ రేటు, లోన్ అప్రూవల్ పూర్తిగా మీ సిబిల్ (CIBIL) స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, బ్యాంకులు మీకు 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకే కార్ లోన్ ఆఫర్ చేస్తాయి. దీనివల్ల మీ నెలవారీ EMI ఇంకా తగ్గుతుంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు వేర్వేరు బ్యాంకుల లోన్ స్కీమ్‌లు, ప్రాసెసింగ్ ఫీజులను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. 

Frequently Asked Questions

టాటా నెక్సాన్ బేస్ వేరియంట్‌ను డౌన్ పేమెంట్‌తో ఎలా కొనుగోలు చేయవచ్చు?

మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించవచ్చు.

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత 7 సంవత్సరాలకు EMI ఎంత ఉంటుంది?

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత, రూ. 6.28 లక్షల లోన్‌కు 9% వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకు నెలవారీ EMI సుమారు రూ. 10,111 అవుతుంది. మొత్తం వడ్డీ రూ. 2.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

టాటా నెక్సాన్ బేస్ వేరియంట్‌కు 5 సంవత్సరాల లోన్ వ్యవధికి EMI ఎంత?

5 సంవత్సరాల లోన్ వ్యవధిని ఎంచుకుంటే, రూ. 6.28 లక్షల లోన్‌కు 9% వడ్డీ రేటుతో నెలవారీ EMI సుమారు రూ. 13,036 అవుతుంది. ఈ కాలానికి మొత్తం వడ్డీ దాదాపు రూ. 1.54 లక్షలు.

కార్ లోన్‌కు వడ్డీ రేటు మరియు ఆమోదం దేనిపై ఆధారపడి ఉంటుంది?

కార్ లోన్‌కు వడ్డీ రేటు మరియు ఆమోదం మీ సిబిల్ స్కోర్‌పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటు లభించే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు
Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు
Tata Aerisలో 5 వేరియంట్లు.. ఏ వేరియంట్‌లో స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి, ఏది కొనాలి?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget