అన్వేషించండి

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?

కియా కార్లపై ఆగస్టు 2026లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Carens Clavisపై రూ.1.2 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర మోడళ్లపైనా డిస్కౌంట్లు లభిస్తాయి.

Kia car discount offers August 2026: కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ నెల (ఆగస్టు 2026)లో కారు కొనుగోలు చేసేవారికి కియా ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ఆఫర్లు అందిస్తోంది. కొన్ని కార్లపై ఉచితంగా అదనపు వారంటీ కూడా లభిస్తోంది.

కియా ఇండియా, ప్రస్తుతం తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. కొత్త సైరోస్ EVతో పాటు ఫ్లాగ్‌షిప్ సోరెంటో SUVని కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ప్రస్తుత మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. కియా EV6 & EV9 మినహా మిగతా మోడళ్లపై ఏదో ఒక రూపంలో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. 

Kia Carens Clavis
కియా కారెన్స్ క్లావిస్‌పై అత్యధికంగా రూ.1.20 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. 2026 మోడల్‌పై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.20,000 లాయల్టీ ప్రయోజనం, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.

2025 మోడల్ కారెన్స్ క్లావిస్‌పై రూ.75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. దీనికి అదనంగా లాయల్టీ, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి; కార్పొరేట్ ఆఫర్ మాత్రం ఉండదు. 2025 మోడల్ టర్బో పెట్రోల్ వేరియంట్లకు ఉచిత అదనపు వారంటీ కూడా అందిస్తున్నారు. ఈ కారు ధర రూ.11.27 లక్షల నుంచి రూ.21.67 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!

Kia Carnival
కియా కార్లలో అత్యధిక ప్రయోజనాలు కార్నివాల్‌పై ఉన్నాయి. ఈ ప్రీమియం ఎంపీవీపై రూ.1.50 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. 2026 మోడళ్లపై రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్ & రూ.50,000 వరకు కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. 2025 మోడల్‌పై రూ.20,000 స్క్రాపేజ్ ఆఫర్ ఉంది. కార్నివాల్ ధర రూ.59.65 లక్షలు.

Kia Carens Clavis EV
కారెన్స్ క్లావిస్ ఈవీపై రూ.55,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. 2026 మోడల్‌ కొంటే రూ.20,000 లాయల్టీ ప్రయోజనం, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనం అందుతాయి. ఈ కారు ధర రూ.18.04 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంది.

Kia Syros
కియా సైరోస్‌ రూ.50,000 వరకు బెనిఫిట్స్‌ అందిస్తుంది. 2026 మోడల్‌పై రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్ ఉంది. 2025 మోడల్‌పై రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తుంది. సైరోస్‌ కొనేవాళ్లకు ఉచిత అదనపు వారంటీ కూడా ఆఫర్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

Kia Sonet 
కియా సోనెట్‌పై రూ.45,000 వరకు ప్రయోజనాలు అందుతాయి. 2026 మోడల్‌పై రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. సోనెట్ ధర రూ.7.41 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది.

Kia Seltos
ఈ నెలలో, కొత్త తరం కియా సెల్టోస్‌ రూ.40,000 వరకు మిగిలిస్తుంది. ఇందులో రూ.20,000 లాయల్టీ ప్రయోజనం & రూ.20,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఈ కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.21.82 లక్షల వరకు ఉంది.

Kia Carens
కియా కారెన్స్‌పై రూ.35,000 వరకు బెనిఫిట్స్‌ ఆఫర్‌ ఉంది. 2026 మోడల్‌పై రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉంది. 2025 మోడల్‌పై స్క్రాపేజ్ ఆఫర్ మాత్రమే ఉంది. కియా కారెన్స్‌ ధర రూ.11.02 లక్షల నుంచి రూ.12.88 లక్షల వరకు ఉంది.

పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆఫర్లు.. నగరం, డీలర్‌షిప్‌, స్టాక్‌ ఆధారంగా మారవచ్చు, కొనే ముందు స్థానిక డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget