అన్వేషించండి

Certificate of Deposit: పాత కారు ఇచ్చి కొత్త కారు కొంటున్నారా? ఈ ఒక్క సర్టిఫికెట్‌తో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోవచ్చు!

Car Scrappage Benefits: పాత కారును స్క్రాప్ చేసి Certificate of Deposit పొందితే కొత్త కారుపై రోడ్ ట్యాక్స్ రాయితీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, కంపెనీల డిస్కౌంట్లు పొందవచ్చు.

Scrappage benefits on a new car: రోడ్డుపై నడపడానికి వీల్లేనంతగా మీ కారు పాతబడితే, దానిని వదిలించుకోవడం వల్ల మీకు కొంత ఆర్థిక ప్రయోజనం కలగవచ్చు. ఆ కారును గుర్తింపు పొందిన వాహన స్క్రాపింగ్ కేంద్రానికి అప్పగిస్తే, దాని స్క్రాప్ విలువతో పాటు Certificate of Deposit (COD) లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు రోడ్ ట్యాక్స్‌పై రాయితీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు పొందవచ్చు. దీనికి అదనంగా, కొన్ని కార్ల కంపెనీలు రూ.20.000 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి. ఇవన్నీ కలిపితే, ఈ బెనిఫిట్స్‌ దాదాపు రూ.30,000 వరకు ఉంటాయి. ఈ ప్రయోజనాలు ప్రైవేట్ కార్లతో పాటు టాక్సీలు, ఫ్లీట్ కార్ల వంటి రవాణా వాహనాలకు కూడా వర్తిస్తాయి.

Certificate of Deposit అంటే ఏమిటి?

పాత కారును రిజిస్టర్డ్‌ వాహన స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF)కి అప్పగించినప్పుడు, ఆ కేంద్రం ఇచ్చే పత్రాన్నే సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ (Certificate of Deposit - COD) అంటారు. ఈ సర్టిఫికెట్ ద్వారా, మీ వాహన యాజమాన్యం మీ నుంచి గుర్తింపు పొందిన స్క్రాపింగ్ కేంద్రానికి బదిలీ అయినట్లు రుజువవుతుంది. మోటారు వాహన నిబంధనల ప్రకారం, కొత్త వాహనం కొనుగోలు సమయంలో స్క్రాపింగ్ ప్రయోజనాలు పొందడానికి COD కీలకమైన పత్రం.

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. CODని సర్టిఫికెట్‌ ఆఫ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ (Certificate of Vehicle Scrapping - CVS)తో కలిపి చూడకూడదు. కారు పూర్తిగా విడదీసి స్క్రాప్ చేసిన తర్వాత CVS జారీ అవుతుంది. వాహన వివరాలను VAHAN, రాష్ట్ర రవాణా రికార్డుల్లో అప్‌డేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త కారు కొనుగోలుపై ప్రయోజనాలు పొందడానికి అవసరమయ్యేది COD.

ఇది కూడా చదవండి: కొత్త కారు కొనేవాళ్లకు షాక్.. నాలుగోసారి రేట్లు పెంచిన మారుతి సుజుకి

కొత్త కారుపై ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

1. రోడ్ ట్యాక్స్‌పై రాయితీ

కేంద్ర మోటారు వాహనాల నిబంధన ప్రకారం, పాత కారును స్క్రాప్ చేసినవారికి ఆయా రాష్ట్రాలు రోడ్ ట్యాక్స్‌లో రాయితీ కల్పించవచ్చు. ప్రైవేట్ కార్లకు గరిష్ఠంగా 25 శాతం వరకు, టాక్సీలు, ఫ్లీట్ కార్లకు 15 శాతం వరకు రాయితీ ఇవ్వవచ్చు. ఈ నిబంధన 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు, టాక్సీలు, ఫ్లీట్ కార్లకు 8 సంవత్సరాల వరకు ఈ రాయితీ వర్తించే అవకాశం ఉంది. ఎంత శాతం రాయితీ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

2025లో చేసిన సవరణ ప్రకారం BS-I లేదా అంతకంటే పాత ప్రమాణాలున్న కార్లను స్క్రాప్ చేసిన వారికి రోడ్ ట్యాక్స్‌లో 50 శాతం వరకు రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. రోడ్ ట్యాక్స్ రాయితీలు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. కాబట్టి తాజా నిబంధనల కోసం మీ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో వివరాలు తెలుసుకోవాలి.

2. రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు

COD ఆధారంగా కొత్త కారు కొనుగోలు చేస్తే, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) జారీ చేసే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 2021 అక్టోబర్‌లో కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు చేసిన సవరణ ద్వారా ఈ వెసులుబాటు కల్పించారు.

ఇది కూడా చదవండి: కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్

3. కార్ల కంపెనీల నుంచి డిస్కౌంట్

COD ఆధారంగా కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఎక్స్-షోరూమ్ ధరపై 1.5 శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి మన దేశంలోని 11 కార్ల కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఈ తగ్గింపు గరిష్ఠంగా రూ.20,000కు పరిమితం. ఈ కంపెనీల జాబితాలో Maruti Suzuki, Tata Motors, Mahindra, Hyundai, Kia, Toyota, Honda, JSW MG Motor, Renault, Nissan, Skoda Volkswagen ఉన్నాయి. Mercedes-Benz India మాత్రం ఇప్పటికే ఉన్న ఆఫర్లకు అదనంగా ఫ్లాట్‌గా రూ.25,000 డిస్కౌంట్ ఇస్తోంది.

అయితే ఈ డిస్కౌంట్లకు కొన్ని షరతులు ఉన్నాయి. మీరు మీ సొంత కారును గత ఆరు నెలల్లోనే స్క్రాప్ చేసి ఉండాలి. ఆ వివరాలు VAHAN పోర్టల్‌లో నమోదై ఉండాలి. అంటే ముందుగా పాత కారును స్క్రాప్ చేసిన తర్వాతే కొత్త కారు కొనాలి.

మరో వ్యక్తి నుంచి COD కొనుగోలు చేసి ఈ డిస్కౌంట్ పొందే అవకాశం సాధారణంగా ప్రైవేట్ కార్లకు వర్తించదు. వాణిజ్య వాహనాల విషయంలో మాత్రం ఇతరుల నుంచి కొనుగోలు చేసిన COD ఆధారంగా డిస్కౌంట్ ప్రకటించారు.

కారు కంపెనీలు COD ప్రయోజనాన్ని కొన్ని మోడళ్లకు మాత్రమే పరిమితం చేయవచ్చు. మీరు ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి ఈ డిస్కౌంట్‌ను పొందలేరు. ఈ ఆఫర్‌ను పరిమిత కాలానికి మాత్రమే ప్రకటించినందున, కొనుగోలు చేసే ముందు డీలర్‌ను సంప్రదించి ప్రస్తుతం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Cars Price Hike: కొత్త కారు కొనేవాళ్లకు షాక్.. నాలుగోసారి రేట్లు పెంచిన మారుతి సుజుకి
మారుతి సుజుకి కార్ల ధరలు పెంపు.. ఆల్రెడీ అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
Hero Splendor Plus Price Hike: కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!
అతి పెద్ద విమానాన్ని లాక్కెళ్లిన BYD కారు.. అది కూడా కేవలం టైర్ల మీద!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS NZ 1st Test Result: తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం
తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం, డ్రాగా ముగిసిన మ్యాచ్
Hyderabad Terror Attack: హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
AP Panchayat Elections Phase 1: ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
Who is Kota Rukmini: జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
YSRCP Organizational Revamp: డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
Embed widget