Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
మనం ఎంతో నమ్మకంతో కొనుక్కుని తాగే బాటిల్ వాటర్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీ సురక్షితం కాదని ఫుడ్ సేఫ్టీ అథారిటీ FSSAI ప్రకటించింది.

మనం బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు సురక్షితం అని భావించి కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్లలో బిస్లెరీ ఒకటి. కానీ బిస్లెరీ ఇంటర్నేషనల్‌కు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితం కాదని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI కీలక ప్రకటన చేసింది. బిస్లెరీ వాటర్ లో నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు నాణ్యతా పరీక్షల్లో గుర్తించారు. దీంతో ఆ బిస్లెరీ ప్రొడక్ట్ నమూనాను నిబంధనలు పాటించని, త్రాగడానికి సురక్షితం ప్రొడక్ట్ గా ప్రకటించారు.
Bisleri కంపెనీ అప్పీల్ చేసిన తర్వాత మరోసారి రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో పరీక్షించారు. అక్కడ కూడా బ్రోమేట్ పరిమితికి మించినట్లు గుర్తించడంతో పాటు పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే రసాయనాలు సైతం ఉన్నాయని గుర్తించినట్లు FSSAI వెల్లడించింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం కింద విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది.
The Food Safety and Standards Authority of India (FSSAI) continues to maintain strict enforcement across food sectors to protect consumer health and enforce regulatory compliance… 1(2) https://t.co/TnTRvLujte
— FSSAI (@fssaiindia) November 22, 2026
బిస్లెరీతో పాటు మరో నాలుగు సంస్థలపై చర్యలు
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిస్లెరీతో పాటు టిట్-బిట్, వసంత్ మసాలా, ఫుడ్స్ ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు, పరిమితికి మించిన లోహాలు ఉన్నాయని గుర్తించారు. మిమన్సా ఇండస్ట్రీస్‌కు చెందిన వాల్‌నట్స్, ఆశా కన్ఫెక్షనరీకి చెందిన చాక్లెట్ కుకీస్‌పైనా నాణ్యత, భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మరో 2 సంస్థల లైసెన్సులను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు























