అన్వేషించండి

కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే

టాటా మోటార్స్ ఈ నెలలో Curvv EV నుంచి Nexon EV వరకు చాలా మోడళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tata EV Offers August 2026: కొత్త ఎలక్ట్రిక్‌ కారు (EV) కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. ఈ నెలలో (ఆగస్టు 2026) టాటా EV కొనేవాళ్ల కోసం భారీ బెనిఫిట్లు ప్రకటించింది. నగదు తగ్గింపు, ఎక్స్‌చేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రోత్సాహకం & లాయల్టీ బెనిఫిట్ల రూపంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా కర్వ్‌ EV కొంటే అత్యధిక ప్రయోజనం
ఈసారి అత్యధిక బెనిఫిట్ Tata Curvv EVపై లభిస్తోంది. ముఖ్యంగా పాత Non-X వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఇందులో రూ.3 లక్షల నగదు తగ్గింపు రూపంలో & రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ రూపంలో ఉన్నాయి. Tata Curvv EV Creative వేరియంట్‌పై రూ.2.50 లక్షల నగదు తగ్గింపు లభిస్తుంది. రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్‌తో కలిపి ఈ మోడల్‌పై మొత్తం రూ.2.85 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.

Curvv EV X సిరీస్‌ను కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేక బెనిఫిట్లు ఉన్నాయి. ఎక్స్‌చేంజ్‌పై రూ.30 వేల బోనస్ లేదా స్క్రాపేజ్‌పై రూ.35 వేల వరకు ఇన్సెంటివ్‌ లభిస్తుంది. ఇప్పటికే టాటా ICE లేదా EV వాహనం ఉండి, కొత్త Curvv EV X సిరీస్‌కు మారే వారికి రూ.30 వేల లాయల్టీ బెనిఫిట్ కూడా అందుతుంది. మొత్తం కలిపి రూ.65 వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!

హారియర్‌ EV
Harrier EV కొనాలనుకున్నా కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. Adventure, Fearless+ & Empowered వేరియంట్లపై రూ.50 వేల ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.75 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ పొందవచ్చు. ఇప్పటికే టాటా ICE వాహనం ఉన్నవాళ్లు కొత్త EVకు మారితే రూ.50 వేల లాయల్టీ బెనిఫిట్ పొందవచ్చు. ఇప్పటికే టాటా EV వాడుతున్నవాళ్లు కొత్త Harrier EVకి మారితే రూ.1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్ అందుతుంది.

ఫ్రీడమ్‌ ఆఫర్‌
అంతేకాదు, ఈ నెల 'Freedom Offer'ను కూడా టాటా అందిస్తోంది. Adventure వేరియంట్‌పై మరో రూ.75 వేల తగ్గింపు దొరుకుతుంది. Fearless+ & Empowered వేరియంట్లపై అదనంగా రూ.1 లక్ష బెనిఫిట్‌ ఉంటుంది. దీంతో Adventure వేరియంట్‌పై మొత్తం రూ.2.50 లక్షలు & మిగిలిన రెండు వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్లు పొందే అవకాశం ఉంది.

పంచ్‌ EV
Punch EVపై కూడా మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఎంపిక చేసిన Medium Range, Long Range & Smart వేరియంట్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. Medium Range వేరియంట్‌పై రూ.90 వేల నగదు తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ కలిపి మొత్తం రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం వస్తుంది. Long Range వేరియంట్‌పై రూ.1.10 లక్షల నగదు తగ్గింపుతో మొత్తం రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. Smart వేరియంట్‌పై రూ.60 వేల నగదు తగ్గింపుతో మొత్తం రూ.95 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి

టియాగో EV
Tiago EVకి కూడా రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్ ఉంది, అయితే ఇది పాత LR XT వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో రూ.70 వేల నగదు తగ్గింపు, రూ.50 వేల ఫ్రీడమ్‌ ఆఫర్‌ & ఎక్స్‌చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ కలిసి ఉన్నాయి. ఎంపిక చేసిన MR & LR వేరియంట్లపై కూడా రూ.65 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

నెక్సాన్‌ EV
ఈ నెలలో అత్యల్ప బెనిఫిట్ Nexon EVపై ఉంది. ఈ ఎలక్ట్రిక్‌ కారు కొంటే గరిష్టంగా రూ.45 వేల వరకు మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.10 వేల క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.25 వేల ఎక్స్‌చేంజ్ బోనస్ లేదా రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

టిగోర్‌ EV &సియెర్రా EV
Tata Tigor EV & Sierra EVపై ఈ ఆగస్టులో ప్రత్యేక ఆఫర్లు లేవు. 

కొత్త Tata EV కొనాలని ఆలోచిస్తున్నవాళ్లకు Curvv EV & Harrier EVపై లభిస్తున్న భారీ బెనిఫిట్లు మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ ఆఫర్లు మోడల్ & వేరియంట్‌ను బట్టి మారతాయి, ఈ నెలాఖరు వరకే, అంటే 31 ఆగస్టు 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. నగరాన్ని బట్టి & డీలర్ వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, కారు కొనే ముందు మీ ప్రాంతంలోని అధికారిక డీలర్‌ను సంప్రదించి తాజా ఆఫర్లు & స్టాక్ వివరాలను తెలుసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget