కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నల్లబెల్లి మండలానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
KCR Consoles Peddi Sudarshan Reddys Family | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు హాజరైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- మాజీ సీఎం కేసీఆర్ సుదర్శన్ రెడ్డి దశదినకర్మకు నల్లబెల్లిలో హాజరయ్యారు.
- బీఆర్ఎస్ పార్టీ రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం కుటుంబానికి ప్రకటించింది.
- పిల్లలకు కోటి, తల్లికి పాతిక లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
KCR Warangal Tour | నల్లబెల్లి: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని నల్లబెల్లి మండలానికి వెళ్లిన కేసీఆర్ ఇటీవల అనారోగ్య కారణాలతో హఠాత్తుగా కన్నుమూసిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసానిచ్చారు.

మాజీ సీఎం కేసీఆర్ రాక గురించి తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నల్లబెల్లికి తరలివచ్చారు. దాంతో సుదర్శన్‌రెడ్డి నివాసం వద్ద కార్యకర్తల రద్దీ పెరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆఆర్ అభిమానుల సందడితో ఒకానొక సమయంలో అక్క స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితులను అదుపు చేస్తూ కేసీఆర్ కాన్వాయ్‌ను పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసంలోకి పంపించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారీ సాయం
మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భవిష్యత్తును అందించాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానం ముందే నిర్ణయించింది. పార్టీ తరఫున ఇప్పటికే రూ.2.25 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని బీఆర్‌ఎస్ ప్రకటించింది. ఇందులో భాగంగా సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి చెరో 1 .కోటి చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం చెక్ అందజేశారు. అంతేకాకుండా, వయోవృద్ధురాలైన పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ సంక్షేమం, వైద్య ఖర్చుల కోసం మరో రూ.25 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి చెక్ అందించారు. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు ప్రణాళికలు, ఇతర కుటుంబ సంక్షేమ బాధ్యతలను బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించారు. 8 సార్లు సీపీఆర్ చేసినా ప్రయోజనం కనిపించలేదు. అయినా డాక్టర్ మరోసారి సీపీఆర్ చేయడంతో పెద్ది సుదర్శన్‌రెడ్డిలో కదలిక రావడం తెలిసిందే. అయితే బ్రెయిన్ కు ఎక్కువ సమయం ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు.
Frequently Asked Questions
కేసీఆర్ వరంగల్ జిల్లాలో ఎందుకు పర్యటించారు?
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆర్థిక సహాయం ప్రకటించింది?
బీఆర్ఎస్ పార్టీ రూ.2.25 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పిల్లల భవిష్యత్తు కోసం రూ.2 కోట్లు, తల్లి వైద్య ఖర్చులకు రూ.25 లక్షలు డిపాజిట్ చేస్తారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఎలా మరణించారు?
ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో తొలుత స్థానికంగా చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేక కన్నుమూశారు.
ట్రెండింగ్ వార్తలు























