అన్వేషించండి

BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!

BMW F 450 GS పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌లో 0-100 కి.మీ. వేగాన్ని కేవలం 5.72 సెకన్లలో అందుకుంది. ధర, వేగం, బ్రేకింగ్, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.

BMW F 450 GS Price And Specifications Telugu: బీఎండబ్ల్యూ కార్లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే బ్రాండ్‌కు చెందిన బైక్‌లు కూడా మామూలుగా ఉండవు. తాజాగా.. BMW F 450 GS పెర్ఫార్మెన్స్‌ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. వేగం, బ్రేకింగ్, సౌకర్యం విషయంలో ఈ బైక్‌ మంచి సామర్థ్యాన్ని చూపించింది. రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో, రోడ్డు తడిగా ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించింది.

BMW F 450 GS మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - బేస్, ఎక్స్‌క్లూజివ్ & GS ట్రోఫీ. ఈ మూడు వేరియంట్లలోనూ ఒకే ఇంజిన్ ఉంటుంది, ఫీచర్లు & పరికరాల్లో మాత్రం తేడాలు ఉంటాయి.

ఇంజిన్‌ కెపాసిటీ
ఈ బైక్‌లో 420cc ప్యార్లల్‌ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,750 ఆర్‌పీఎమ్ వద్ద 48 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6,750 ఆర్‌పీఎమ్ వద్ద 43 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది.

ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ నుంచి BMW షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా క్లచ్ ఉపయోగించకుండానే గేర్‌లను పైకి & కిందికి మార్చుకోవచ్చు. టాప్ వేరియంట్‌లో ఈజీ రైడ్ క్లచ్ కూడా ఉంటుంది.

వేగం విషయంలో BMW F 450 GS బాగా ఆకట్టుకుంది. ఈ బండిని పరీక్షించే సమయంలో రహదారి తడిగా ఉంది. రైడర్ రోడ్ మోడ్‌లో బైక్‌ను నడిపారు. ట్రాక్షన్ కంట్రోల్‌ను ఆఫ్ చేశారు. వేగంగా స్టార్ట్ చేయడానికి ఈజీ రైడ్ క్లచ్‌ను ఉపయోగించకుండా మాన్యువల్‌గా బైక్‌ను ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు

పరీక్ష ఫలితాలు
ఈ పరీక్షలో... BMW F 450 GS 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని 1.55 సెకన్లలో అందుకుంది. 60 కి.మీ. వేగాన్ని 2.57 సెకన్లలో చేరుకుంది. 80 కి.మీ. వేగానికి 3.88 సెకన్లు పట్టింది. ఇక 100 కి.మీ. వేగాన్ని కేవలం 5.72 సెకన్లలో అందుకుంది. మధ్యస్థాయి వేగాల్లో బైక్‌ పనితీరు చాలా బాగుంది. అయితే ఆర్‌పీఎమ్ రెడ్‌లైన్‌కు చేరువయ్యే కొద్దీ వేగం పెరుగుదల కొంత తగ్గింది.

గేర్ మార్పుల మధ్య వేగాన్ని పెంచే పరీక్షలోనూ బైక్‌ మంచి ఫలితాలు ఇచ్చింది. రెండో గేర్‌లో 20 నుంచి 50 కి.మీ. వేగాన్ని 1.81 సెకన్లలో అందుకుంది. మూడో గేర్‌లో 30 నుంచి 70 కి.మీ. వేగానికి 3.04 సెకన్లు పట్టింది. నాలుగో గేర్‌లో 50 నుంచి 80 కి.మీ. వేగాన్ని 2.95 సెకన్లలో చేరుకుంది.

సిటీ రోడ్లపైనా ఈ బైక్‌ను సులభంగా నడపవచ్చు. ఓవర్‌టేక్ చేయాల్సిన సమయంలో తక్షణమే వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీ రైడ్ క్లచ్ మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

బ్రేకింగ్ విషయంలోనూ BMW F 450 GS పెర్ఫార్మెన్స్‌ బాగుంది. ముందు & వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంటుంది. 60 కి.మీ. వేగం నుంచి పూర్తిగా ఆగేందుకు కేవలం 16.52 మీటర్ల దూరం పట్టింది. బ్రేక్ లివర్ నుంచి వచ్చే స్పందన కూడా స్పష్టంగా ఉంది. తడి రహదారిపై కూడా టైర్లు మంచి పట్టును అందించాయి.

ఇది కూడా చదవండి: 5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?

ధర
BMW F 450 GS బేస్ వేరియంట్ ధర రూ.4.70 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.4.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్). టాప్ GS ట్రోఫీ ధర రూ.5.30 లక్షలు (ఎక్స్‌షోరూమ్). 

ఈ బైక్‌లో 14 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. బరువు 178 కిలోలు. సీటు ఎత్తు 845 మిల్లీమీటర్లు. ముందు 310 మిల్లీమీటర్ల డిస్క్ & వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ముందు 100/90-R19, వెనుక 130/80-R17 టైర్లు ఉంటాయి.

మొత్తంగా చూస్తే BMW F 450 GS కేవలం ఆకర్షణీయమైన బైక్‌ మాత్రమే కాదు. వేగం, బ్రేకింగ్, నగర ప్రయాణం & రోజువారీ వినియోగం విషయంలోనూ మంచి బ్యాలెన్స్‌ చూపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget