అన్వేషించండి

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!

కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరు సంవత్సరాల లోపు వయస్సున్న BS6 కార్లకు PUCC గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పెంచాలని ప్రతిపాదించింది.

PUCC validity for BS6 cars: దేశంలోని లక్షలాది కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ప్రైవేట్ కార్లకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన PUCC (Pollution Under Control Certificate) గడువును పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏడాది పాటు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఈ ధ్రువీకరణను ఇకపై మూడేళ్ల వరకు చెల్లుబాటు అయ్యేలా మార్చాలని ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.

సమయం & ఖర్చు రెండూ ఆదా
ఈ ప్రతిపాదన ప్రకారం, ఆరు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న BS6 ప్రైవేట్ కార్లకు PUCC ఒకసారి తీసుకుంటే మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. దీంతో, ప్రతి ఏడాది కాలుష్య పరీక్ష చేయించుకునే అవసరం ఉండదు. ఇది కార్ల యజమానులకు సమయం & ఖర్చు రెండింటినీ ఆదా చేసే నిర్ణయంగా భావిస్తున్నారు.

ఆరు సంవత్సరాలు దాటితే...
అయితే, ఈ సడలింపు అన్ని వాహనాలకు వర్తించదు. ఆరు సంవత్సరాలు దాటిన - 10 సంవత్సరాల లోపు ఉన్న BS6 కార్లకు ప్రస్తుతం ఉన్నట్లుగానే ప్రతి ఏడాది PUCCను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అలాగే, 10 సంవత్సరాలకు పైబడిన BS6 కార్లకు ప్రతి ఆరు నెలలకోసారి కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి. అంటే వాహనం వయస్సును బట్టి నిబంధనలు అమల్లో ఉంటాయి.

ఇది కూడా చదవండి: EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?

BS4 & అంతకంటే పాత మోడల్ కార్ల యజమానులకు మాత్రం ఎలాంటి ఊరట లేదు. ముసాయిదా ప్రకారం BS4 కార్లకు ఇప్పటిలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి PUCCను పునరుద్ధరించాలి. BS1, BS2 & BS3 ప్రమాణాలకు చెందిన అన్ని వాహనాలు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త ధ్రువీకరణ తీసుకోవాల్సిందే.

PUCC అంటే...
PUCC అంటే "పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌". జనం వాడుక భాషలో చెప్పాలంటే.. "పొల్యూషన్‌ సర్టిఫికెట్‌". వాహనం నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించే అధికారిక ధ్రువీకరణ ఇది. ఈ ధ్రువీకరణ లేకుండా వాహనం నడిపితే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వాహన యజమాని గడువు ముగిసేలోపు కొత్త ధ్రువీకరణ పొందడం తప్పనిసరి.

భారత్ స్టేజ్ ‍‌(BS) ఉద్గార ప్రమాణాలు అంటే, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు. దేశంలో 2020 ఏప్రిల్ నుంచి BS6 తొలి దశ అమల్లోకి వచ్చింది. అనంతరం 2023 ఏప్రిల్ నుంచి రెండో దశ అమలవుతోంది. ఈ ప్రమాణాల వల్ల వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది.

ఇది కూడా చదవండి: వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!

భారత్ స్టేజ్ ప్రమాణాల చరిత్రను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా BS1 అమల్లోకి వచ్చింది. అదే సమయంలో ప్రధాన నగరాల్లో దశలవారీగా BS2ను ప్రవేశపెట్టారు. అనంతరం BS3 & BS4 ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి BS5కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తక్కువ సల్ఫర్ ఇంధనం సరఫరాలో ఉన్న సవాళ్ల కారణంగా భారత్ నేరుగా BS4 నుంచి BS6కు మారింది. దీంతో కాలుష్య నియంత్రణలో దేశం ఒకేసారి పెద్ద ముందడుగు వేసింది.

కేంద్రం తాజాగా ప్రతిపాదించిన ఈ మార్పులు అమల్లోకి వస్తే కొత్త BS6 కార్ల యజమానులకు గణనీయమైన ఊరట లభించనుంది. తరచూ కాలుష్య పరీక్షల కోసం వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే ఇది ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదన మాత్రమే. ప్రజల అభిప్రాయాలు పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్ జారీ అయినప్పుడే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget