అన్వేషించండి

180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!

BYD లగ్జరీ బ్రాండ్ Denzaకు చెందిన Bao 5 SUV, 180 టన్నుల Boeing 747 విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగి సంచలనం సృష్టించింది.

Denza Bao 5 SUV Details: చైనా కంపెనీ BYDకి చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ Denza మరో కొత్త రికార్డ్‌ సృష్టించింది. Denza Bao 5 SUV ఏకంగా 180 టన్నుల బరువున్న బోయింగ్ 747 విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాక్కెళ్లింది  & ఈ అరుదైన విన్యాసంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రిటన్‌లోని సర్రే ప్రాంతంలో ఉన్న Dunsfold Aerodromeలో ఈ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. విమానాన్ని లాగేందుకు కారు ఇంజిన్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదని కంపెనీ చెబుతోంది.

నాలుగు టైర్లతో మొదలై.. రెండు టైర్ల వరకు!

Denza Bao 5 మొత్తం మూడు దశల్లో ఈ విన్యాసాన్ని పూర్తి చేసింది. మొదట నాలుగు చక్రాలు నేలను తాకేలా విమానాన్ని లాగింది. ఆ తర్వాత మూడు చక్రాలపై ప్రయత్నించింది. చివరగా కేవలం రెండు చక్రాలపైనే విమానాన్ని లాక్కెళ్లింది. ఈ మూడు ప్రయత్నాల్లో కలిపి SUV సుమారు 1.6 కిలోమీటర్ల దూరం వరకు విమానాన్ని తీసుకెళ్లింది.

ఈ ప్రదర్శనలో ఉపయోగించిన విమానం Boeing 747-400. ఈ విమానం బరువు సుమారు 180 టన్నులు. అంటే.. 1,80,000 కిలోలు. ఇంత భారీ విమానాన్ని లాగేందుకు Bao 5లోని సాధారణ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌నే ఉపయోగించారు.

రెండు చక్రాలపై విమానాన్ని లాగిన తొలి ప్రొడక్షన్‌ కారు ఇదేనని Denza వెల్లడించింది. అంతేకాదు, విద్యుత్ శక్తిని ఉపయోగించి Boeing 747ను లాగిన తొలి ప్రయత్నం కూడా ఇదేనని కంపెనీ చెబుతోంది.

539 bhp పవర్.. 760 Nm టార్క్

Denza Bao 5లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిలో రెండు మోటార్లు ముందు, వెనుక చక్రాలకు శక్తిని అందిస్తాయి. మూడో మోటార్ జనరేటర్‌గా పనిచేస్తుంది. ఈ హైబ్రిడ్ వ్యవస్థ మొత్తం 539 bhp గరిష్ఠ శక్తిని, 760 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ప్రత్యేక విన్యాసం కోసం పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని Denza స్పష్టం చేసింది. అంటే కారు సాధారణంగా ఉపయోగించే అదే ఇంజిన్, మోటార్లతోనే ఈ భారీ విమానాన్ని లాగింది. ప్రతి ప్రయత్నం తర్వాత Bao 5ను తమ బృందం తనిఖీ చేసిందని కంపెనీ తెలిపింది. పవర్‌ట్రెయిన్, ఛాసిస్ లేదా టైర్లపై ఎలాంటి ఒత్తిడి ప్రభావం కనిపించలేదని పేర్కొంది.

రెండు టైర్లపై ఎలా సాధ్యమైంది?

రెండు చక్రాలపై విమానాన్ని లాగేందుకు కారులో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెనుక ప్రయాణికుల సీట్లను తొలగించి, వాటి స్థానంలో 4,500 కిలోల అదనపు బరువును ఉంచారు. ఈ అదనపు బరువును ఆటోమొబైల్ పరిభాషలో బ్యాలస్ట్ అంటారు. బ్యాలస్ట్ వల్ల.. వాహనంలోని నడిచే చక్రాలపై ఎక్కువ భారం పడుతుంది. దీంతో వాటికి రహదారిపై మెరుగైన పట్టు లభిస్తుంది. మూడు చక్రాలపై నిర్వహించిన ప్రయత్నంలో 2,000 కిలోల బ్యాలస్ట్‌ను ఉపయోగించారు. అలాగే, చక్రాలు లేని చోట కారు సమతుల్యత దెబ్బతినకుండా ప్రతి యాక్సిల్‌కు చిన్న స్టెబిలైజర్లను అమర్చారు.

ఇది కూడా చదవండి: ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!

కారు బరువు కంటే విమానం బరువు ఎన్నో రెట్లు ఎక్కువ

Denza Bao 5 బరువు 3,035 కిలోలు. ఈ కారుకు కంపెనీ ప్రకటించిన టోయింగ్ సామర్థ్యం 2,500 కిలోలు మాత్రమే. కానీ ఈ ప్రదర్శనలో లాగిన Boeing 747 బరువు ఏకంగా 1,80,000 కిలోలు. అంటే సాధారణ టోయింగ్ సామర్థ్యంతో పోలిస్తే ఇది చాలా పెద్ద భారం.

బ్యాటరీ, రేంజ్ వివరాలు

Bao 5లో 31.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. BYDకు చెందిన సెల్‌-టు-ఛాసిస్‌ టెక్నాలజీతో బ్యాటరీని వాహన నిర్మాణంలోనే భాగంగా ఏర్పాటు చేశారు. ఈ SUV పూర్తిగా విద్యుత్ శక్తితో WLTP ప్రమాణాల ప్రకారం సుమారు 90 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. పెట్రోల్, విద్యుత్ శక్తి కలిపి మొత్తం రేంజ్ సుమారు 864 కిలోమీటర్లు.

ఈ SUV 0-100 kmph వేగాన్ని 5 సెకన్లలో అందుకోగలదని, గరిష్ఠంగా 180 kmph వేగంతో ప్రయాణించగలదని Denza వెల్లడించింది.

ఇది కూడా చదవండి: 17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!

సాధారణంగా, భారీ వాహనాలను లాగేందుకు ప్రత్యేక టోయింగ్ వాహనాలు అవసరమవుతాయి. అలాంటిది, సాధారణ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వ్యవస్థతోనే రెండు చక్రాలపై 180 టన్నుల విమానాన్ని లాగడం అనేది Denza Bao 5 సామర్థ్యాన్ని చాటిచెప్పే ప్రత్యేక ప్రదర్శనగా నిలిచింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget