అన్వేషించండి

ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్

Tata EV Discount: టాటా మోటార్స్ ఆగస్టు నెలలో పంచ్ EVపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. కొన్ని వేరియంట్లపై కస్టమర్లకు గరిష్టంగా రూ. 1.45 లక్షల వరకు లబ్ధి చేకూరవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆగస్టు నెలలో Tata Punch EVపై రూ.1.45 లక్షల డిస్కౌంట్ ప్రకటించారు.
  • ఈ తగ్గింపు వివిధ వేరియంట్లు, డీలర్‌షిప్‌లను బట్టి మారుతుంది.
  • Punch EV 468 కి.మీ రేంజ్, అధునాతన ఫీచర్లు, భద్రతను కలిగి.

మీరు అద్భుతమైన ఫీచర్లు, లాంగ్ డ్రైవింగ్ రేంజ్, స్ట్రాంగ్ సేఫ్టీ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా.. అయితే అందుకు Tata Punch EV సరిగ్గా సరిపోతుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ప్రత్యేకత ఏంటంటే, ఆగస్టు 2026లో టాటా మోటార్స్ ఈ కారుపై రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ తర్వాత టాటా Punch EV ధర భారీగా దిగొస్తుంది. ఈ తగ్గింపు పరిమిత కాలానికి వర్తిస్తుందని.. వేర్వేరు వేరియంట్లు, డీలర్‌షిప్‌లను బట్టి ధర మారవచ్చు.

టాటా మోటార్స్ ఆగస్టు నెల విక్రయాల కోసం Tata Punch EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ప్రకారం, కొన్ని వేరియంట్లపై కస్టమర్లకు మొత్తం రూ. 1.45 లక్షల వరకు లబ్ధి చేకూరవచ్చు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, ఇతర డీలర్-లెవెల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఇందులో అత్యధిక ప్రయోజనం లాంగ్ రేంజ్ (LR) వేరియంట్‌పై లభిస్తోంది. అయితే ఇతర వేరియంట్‌లపై డిస్కౌంట్ కాస్త తక్కువగా ఉండవచ్చు.

టాటా మోటార్స్ ఎందుకు డిస్కౌంట్ ఇస్తోంది?

కంపెనీ కొన్ని పాత స్టాక్, ఎంపిక చేసిన వేరియంట్లను త్వరగా విక్రయించాలని చూస్తోంది. దాంతో కస్టమర్లకు భారీ ఆదా పొందే అవకాశం కల్పించింది. ఎవరైనా కస్టమర్ చాలా కాలంగా Punch EV కొనుగోలు చేయాలని ఎదురుచూస్తుంటే, ఇది వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుంది.

రూ. 1.45 లక్షల వరకు ఉన్న ఈ డిస్కౌంట్ కస్టమర్లు అందరికీ ఒకేలా లభించదు. ఆఫర్ అనేది సిటీ, డీలర్‌షిప్, వేరియంట్, తయారీ సంవత్సరం, ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను బట్టి మారవచ్చు. కొన్నిసార్లు కస్టమర్ తన పాత కారును ఎక్స్ఛేంజ్ చేసినప్పుడు లేదా స్క్రాపేజ్ పాలసీ బెనిఫిట్ పొందినప్పుడు మాత్రమే కొన్ని ఆఫర్లు లభిస్తాయి. కొనుగోలు చేయడానికి ముందు మీకు సమీపంలోని టాటా షోరూమ్ నుంచి పూర్తి సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి.

Also Read: మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!

ఎలక్ట్రిక్ కారు రేంజ్ ఎంత?

Tata Punch EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 30kWh, 40kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. చిన్న బ్యాటరీ ప్యాక్ కూడా రోజువారీ వినియోగానికి తగ్గ రేంజ్‌ను అందిస్తుంది. 

Punch EV ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా బ్యాటరీని తక్కువ సమయంలోనే ఛార్జింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. దీనివల్ల లాంగ్ రేంజ్ ప్రయాణాల సమయంలో ఛార్జింగ్ కోసం ఎక్కువ సేపు వెయిటింగ్ అవసరం ఉండదు. 

Punch EVలో అనేక ఆధునిక ఫీచర్లు ఇచ్చారు. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, అనేక కనెక్టెడ్ ఫీచర్లు లభిస్తాయి. ఇది కాకుండా దీని డిజైన్ కూడా ICE మోడల్‌తో పోలిస్తే మరింత ప్రీమియం, మోడ్రన్ అనిపిస్తుంది.

Also Read: కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే

సేఫ్టీ రేటింగ్..

సేఫ్టీ విషయంలో కూడా Tata Punch EV బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రిక్ SUV భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అనేక ఇతర అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు. 

మీరు ఈ ఆఫర్ పొందాలనుకుంటే, ఎక్కువ ఆలస్యం చేయకుండా మీకు దగ్గర్లోని షోరూమ్ వెళ్లి వివరాలు, స్టాక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని కొనేయండి.  దీనితో పాటు, బుకింగ్ చేసుకునే ముందు డీలర్ నుంచి మీకు వర్తించే మొత్తం బెనిఫిట్స్ గురించి క్లారిటీ తీసుకోవాలి. దాంతో మీకు లభించే ఆఫర్లపై ఎలాంటి డౌట్స్ ఉండవు. 

Frequently Asked Questions

టాటా పంచ్ EVపై ప్రస్తుతం ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?

టాటా పంచ్ EVపై ఆగస్టు 2026లో రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. ఇది పరిమిత కాల ఆఫర్.

ఈ డిస్కౌంట్ ఆఫర్ అందరికీ ఒకేలా వర్తిస్తుందా?

లేదు, ఈ డిస్కౌంట్ సిటీ, డీలర్‌షిప్, వేరియంట్, తయారీ సంవత్సరం, స్టాక్‌ను బట్టి మారుతుంది. కొన్ని ఆఫర్‌లు పాత కారు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్‌పై ఆధారపడి ఉంటాయి.

టాటా పంచ్ EV యొక్క బ్యాటరీ రేంజ్ ఎంత?

టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో (30kWh, 40kWh) వస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ (40kWh) ఒకసారి ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

టాటా పంచ్ EV సేఫ్టీ రేటింగ్ ఎంత?

టాటా పంచ్ EV భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget